ధనవంతులు కావాలంటే ఆర్థిక లక్ష్యాలు ఉండాలి..

Spread the love

మీకోసం గోల్డెన్ సేవింగ్స్ టిప్స్.. అవేంటో తెలుసుకుందాం…

కొత్తగా సేవింగ్స్ ప్రారంభించాలనుకుంటే ముందు మీ లక్ష్యాన్ని నిర్ణయించుకోండి. మనీ సేవింగ్స్ కు లక్ష్యాలను నిర్ణయించుకోవడం బెస్ట్ పద్ధతి. ఒకటికి మించి కూడా మీ గోల్స్ ఉండవచ్చు. ఉదాహరణకు కారు లేదా ప్రాపర్టీ వంటివి కొనడం. మీ డబ్బును రెండు సేవింగ్ లక్ష్యాలకోసం విభజించండి. అలా ఎందుకంటే, ఒకవేళ ఒకటి ఆగినా, మరొక దానిపై ఆ ప్రభావం పడదు. పొదుపు లక్ష్యాలు స్వల్ప కాలికమైనవి (షార్ట్ టర్మ్) కావచ్చు, లేదా దీర్ఘకాలికమైనవి (లాంగ్ టర్మ్) కావచ్చు. ఉదాహరణకు మరో రెండు మూడేళ్లలో ఓ ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారనుకోండి. అప్పుడు మీరు షార్ట్ టెరం పొదుపు మార్గాన్ని ఎంచుకోవాలి. ఒకవేళ మీ ఓల్డేజ్ లో పెన్షన్ ఉంటే బాగుంటుంది అనుకున్నారనుకోండి. అప్పుడు లాంగ్ టెరం సేవింగ్ లక్ష్యం గురించి ఆలోచించండి. మీరు ఆర్థిక ఆదాయ లక్ష్యాలను నిర్ణయించుకున్న తర్వాత చాలాకాలంపాటు పొదుపును కొనసాగించాలి.

స్వల్పకాలిక (షార్ట్ టర్మ్) లక్ష్యాలు:

వీటికి ఏడాది నుంచి నాలుగేళ్ల పరిమితిని ఏర్పరచుకోవచ్చు. ఉదాహరణకు: కొత్త కారు కొనడం. సరదాగా వెకేషన్ గడపడం. అత్యవసరంగా వచ్చే మెడికల్ ఖర్చులు. కొన్ని రెన్యువల్స్.

దీర్ఘకాలిక (లాంగ్ టర్మ్) లక్ష్యాలు:

వీటి కాలపరిమితి నాలుగేళ్ల పైబడి ఉంటుంది. ఉదాహరణకు: పిల్లల చదువులు, పెళ్లిళ్లు. పదవీ విరమణ. కొత్త ప్రాపర్టీని కొనడం. కొత్త వ్యాపారం ప్రారంభించడం.

ఆటోమేట్ మంత్లీ సేవింగ్స్

నెలనెలా కొంత మొత్తం పొదుపు చేయాలని నిశ్చయించుకుంటే, దానికి ఆటో డెబిట్ నిర్ణయించుకోండి. రికరింగ్ డిపాజిట్లు, ఎస్ఐపిలు వంటి ప్లాన్స్ ద్వారా చాలా బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు ఆటోమేటెడ్ సేవింగ్స్ ఇన్వెస్ట్ మెంట్స్ ను ఆఫర్ చేస్తున్నాయి. మీరు ఒకసారి ఈ విధానాన్ని ఎంచుకుంటే ఇంక మీకు సేవింగ్స్ గురించి చింత ఉండదు. మీరు పేర్కొన్న ఆదేశాల ప్రకారం మీ సేవింగ్స్ ప్రాసెస్ ఆటోమేటిక్ గా పూర్తవుతుంది. దీనివల్ల మీ ఆర్థిక జీవితం ఒక క్రమశిక్షణతో సాగుతుంది. అలాగే సమయం కూడా ఆదా అవుతుంది. అంతేకాక, ప్రతి నెలా, లేదా ప్రతి వారం ఎలా పొదుపు చేయాలా అని విచారించక్కర్లేదు.

లాంగ్ టర్మ్ సేవింగ్స్ ఎలా చేయవచ్చు?

దీర్ఘకాలిక ఆదాయ మార్గాలు మనకు అనువైన, సహజమైన సంపద సాధనాలు. కనీసం ఒకటైనా లాంగ్ టర్మ్ సేవింగ్ స్కీమ్ ను కలిగి ఉండడం మంచిది. అది రకరకాలుగా ఉపయోగపడుతుంది. పిల్లల చదువులు, పెళ్లిళ్లు వంటివాటికి లాంగ్ టర్మ్ చాలా బాగా పనికొస్తుంది. అలాంటిది ఒక్కటైనా ఉంటే మన లైఫ్ కు సెక్యూరిటీ. మన దేశంలో దీర్ఘకాలిక పొదుపు పథకాలు చాలానే ఉన్నాయి. మీకు తగినవి సెలెక్ట్ చేసుకుని మనీ సేవింగ్ ప్రారంభించవచ్చు. లాంగ్ టర్మ్ సేవింగ్స్ లో సావరిన్ గోల్డ్ బాండ్, పిపిఎఫ్, మూచ్యువల్ ఫండ్, బాండ్స్ వంటివి ఉన్నాయి.

క్రియేట్ పెన్షన్ ఫండ్:

ఒక్కసారి ఆలోచించండి. మీకు 60 ఏళ్లు వస్తే అప్పుడు మీరు సంపాదించలేరు. కానీ మీ అవసరాలకు డబ్బు కావాలి. ఎలా మరి? అప్పుడు పెన్షన్ ఒక్కటే సరైన మార్గం. ఓల్డేజ్ లో అదే మీకు తోడ్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పెన్షన్ ప్లాన్ తీసుకోవాలి. మీరు పెన్షన్ ఫండ్ ను ఎంచుకోవచ్చు. పెన్షన్ ఫండ్స్ లాంగ్ టెరం సేవింగ్ ప్లాన్స్. ఈ పెన్షన్ ఫండ్ గడువు తీరాక, మీరు పదవీ విరమణ చేసిన తర్వాత రెగ్యులర్ గా ఆదాయాన్ని పొందవచ్చు. ఇండియాలో ప్రభుత్వ నిర్వహణలో ఉన్న పాపులర్ పెన్షన్ ఫండ్ ఏమిటంటే ‘నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్ పిఎస్). అది పిఎఫ్ ఆర్ డి ఎ నిర్వహణలో ఉంది. ప్రభుత్వోద్యోగులు కానీ, మరెవరైనా కానీ ఈ పెన్షన్ స్కీమ్ ను ఎంచుకోవచ్చు.

పన్నులేని సేవింగ్ స్కీమ్స్ లో పెట్టుబడి

పన్ను పడని సేవింగ్స్ స్కీమ్స్ (టాక్స్ సేవింగ్స్ స్కీమ్స్) లో మీరు డబ్బును పొదుపు చేసుకోవచ్చు. పెట్టుబడి మీద ఈ స్కీమ్స్ అదనపు పన్ను రాయితీలను ఇస్తాయి. ఉదాహరణకు … 80 సి ఆదాయపు పన్ను చట్టం కిందికి వచ్చే టాక్స్ సేవింగ్స్ స్కీమ్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు 1.5 లక్షల రూపాయల వరకూ పన్నును తగ్గించుకోవచ్చు.

మీరు పన్ను చెల్లింపుదారులైతే… పన్నును తగ్గించుకోవడం ద్వారా మనీ సేవ్ చేయడం మంచిది. ఇండియాలో రకరకాల టాక్స్ సేవింగ్ ప్లాన్స్ ఉన్నాయి. అది సేవింగ్స్ కావచ్చు. ఇన్వెస్ట్ మెంట్ కావచ్చు లేదా బీమా అయినా కావచ్చు. వాటిలో ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి 1.5 లక్షల నుంచి 2.5 లక్షల వరకూ పొదుపు చేయగలగుతారు. ఒకటి గుర్తుంచుకోండి. పన్ను మినహాయింపు పొందడం కూడా సేవింగ్సే.

కొన్ని టాక్స్ సేవింగ్స్ ప్లాన్స్:

-ఇఎల్ ఎస్ ఎస్ (ఈక్విటీ లింక్ డ్ సేవింగ్ స్కీమ్)
-పిపిఎఫ్ (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్)
-ఎస్ ఎస్ వై (సుకన్యా సమృద్ధి యోజన)
-ఎన్ పిఎస్ (నేషనల్ పెన్షన్ స్కీమ్)
-యులిప్ (యూనిట్ లింక్ డ్ ఇన్సూరెన్స్ ప్లాన్)
-ఎస్ సిఎస్ ఎస్ (సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్)
-టాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్
-లైఫ్ ఇన్సూరెన్స్

పెట్టుబడిదారుడిగా మారండి

పెట్టుబడి, పొదుపు రెండూ ఒకటి కాదు. పెట్టుబడి అంటే మీ డబ్బును ఏదైనా బిజినెస్, ప్రాజెక్ట్ లు, ఆస్తుల వంటి వాటిపై పెట్టడం. దేశంలో పాపులర్ పెట్టుబడి మార్గాలు: స్టాక్స్. రియల్ ఎస్టేట్. బంగారం, మూచ్యువల్ ఫండ్, బాండ్స్ వంటివి. అయితే, పెట్టుబడిపై నికరాదాయం వస్తుందని అనుకోవద్దు. పెట్టుబడి పెట్టిన ప్రాజెక్ట్ పనిచేయడంపై దాని వల్ల వచ్చే ఆదాయం ఆధారపడి ఉంటుంది. పెట్టుబడుల్లో కొన్ని కేపిటల్ రిస్క్ లు (మూలధన నష్టాలు) ఉంటాయి. అయితే, లాంగ్ టెరం ఇన్వెస్ట్ మెంట్ పై బెటర్ రిటర్న్స్ ఆశించవచ్చు. ఒకవేళ మీరు కొత్తగా పెట్టుబడి పెట్టేవారైతే మీ మూలధనం నుంచి 5 నుంచి 20 శాతం వరకు పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయవచ్చు.

ఆలస్యం చేయవద్దు

పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు ఆలస్యం చేయకండి. సాధ్యమైనంత త్వరగా రంగంలోకి దిగండి. ఆల్బర్ట్ ఐన్ స్టీన్ ఏం చెప్పాడంటే … కాంపౌండింగ్ పవర్, అది ప్రపంచంలో ఎనిమిదో వింత అని అన్నారు. ఆలస్యం చేయకుండా, ఆలోచిస్తూ కూచోకుండా త్వరగా నిర్ణయం తీసుకొని తక్కువ మొత్తమైనా పెట్టుబడి పెట్టేవాళ్లు కోట్లు సంపాదించగలరు. ఓ ఉదాహరణ చూద్దాం. మీ వయసు 20 అనుకుందాం. నెలకు రూ.2000 పెట్టుబడి పెట్టారనుకోండి. ఏడాదికి 5 శాతం పెట్టుబడి మొత్తాన్ని పెంచుకుంటూ పోయారనుకోండి. అలా 35 ఏళ్లు చేస్తే మీ మీరు ఏడాదికి 10 శాతం రిటర్న్ పొందవచ్చు. మీకు 55 ఏళ్లు వచ్చేసరికి మీకు వచ్చే మొత్తం ఎంతో తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు. ఈ 35 ఏళ్లలో మీరు పెట్టుబడి పెట్టింది దాదాపు 21.5 లక్షలు. కానీ మీకు వచ్చేది దాదాపు 1.5 కోట్లు. చిన్న పెట్టుబడులతో కోటీశ్వరుడు కావడం కష్టమేం కాదు. మీరు చేయాల్సిందల్లా చిన్నవయసులో పొదుపు ప్రారంభించి, దాన్ని దీర్ఘకాలం కొనసాగించడం.

బంగారం మీ పెట్టుబడికి మంచి సాధనం

భారతదేశంలో బంగారం అత్యంత విలువైన లోహం. స్థిరాస్తుల్ని సమకూర్చుకునేందుకు బంగారు నగలు కొంటారు. బంగారం మీకు మంచి పెట్టుబడి సాధనంగా పనికొస్తుంది. దేశంలోనే కాదు, ప్రపంచంలో చాలా దేశాల్లో ఎందరో బంగారాన్ని తమ పెట్టుబడులకు వనరుగా మార్చుకున్నారు. స్టాక్ మార్కెట్ పడిపోయినప్పుడు లేదా ఆర్థికమాంద్యం వచ్చినప్పుడు బంగారం విలువ పెరుగుతుంది. ఎక్కువ రిటర్న్స్ రాకపోయినా పెట్టుబడికి బంగారం కూడా ఒక సాధనం. అది ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తుంది. బంగారంలో ఉన్న ఈజ్ ఏమిటంటే దాన్ని ఎప్పుడైనా కొనవచ్చు. ఎప్పుడైనా అమ్మవచ్చు. నగలు, కాయిన్స్, బాండ్లు, గోల్డ్, ఇటిఎఫ్ వంటి వివిధ రూపాల్లో బంగారాన్ని కొనవచ్చు.

క్రియేట్ ఎమర్జెన్సీ ఫండ్

అత్యవసర పరిస్థితి వస్తే ఖర్చు చేసేందుకు ఎమర్జెన్సీ ఫండ్ ను ఏర్పరచుకోవడం ప్రతి వారికీ అవసరం. ఇది సెక్యూరిటీ కోసం తప్పనిసరి. హై-లిక్విడ్ ఫండ్. కనీసం ఆరు నెలలపాటు మీ కుటుంబ అవసరాలకోసం కొంత మొత్తాన్ని ఎవర్జెన్సీ ఫండ్ లో దాచుకోవడం మంచిది. ఉదాహరణకు మీ కుటుంబం ఖర్చు నెలకు 75 వేలు అనుకోండి. ఆ లెక్కన ఆరు నెలలకు 4.5 లక్షల రూపాయలు సెక్యూర్ సేవింగ్స్ ఫండ్ (ఎమర్జెన్సీ ఫండ్) గా దాచుకోవాలి. అనుకోని మెడికల్ ఖర్చులు వచ్చినా, ఒకవేళ విధిలేని పరిస్థితిలో మీ ఉద్యోగం పోయినా.. మీకు తిరిగి మామూలు పరిస్థితులు వచ్చేదాకా ఈ ఫండ్ మిమ్మల్ని ఆదుకొంటుంది.

మెడికల్ ఇన్సూరెన్స్

ఎప్పుడు అనారోగ్యం లేదా జబ్బు వస్తుందో లేదా ఏదైనా ప్రమాదం జరుతుందో తెలీదు. అప్పుడు ఆస్పత్రిలో చేరాల్సి రావచ్చు. వైద్యానికి ఎంత ఖర్చవుతుందో తెలీదు. అలాంటి అత్యవసర పరిస్థితుల్లో మిమ్మల్ని ఆదుకునేది మెడికల్ ఇన్సూరెన్స్. అదే లేకపోతే మీ కష్టార్జితంలోంచి ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి మెడికల్ ఇన్సూరెన్స్ ఉండడం మీకు, మీ కుటుంబానికీ మంచిది. మెడికల్ ఇన్సూరెన్స్ మీకు ఆదాయం ఇవ్వదు. కానీ మీ మెడికల్ ఖర్చును తగ్గిస్తుంది. మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు …ఎక్కువ క్లెయిమ్ సెటిల్ మెంట్ రేష్యో, ఎక్కువ ఆస్పత్రుల నెట్ వర్క్ కవరేజ్ ఉండేది తీసుకోవడం మంచిది.

డబ్బు సంపాదించడం కష్టమేం కాదు

Spread the love

2 thoughts on “ధనవంతులు కావాలంటే ఆర్థిక లక్ష్యాలు ఉండాలి..”

Leave a Comment

error: Content is protected !!