ఏమాత్రం పొరపాటు చేసినా బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుంది?
ఎస్బిఐ కస్టమర్లకు ఫేక్ మెసేజ్ లు, వీటిని ఆపడం ఎలా?
నేటి సమాజంలో డిజిటల్ లావాదేవీలు తప్పనిసరి అయ్యాయి, బ్యాంకింగ్ మోసాల ప్రమాదాలు పెరిగాయి. ప్రజల బ్యాంకు ఖాతాల నుంచి డబ్బును దొంగిలించే దుండగులు రకరకాల వ్యూహాలు అవలంబిస్తున్నారు. అలాంటి వాటిలో ఫేక్ మెసేజ్ లు ఒకటి. ఇటీవల ఎస్ బిఐ కస్టమర్లకు ఫేక్ మెసేజ్‌లు పెరుగుతున్నాయి. బ్యాంకుల నుంచి ఈ మెసేజ్‌లు రావడం లేదని ప్రభుత్వం ప్రజలను హెచ్చరించినా ఈ దుండగుల ముఠా ఈ పని చేస్తూనే ఉంది. ఈ నకిలీ మెసేజ్ లను వెంటనే తొలగించాలని ప్రభుత్వం ప్రజలను కోరింది.
లింక్‌పై క్లిక్ చేయొద్దు
బ్యాంక్ వీటి గురించి ఎప్పుడు హెచ్చరిస్తూనే ఉంది. మొబైల్ ఫోన్లకు వస్తున్న నకిలీ మెసేజ్ లు ఎలా ఉంటున్నాయంటే, ‘మీ బ్యాంక్ ఖాతా బ్లాక్ చేయబడింద’ని అంటూ ఎస్ఎంఎస్ వస్తుంది. వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలని.. ఎస్‌బిఐ తన ఖాతాదారులను హెచ్చరిస్తూనే ఉంది. ఈ మెసేజ్‌లను మోసగాళ్లు పంపుతున్నారు. ఇలాంటి సందేశాలు వస్తే స్పందించవద్దని, వారు పంపే నకిలీ లింక్ లపై క్లిక్ చేయవద్దని బ్యాంక్ ప్రజలను కోరింది. ఒకవేళ బ్యాంక్ ఖాతా లాక్ అయిందంటూ మోసగాళ్లు నకిలీ కాల్స్ చేసినా స్పందించవద్దు. మీరు మీ ఆధార్, పాన్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు. మీ ఈ ఇమెయిల్ లోనూ ఇలాంటి మేసేజ్ లు వస్తాయి జాగ్రత్త.. వీటికి పరిష్కార మార్గం ఏమిటో తెలుసుకుందాం..
ఫేక్ మెసేజ్‌లలో చాలా తప్పులు
ఫేక్ మెసేజ్‌లో ఎస్బిఐ ఖాతాదారులకు ‘డియర్ అకౌంట్ హోల్డర్, ఎస్బిఐ బ్యాంక్ డాక్యుమెంట్ గడువు ముగిసింది. ఖాతా ఇప్పుడు బ్లాక్ చేయబడుతుంది. ఈ లింక్‌పై క్లిక్ చేసి నెట్‌బ్యాంకింగ్ ద్వారా అప్‌డేట్ చేసుకోండి’ మెసేజ్ చూస్తుంటే ఎస్ బీఐ నుంచి రాలేదని తెలుస్తోంది. సందేశంలో గ్రామర్ తప్పులు ఉండటమే కాకుండా, ఫార్మాట్ కూడా గందరగోళంగా కనిపిస్తుంది. వచ్చిన లింక్ కూడా ఎస్బిఐ అధికారిక వెబ్‌సైట్ నుండి కాదు.
‘మీ ఎస్బీఐ ఖాతా బ్లాక్ చేయబడిందని ఏమైనా ఫేక్ మెసేజ్ లు గనుక మీకు వస్తే, అలాంటి మెసేజ్ ల గురించి వెంటనే report.phishing@sbi.co.inలో ద్వారా ఫిర్యాదు చేయండి. దీనిపై బ్యాంకు వెంటనే చర్యలు తీసుకుంటుంది. ఎవరైనా ఇమెయిల్ లేదా మెసేజ్ ద్వారా వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ వివరాలను అడిగితే, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వవద్దు.