కార్డు టోకనైజేషన్ గురించి తెలియకపోతే మోసపోతారు..

Spread the love

మీరు క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే ఇది మీరు తప్పకుండా తెల్సుకోవాల్సిన విషయం..

ఇది మీకు తెలిస్తే మీరు సురక్షితంగా ఉంటారు..

షాపింగ్ కోసం క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగం ఇటీవల కాలంలో చాలా పెరిగింది. ఆన్‌లైన్ షాపింగ్ సమయంలో అనేక వెబ్‌సైట్‌లు, యాప్‌లలో మీ కార్డ్ వివరాలను సేవ్ చేయమని అడగడం మీరు గమనించే ఉంటారు. ఇలా ఆన్ లైన్ చెల్లింపు వేగంగా సులభంగా జరుగుతుంది. కానీ ఇది సురక్షితం కాదనే విషయం తెలుసు.. ఇక్కడే మనం అజాగ్రత్త వహిస్తే మోసపోతాం, అందుకే ఆర్బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) టోకనైజేషన్ అనే విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇది బ్యాంకు కార్డుల భద్రత కోసం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. మీరు కోరుకుంటేనే మీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లోని సున్నితమైన సమాచారం వెబ్‌సైట్‌లు, యాప్‌లలో సేవ్ అవుతుంది. లేకపోతే అది జరగదు. దీని కోసం రిజర్వ్ బ్యాంక్ (RBI) తీసుకొచ్చిన ఈ టోకనైజేషన్ వ్యవస్థ వినియోగదారులకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం..

టోకనైజేషన్ అంటే ఏమిటి?

కార్డ్ టోకనైజేషన్ ప్రాథమికంగా ఆన్‌లైన్ కార్డ్ లావాదేవీల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఈ టోకెన్‌తో మీ వాస్తవ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాల బదులుగా ఈ టోకెన్ వివరాలు ఉంటాయి. దీని వల్ల మీ కార్డ్ వివరాల ఉల్లంఘనలు, ఆన్‌లైన్ లీక్‌ల బారిన పడకుండా సురక్షితంగా ఉంటారు. టోకనైజేషన్ అంటే క్రెడిట్, బిట్ కార్డ్ వివరాలను ‘టోకెన్’ అని పిలిచే ప్రత్యామ్నాయ కోడ్‌తో భర్తీ చేయడం అన్నమాట.

టోకనైజేషన్ ప్రయోజనాలేమిటి?

టోకనైజేషన్ కార్డ్ వివరాల వల్ల మోసం జరిగే అవకాశాలు తగ్గుతాయి.

పాయింట్-ఆఫ్-సేల్ (పిఒఎస్) టెర్మినల్స్, QR కోడ్ చెల్లింపులలో కాంటాక్ట్‌లెస్ కార్డ్ లావాదేవీలను నిర్వహించడానికి టోకెన్ ఉపయోగిస్తారు.

కార్డ్ నెట్‌వర్క్‌లు, కార్డ్ జారీ చేసే బ్యాంకులు మాత్రమే ఏదైనా కార్డ్ డేటాకు యాక్సెస్‌ను కలిగి ఉంటాయి. నిల్వ చేయగలవు.

షాపింగ్ ఎలా సురక్షితం?

మెరుగైన భద్రత కోసం ఇకపై టోకెనైజేషన్.. ఒరిజినల్ కార్డ్ వివరాలు వ్యాపారితో షేర్ అవ్వవు. కార్డు వివరాలు దీని వల్ల సురక్షితంగా ఉంటాయి. ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్‌లో చెక్ అవుట్ సమయంలో క్రెడిట్, డెబిట్ కార్డ్‌ని ఎంచుకోండి. సివివి వివరాలను అందించండి. మీ కార్డ్‌ని సెక్యూర్ యువర్ కార్డ్ లేదా సేవ్ కార్డ్ ఎడ్జ్‌పై ఆర్బిఐ మార్గదర్శకాలు ఉంటాయి. ముందు ఉన్న చెక్ బాక్స్‌ను టిక్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేయండి. దీని తర్వాత మీ కార్డ్ వివరాలు ఆ వెబ్‌సైట్ లేదా యాప్‌లో సురక్షితంగా ఉంటాయి.

నా డేటా ఎలా సురక్షితంగా ఉంటుంది?

అసలు కార్డ్ డేటా, టోకెన్, ఇతర వివరాలు బ్యాంక్ లేదా కార్డ్ నెట్‌వర్క్‌తో ఎన్‌క్రిప్టెడ్ మోడ్‌లో స్టోర్ అవుతాయి. షాపింగ్ వెబ్ పేజీలో కార్డ్ చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తాయి. ఒకటి కంటే ఎక్కువ కార్డులు ఉన్నట్లయితే చివరి నాలుగు అంకెలను గుర్తించి మీకు కావలసిన కార్డును ఉపయోగించండి.

అందరికీ కార్డ్ టోకెన్ అవసరమా?
మీరు మీ కార్డ్‌ని టోకనైజ్ చేయకూడదని కూడా ఎంచుకోవచ్చు. ఇది కస్టమర్ సమ్మతితో మాత్రమే జరుగుతుంది. మీరు దీన్ని చేయకుంటే వ్యాపారి వెబ్‌సైట్‌లు, యాప్‌లలో ఇప్పటికే సేవ్ చేసిన వివరాలు అక్టోబర్ 1లోపు తీసివేస్తారు. అప్పుడు మీరు చెల్లింపు చేసిన ప్రతిసారీ మీరు పూర్తి కార్డ్ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. టోకనైజేషన్ ప్రతిసారీ కార్డ్ వివరాలను నమోదు చేయకుండా సేవ్ చేస్తుంది.

టోకెన్‌కు ఏదైనా చార్జీ చెల్లించాలా?
ఈ సేవలకు మీరు ఎటువంటి ఛార్జీని చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రతి షాపింగ్ వెబ్‌సైట్‌లో కార్డ్ వివరాలు వేర్వేరుగా భద్రపరుస్తారు. ఈ పోర్టల్ ద్వారా కార్డ్ టోకనైజేషన్‌ను వీక్షించవచ్చు లేదా తొలగించవచ్చు. అప్‌గ్రేడ్‌లో కార్డ్ పోయినా లేదా మార్చబడినా టోకనైజేషన్ కొత్తగా చేయాల్సి ఉంటుంది.

సాధారణ షాపుల్లో కూడా టోకనైజేషన్ ఉంటుందా?
సాధారణ షాపుల్లో పీఓఎస్ మెషీన్ల ద్వారా జరిగే లావాదేవీలకు కార్డుల టోకనైజేషన్ ఉండదు. ఇది ఆన్‌లైన్ లావాదేవీల కోసం మాత్రమే ఉంటుంది.

కార్డ్‌ని టోకనైజ్ చేయడం తప్పనిసరా? కాదా?

ఆర్బిఐ ప్రకారం, మీ కార్డ్‌ని టోకనైజ్ చేయడం తప్పనిసరి కాదు. మీ ఇష్టానుసారం మీ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లను టోకనైజ్ చేయడానికి ఎంచుకోవచ్చు.

క్రెడిట్, డెబిట్ కార్డులను టోకనైజ్ చేయడం ఎలా?

ఆర్బిఐ మార్గదర్శకాల ప్రకారం కార్డ్‌ను సేవ్ చేయండి. చెక్‌బాక్స్‌ని ఎనేబుల్ చేసి, ఏదైనా యాప్ లేదా వెబ్‌సైట్‌లో లావాదేవీని పూర్తి చేయండి. అది స్వయంచాలకంగా టోకనైజ్ అవుతుంది. మొబైల్ ఫోన్‌లు లేదా టాబ్లెట్‌లలో లావాదేవీని నిర్వహించడానికి ఇది వినియోగించుకోండి.

కార్డులను టోకనైజ్ చేయడానికి ఏదైనా రుసుము ఉందా?

కార్డ్‌ని టోకనైజ్ చేయడానికి ఎటువంటి ఛార్జీలు లేవు.


Spread the love

Leave a Comment

error: Content is protected !!