స్నేహితులకు లేదా బంధువులకు రుణం ఇస్తున్నారా?

Spread the love

ఈ సూచనలను పాటించండి..

అత్యవసరంగా డబ్బు కావాల్సినప్పుడు మనం ముందుగా స్నేహితులను, దగ్గరి బంధువులను అడుగుతాం. అయితే ఎదుటివారు నమ్మకస్తులే అయితే నష్టం లేదు, అలాంటి వారు కాకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులకు డబ్బు లేదా అప్పు ఇవ్వాల్సి వస్తే, మనం భావోద్వేగంలో నిర్ణయం తీసుకుంటే, ఆ తర్వాత బాధపడాల్సి వస్తుంది. అందువల్ల రుణం తీసుకున్న ఆ డబ్బు మీ ఆదాయపు పన్ను చట్టాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. రుణాన్ని తిరిగి చెల్లించినప్పుడు, మొత్తం ఎక్కువగా ఉంటుంది. ఈ సందర్భంలో బ్యాంక్ మిమ్మల్ని కారణాన్ని అడగవచ్చు.

కరోనా సంక్షోభం సమయంలో చాలా మంది ఆర్థికంగా అవస్థలు ఎదుర్కోవాల్సి వచ్చింది. స్నేహితులు, బంధువులకు సహాయం చేయడం మంచిదే. బ్యాంకులు ఇవ్వలేని పరిస్థితిలో దగ్గరి వారే ఆదుకుంటారు. చాలా మంది అప్పులు చేశారు. ఈ అప్పులకు కొందరు వడ్డీ వసూలు చేస్తే, మరికొందరు వడ్డీ లేకుండా సహాయం చేస్తారు. అయితే ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, రూ. 20,000 కంటే ఎక్కువ తీసుకోవడం లేదా రుణం ఇవ్వడం చట్టరీత్యా నేరంగా పరిగణిస్తారు. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 269ఎస్ఎస్ ఏ వ్యక్తి ఖాతాలో రూ. 20,000 లేదా అంతకంటే ఎక్కువ నగదును డిపాజిట్ చేయడం లేదా రుణం ఇవ్వడాన్ని నిషేధిస్తుంది. అయితే, ఈ మొత్తాన్ని చెక్ లేదా ఆన్‌లైన్ ద్వారా బదిలీ చేయవచ్చు. అదే సమయంలో సెక్షన్ 271డి సెక్షన్ 269ఎస్ఎస్ ఉల్లంఘించడం చట్టరీత్యా నేరమని పేర్కొంది. సెక్షన్ 269ఎస్ఎస్ ని ఉల్లంఘించినందుకు ఒక వ్యక్తి దోషిగా తేలితే, అతను అంతే జరిమానాను చెల్లించవలసి ఉంటుంది. అంటే రూ.5 లక్షల నగదు తీసుకున్నారంచే, దీనికి గాను అంతే మొత్తాన్ని జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది.

దీనికి పరిష్కారం ఏమిటి?

స్నేహితులకు రుణాన్ని తిరిగి చెల్లించినప్పుడు, మొత్తం ఎక్కువగా ఉంటుంది. ఈ సందర్భంలో బ్యాంక్ మిమ్మల్ని ప్రశ్నించవచ్చు. దీన్ని నివారించడానికి మీరు రుణదాతతో ఒప్పందం చేసుకోవాలి. రుణం తీసుకున్న డబ్బు మొత్తం, తిరిగి చెల్లించిన తేదీ, నిబంధనలతో పాటు ఇతర వివరాలు ఉండాలి. అందువల్ల భవిష్యత్తులో డబ్బు డిపాజిట్ చేసేటప్పుడు ఈ ఒప్పందం కాపీని బ్యాంకుకు చూపవచ్చు.

ఈ విషయాలు తెలుసుకోండి..

  • మీరు మీ సామర్థ్యాన్ని బట్టి స్నేహితులకు లేదా బంధువులకు డబ్బు ఇవ్వాలి. ఎదుటి వ్యక్తి ఎక్కువ డబ్బు అడిగినా, మీరు ఇవ్వగల్గినంతే ఇవ్వాలి.
  • రుణం ఇచ్చేటప్పుడు ఎదుటి వారి అవసరం ఏమిటో తెలుసుకోండి. కారణం సరైందిగా అనిపిస్తే మాత్రమే ఇవ్వండి. మీరు సంతృప్తి చెందకపోతే రుణం చెల్లించవద్దు. చదువుకు అయ్యే ఖర్చు, అమ్మాయి పెళ్లి ఖర్చు, వైద్యం వంటివాటికి ఇవ్వొచ్చు. కానీ షికారు చేయడానికి, సరదాగా గడపడానికి డబ్బు అడిగితే వద్దు.
  • కేవలం ఒక సాధారణ కాగితంపై సంతకం చేసి రుణాన్ని ఇవ్వడం ప్రమాదకరం. ఎందుకంటే, డబ్బు ముంచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు తెలుసు, ఎవ్వరినీ నమ్మడానికి వీలులేదు.
  • రుణం చెల్లించేటప్పుడు ఒకరు లేదా ఇద్దరు సాక్షులు ఉండాలి. ఒంటరిగా చెల్లించడం సరికాదు. ఆన్‌లైన్‌లో బదిలీ చేయడం అనేది చెల్లింపు రుజువుగా ఉంటుంది.
  • రుణం తీసుకున్నవారి ఆర్థిక పరిస్థితులను కూడా పరిశీలించడం ఎంతో ముఖ్యం. ఉద్యోగి అయితే రుణం తిరిగి చెల్లించే అవకాశం ఉంది. నోటరీ సంతకంతో అప్పు ఇస్తే చట్టపరమైన రుజువు చేతిలో ఉంటుంది.

Spread the love

Leave a Comment

error: Content is protected !!