అద్భుతమైన పోస్ట్ ఆఫీస్ పథకం

Spread the love

  • ఒకసారి చెల్లించండి.. నెలకు సంపాదన రూ.5 లక్షలు చూడండి

పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం (POMIS) గురించి మీకు తెలుసా.. ఇప్పుడు పైన చెప్పింది ఈ పథకం గురించే.. పోస్టాఫీస్ చిన్న పొదుపు పథకాలు చిన్న పొదుపుల నుండి గ్యారెంటీ ఆదాయాన్ని పొందేందుకు గొప్ప మార్గం అనేది అందరికీ తెలుసు. ఈ స్కీమ్‌లలో జమ చేసిన తర్వాత, ప్రతి నెలా గ్యారెంటీ ఆదాయాన్ని పొందుతారు. ఈ పథకమే తపాలా కార్యాలయం(post office) నెలవారీ ఆదాయ పథకం (POMIS).. దీనిలో సింగిల్, జాయింట్ ఖాతాలను తెరవవచ్చు. MIS ఖాతాలో పెట్టుబడి తప్పకుండా చేయాలి. దీని మెచ్యూరిటీ ఖాతా తెరిచినప్పటి నుండి వచ్చే 5 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ పథకానికి ప్రభుత్వం అక్టోబర్ 1, 2023 నుండి 7.4 శాతం వార్షిక వడ్డీని చెల్లిస్తోంది.

నెలవారీ ఆదాయం ఎలా నిర్ణయిస్తారు?
ఈ పోస్టాఫీసు పథకంలో మీరు ఒకే ఖాతాలో రూ. 9 లక్షలు, జాయింట్ ఖాతాలో రూ. 15 లక్షలు జమ చేయవచ్చు. మీరు కోరుకుంటే, 5 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధి తర్వాత మీ మొత్తం అసలు మొత్తాన్ని తిరిగి పొందవచ్చు. కానీ అదే సమయంలో, దానిని మరో 5 సంవత్సరాలు పొడిగించవచ్చు. ప్రతి 5 సంవత్సరాల తర్వాత, ప్రిన్సిపల్‌ నగదును ఉపసంహరించుకోవడానికి లేదా ప్లాన్‌ని పొడిగించడానికి ఒక ఎంపిక ఉంటుంది. ఖాతాపై వచ్చే వడ్డీ ప్రతి నెలా మీ పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాలో జమ చేస్తారు.

5 లక్షలపై ఎంత రాబడి 
మీరు రూ. 5 లక్షలు డిపాజిట్ చేసినట్లయితే, ఈ పథకం కింద 7.4 శాతం వార్షిక వడ్డీ చెల్లిస్తారు. దీనిలో మీకు నెలకు రూ.3,083 ఆదాయం లభిస్తుంది. 12 నెలల్లో ఈ మొత్తం రూ.36,996 అవుతుంది.

డిపాజిట్ చేసిన తేదీ నుండి ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత మీరు ఈ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. మీరు ఒకటి నుండి మూడు సంవత్సరాల మధ్య విత్‌డ్రా చేస్తే, డిపాజిట్ మొత్తంలో 2 శాతం తీసివేసిన తర్వాత అది తిరిగి వస్తుంది. 3 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీకి ముందు విత్‌డ్రా చేస్తే, డిపాజిట్ మొత్తంలో 1% రీఫండ్ చేస్తారు.


Spread the love

Leave a Comment

error: Content is protected !!