వాటి గురించి తెలుసుకోండి..
ప్రజలకు గుర్తింపు కార్డుగా ఆధార్ కార్డు ఎంత ముఖ్యమైందో అందరికీ తెలుసు. ఆధార్ కార్డు లేకుండా ఏ పనైనా చేయడం కష్టమే. ఆధార్ కార్డు మిగిలిన ఐడి లతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే అందులో ప్రతి పౌరుడి బయోమెట్రిక్ సమాచారం నమోదు చేస్తారు. ప్రతి పౌరుడి వేలిముద్రలు, కంటి రెటీనాను స్కాన్ చేస్తారు. అందువల్ల ఇది రేషన్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైన ఇతర ఐడీ రుజువుల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. పిల్లలను స్కూలు, కాలేజీల్లో చేర్చుకోవడం, బ్యాంకు ఖాతా తెరవడం, ప్రయాణ సమయంలో, హోటల్ బుకింగ్, ఆస్తులు కొనుగోలు చేయడం, మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం వంటి వాటికి ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. ఆధార్ కార్డ్‌లో ప్రతి పౌరుడి పేరు, ఫోటో, పుట్టిన తేదీ, చిరునామా మొదలైన అన్ని అవసరమైన సమాచారం నమోదు చేస్తారు. ప్రజల సౌకర్యార్థం అనేక రకాల ఆధార్ కార్డులు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆధార్ కార్డులన్నింటిలో ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఒకే విధంగా ఉంటుంది. ఈనఆధార్ కార్డ్ రకాలు, వాటి ప్రత్యేక లక్షణాలను తెలుసుకుందామా..
1. ఆధార్ లెటర్
ఆధార్ లెటర్ పౌరులందరి ఇంటికి యుఐడిఎఐ ద్వారా పంపుతారు. ఇది మందపాటి ఆధార్ కార్డ్, దీనిలో మన సమాచారం మొత్తం నమోదు చేస్తారు. ఎలాంటి రుసుము లేకుండా ఆధార్ కార్డును తయారు చేసిన తర్వాత యుఐడిఎఐ ఈ ఆధార్ కార్డును ఇంటి చిరునామాకు పంపుతారు. ఈ కార్డులో ఆధార్ కార్డ్ హోల్డర్ మొత్తం సమాచారం ఉంటుంది.
2. ఎం-ఆధార్ కార్డ్
ఎం ఆధార్ కార్డ్ (mAadhaar) అనేది ఒక మొబైల్ యాప్, దీని ద్వారా ఆధార్ కార్డ్ సాఫ్ట్ కాపీ రూపంలో సురక్షితంగా ఉంటుంది. మీరు ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుండి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో ఆధార్ వివరాలను నమోదు చేసి మీ ఆధార్‌ను సేవ్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్‌లో ఎలాంటి అప్‌డేట్ చేసినా, MAadhaar కార్డ్ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతుంది. దీన్ని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
3. పివిసి ఆధార్ కార్డ్
పివిసి ఆధార్ కార్డ్ ఎటిఎం కార్డ్ లాగా కనిపిస్తుంది. ఈ ఆధార్ కార్డ్ ప్రత్యేక ఆర్డర్ ద్వారా తయారు చేస్తారు. ఈ ఆధార్ కార్డ్‌లో డిజిటల్ క్యూఆర్ కోడ్ కూడా ఉంది. దీనిలో మీ మొత్తం సమాచారం ఉంటుంది. రూ.50 ఫీజు చెల్లించి యుఐడిఎఐ(UIDAI) అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ కార్డ్ కోసం ఆర్డర్ చేయవచ్చు. ఈ కార్డు వర్షం నీటిలో కూడా తడవదు, చిరిగిపోదు.
4. ఇ-ఆధార్ కార్డ్
ఇ-ఆధార్ కార్డు అనేది ఎలక్ట్రానిక్ వెర్షన్ అని చెప్పవచ్చు. ఈ కార్డ్‌లో సురక్షితమైన క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ కార్డ్ పాస్‌వర్డ్‌తో భద్రపర్చినందు వల్ల ఓపెన్ చేయడానికి పాస్‌వర్డ్ అవసరమవుతుంది. యుఐడిఎఐ ఈ ఆధార్ కార్డ్‌ను సురక్షితంగా ఉంచేందుకు మాస్క్డ్ ఇ-ఆధార్ కార్డ్‌ని కూడా జారీ చేస్తుంది. ఈ కార్డ్‌లో చివరి నాలుగు సంఖ్యలు మాత్రమే పేర్కొంటారు. దీంతో మీ ఆధార్ కార్డు డేటా దొంగిలించడానికి ఆస్కారం ఉండదు.
ఆధార్ గురించి పూర్తి వివరాల కోసం .. https://uidai.gov.in/ ను సందర్శించండి.
Very nice post. I just stumbled upon your blog and wanted to say that I’ve really enjoyed browsing your blog posts. In any case I’ll be subscribing to your feed and I hope you write again soon!