ఈ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి (IFSC) కోడ్ మారింది..

Spread the love

పాత చెక్ బుక్ పని చేయదు, వెంటనే బ్రాంచ్ ను సంప్రదించండి

లక్ష్మీ విలాస్ బ్యాంక్ డిబిఎస్ బ్యాంక్ లో విలీనం అయిన విషయం తెలిసిందే. కావున కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. డిబిఎస్ (DBS) బ్యాంక్ ఇండియా లిమిటెడ్ (DBIL)తో విలీనం కావడం వల్ల లక్ష్మీ విలాస్ బ్యాంక్ (LVB) కస్టమర్‌లకు పాత IFSC కోడ్‌లు 2022 ఫిబ్రవరి 28 నుండి మారాయి. విలీనం తర్వాత అన్ని శాఖల ఐఎఫ్ఎస్సి(IFSC), ఎంఐసిఆర్(MICR) కోడ్‌లు మార్చారు. కొత్త కోడ్‌లు 2021 అక్టోబర్ 25 నుండి పనిచేస్తున్నప్పటికీ, పాత IFSC కోడ్ ఫిబ్రవరి 28 నుండి మారింది.


డిబిఎస్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, కస్టమర్‌లు 2022 మార్చి 1 నుండి NEFT/RTGS/IMPS ద్వారా డబ్బు లావాదేవీల కోసం కొత్త DBS IFSC కోడ్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఇప్పటికే బ్యాంకు లెటర్ లు పంపడం ద్వారా, ఇమెయిల్‌లు, ఎస్ఎంఎస్ ద్వారా బ్రాంచ్‌లలో మార్పుల గురించి కస్టమర్‌లకు తెలియజేసింది. కస్టమర్లు తమతమ రికార్డులను అప్‌డేట్ చేసుకోవాలి, కొత్త IFSC కోడ్‌లను పొందాలని కోరింది. ఇప్పటికే ఉన్న అన్ని చెక్కు బుక్ లను ఫిబ్రవరి 28 లోపు కొత్త వాటితో మార్పు చేసుకోవాలి. ఈ తేదీ తర్వాత పాత MICR కోడ్‌తో పాత చెక్కులు పనిచేయవు. 2021 నవంబర్ 1 నుండి అమలులోకి వచ్చే కొత్త చెక్కులు (కొత్త MICR కోడ్‌తో) అందుబాటులో ఉన్నాయి. కొత్త కోడ్‌లను గురించి తెలుసుకోవాలంటే వెబ్సైటలో ఇచ్చారు. కొత్త IFSC కోడ్‌లు / MICR కోడ్‌ల పూర్తి లిస్ట్ కోసం https://www.lvbank.com/view-new-ifsc-details.aspx ను సందర్శించి వివరాలను తెలుసుకోవచ్చు. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 45 ప్రకారం, 94 ఏళ్ల లక్ష్మీ విలాస్ బ్యాంక్ ను సింగపూర్ కు చెందిన డిబిఎస్ విలీనం చేశారు. ఈ విలీనం 2020 నవంబర్ 27 నుండి అమలులోకి వచ్చింది.


Spread the love

Leave a Comment