రూ.50 లక్షలకు బిట్ కాయిన్

Spread the love

ఆల్ టైమ్ గరిష్ఠానికి బిట్‌కాయిన్, ఈథర్

క్రిప్టోకరెన్సీలు క్రమక్రమంగా విలువ పరంగా పెరుగుతూనే ఉన్నాయి. వీటికి చట్టబద్ధత ప్రశ్నార్థకంగా ఉన్నప్పటికీ, డిమాండ్ ఉండడం వల్ల విలువ పెరుగుతోంది. క్రిప్టోకరెన్సీ పట్ల ఆసక్తి, ద్రవ్యోల్బణం ఆందోళనలు, అసెట్ క్లాస్ లో ప్రవాహం వెరసి బిట్‌కాయిన్, ఈథర్ లు సరికొత్త శిఖరాలను చేరుకున్నాయి. అమెరికాలో ఈ రెండు వర్చువల్ కరెన్సీలు వాటి గరిష్ట స్థాయి నుండి వెనక్కి తగ్గినప్పటికీ మళ్లీ పెరుగుతున్నాయి. మరోవైపు భారత్ లో వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో క్రిప్టోకరెన్సీపై బిల్లు ప్రవేశపెట్టవచ్చని తెలుస్తోంది. దీంతో దీని చట్టబద్ధతపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక బిట్‌కాయిన్ 66,530 డాలర్లకు అంటే భారత కరెన్సీలో 49,52,800 అన్నమాట. ఇక ఈథర్ మార్కెట్ విలువ ప్రకారం రెండవ అతిపెద్ద క్రిప్టోకరెన్సీగా ఉంది. ఇది కూడా 4,727 డాలర్లు చేరుకుంది. అంటే భారత కరెన్సీలో 3,51,675 డాలర్లు అన్నమాట. అయితే ఈ విలువ పెరగవచ్చు, తగ్గవచ్చు. ఈ రెండూ జూన్ నెల నుంచి రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగాయి.

క్రిప్టోకరెన్సీలలో పెట్టుబడి పెట్టే ముందు మనం చాలా జాగ్రత్త వహించాలి. భారతదేశంలో క్రిప్టో మోసాలు పెరిగాయి. గత 6 నెలల్లో రెండు లక్షలకు పైగా ఖాతాలు బ్లాక్ చేశారు. భారతదేశంలో క్రిప్టోకరెన్సీలు ఇంకా గుర్తించలేదు. అయితే ఇన్వెస్టర్లతో పాటు మోసగాళ్లు కూడా దీనిపై ఎంతో ఆసక్తి చూపిస్తూ మయాజాలం చేస్తున్నారు. దీంతో గత ఆరు నెలల్లో 4 లక్షలకు పైగా క్రిప్టో ఖాతాలను బ్లాక్ చేశారని సమాచారం. పన్ను ఎగవేత, మోసం, నేర కార్యకలాపాలకు పాల్పడడం వల్ల దేశంలో మూడు క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీలు ఈ చర్య తీసుకున్నాయి. వీటిలో WazirX, CoinSwitch Kuber, Coin DCX వంటి ఎక్స్ఛేంజీలు ఉన్నాయి. Coinswitch Kuber 1.80 లక్షల ఖాతాలను సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. వాజిర్‌ఎక్స్‌కు ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఎక్స్ఛేంజీలు వారి స్థాయిలో అనుమానాస్పద ఖాతాలను బ్లాక్ చేస్తున్నప్పటికీ అసలు సమస్య ఏమిటంటే నియంత్రణ లేకపోవడం. ఆర్బిఐ ఇప్పటికే క్రిప్టోలపై అభ్యంతరం వ్యక్తం చేయగా, ప్రభుత్వం దీనిపై ఇంకా స్పష్టతనివ్వాల్సి ఉంది.

క్రిప్టోకరెన్సీలపై కొన్ని విషయాలు

  • షిబా ఇను కాయిన్ వేగంగా పెరిగింది. బిట్‌కాయిన్ నుండి డాగ్ కాయిన్, ఎథెరియం పెట్టుబడిదారులకు గొప్ప రాబడులను ఇచ్చాయి. షిబా ఇను చాలా వేగంగా పెరుగుతోంది. ఈ కాయిన్ డాగ్‌కోయిన్ నుండి ప్రేరణ పొందిందని అంటారు.
  • క్రిప్టోకరెన్సీలపై టెస్లా సిఇఒ ఎలోన్ మస్క్ ప్రభావం ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తోంది. ఎలోన్ మస్క్ డాగ్‌కోయిన్‌ని సమర్థిస్తూ ట్విట్టర్ లో పోస్టులు పెట్టడం వల్ల షిబా రేట్లలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. షిబా ఇను పెరుగుదలకు ఎలోన్ మస్క్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఆయన ట్వీట్లతో దీని విలువ వేగంగా పెరిగింది. అయితే ఎలాంటి కారణం లేకుండా ఈ క్రిప్టోలో పెట్టుబడులు మంచివి కావని నిపుణులు సూచిస్తున్నారు.
  • బిట్‌కాయిన్ విషయానికొస్తే కాయిన్ బేస్.కామ్ ప్రకారం, గత ఏడాదిలో బిట్ కాయిన్ పెట్టుబడిదారులకు 8000 శాతం రాబడిని ఇచ్చింది. నేటి మార్కెట్‌లో రూ .50 లక్షలకు చేరువలో ఉంది.
  • ప్రపంచంలోన అత్యంత సంపన్నడు అయిన ఎలోన్ మస్క్ ఇటీవల డాగ్ కాయిన్ కు పరోక్షంగా మద్దతు తెలుపుతూనే ఉన్నాడు. ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఏదో ఒక రూపంలో దీనికి అనుకూలంగా ప్రకటన చేస్తూనే ఉన్నాడు. అయితే ఈ క్రిప్టోకరెన్సీ గతేడాదిలో చాలా మంది పెట్టుబడిదారులను ధనవంతులను చేయడానికి కారణం ఇదేనని చెప్తారు. ఎలోన్ మస్క్ తన పెంపుడు కుక్క ఫ్లోకి షిబా ఇను ఫోటోను ఉంటుంది. అయితే ఆయన గత కొన్ని రోజులుగా ట్విట్టర్‌లో ఈ ఫోటోను షేరు చేస్తున్నారు. దీంతో ఈ షిబా ఇను (SHIBA) కాయిన్ చాలా లాభపడింది. మస్క్ కూడా తన పోర్ట్‌ఫోలియోలో షిబాను కూడా కలిగి ఉన్నాడని అంతా భావించారు. కానీ తన వద్ద ఒక్క షిబా టోకెన్ కూడా లేదని ఆయన స్పష్టం చేసారు. తన క్రిప్టో పోర్ట్‌ఫోలియోలో డాగ్‌కాయిన్‌, ఇంకా బిట్‌కాయిన్, ఎహెరియం ఉన్నాయని ఆయన వెల్లడించాడు.
గమనిక .. క్రిప్టో మార్కెట్ చాలా హెచ్చుతగ్గులకు గురవుతుంది. ఇది ఎంతో రిస్క్ తో కూడినది. ఈ క్రిప్టో కరెన్సీలో భారీ లాభాలు కనిపిస్తాయి. అంతేవిధంగా భారీ నష్టాలను కూడా తెచ్చిపెడ్తాయి. కొనే ముందు వినియోగదారులు తమ వ్యక్తిగత సలహాదారుల సలహా తీసుకోవాలి. ఇది అవగాహన కోసం మాత్రమే, తెలుగుపైసా.కామ్ ఇన్వెస్ట్ చేయమని సలహా ఇవ్వదు, ఎలాంటి బాధ్యత వహించబోదు.
https://telugupaisa.com/%e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%aa%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8b%e0%b0%95%e0%b0%b0%e0%b1%86%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b8%e0%b1%80-%e0%b0%87%e0%b0%82%e0%b0%a4-%e0%b0%aa%e0%b0%be%e0%b0%aa%e0%b1%81/
Spread the love

Leave a Comment

error: Content is protected !!