మీలో మార్పును తీసుకొచ్చే 10 పుస్తకాలు

Spread the love

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడయ్యే స్టాక్ మార్కెట్, ఇన్వెస్ట్ మెంట్ కు సంబంధించిన పుస్తకాలు ఇవి..

ఇప్పుడు టెక్నాలజీ వల్ల పుస్తకాలు చదవడం అనే అలవాటు యువతలో తగ్గిపోతోంది. కానీ బుక్ రీడింగ్ కు మించినది మరొకటి లేదు. కొన్ని పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడతాయి.. మనలో మార్పును తీసుకొస్తాయి. వాటి ద్వారా మనం త్వరగా సక్సెస్ అవుతాం. యువత సంపాధనను ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అలాగే కొత్తగా వ్యాపారంలో దిగితే లోతుపాతులను తెలుసుకోవాలి. నష్టాలు వచ్చినప్పటికీ తట్టుకునే సామర్థ్యం, బలం పెంపొందించుకోవాలి. బిజినెస్ కోసం పెట్టుబడి పెట్టడంలో మొదట్లో రిస్క్ లుంటాయి. ఒక్కోసారి నష్టాలూ రావచ్చు. ఎన్నో సంవత్సరాలు ప్రయోగాలు, ప్రయత్నాలూ చేశాక, పరీక్షలు ఫేస్ చేశాక… పెట్టుబడి పెట్టడంలో సాధకబాధకాలు, మార్గాలూ తెలుస్తాయి. పెట్టుబడి పెట్టడంలో ఒకసారి పట్టు సాధించాక మీరు డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. యువ పెట్టుబడిదారులకు మొదట్లో … ఏవిధంగా, ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలీక కన్ ఫ్యూజ్ కావచ్చు. కానీ, పెట్టుబడుల గురించిన పుస్తకాలు చదివితే, అవి వాళ్లకు చాలా హెల్ప్ ఫుల్ గా ఉంటాయి. అలా చదవడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ కి ఫైనాన్స్ కు సంబంధించిన పుస్తకాలు చాలా ముఖ్యమైన వనరులు.

జీతం రాగానే ప్రతి వ్యక్తీ ఆ డబ్బును ఖర్చు చేయాలనుకుంటాడు. అయితే, తెలివైన వాళ్లకు డబ్బు విలువ తెలుసు. భవిష్యత్తులో తాము అనుకున్నవి నెరవేరడానికీ, భద్రతకు ఆ సొమ్మును ఇప్పటి నుంచే పెట్టుబడి పెట్టాలనుకుంటారు. పెట్టుబడి పెట్టేటప్పుడు చివరి లక్ష్యం…ఆర్థిక స్వాతంత్య్రాన్ని చేరుకోవడం. ఎలాంటి చీకూ చింతా లేకుండా లైఫ్ ను హాయిగా గడపాలనుకుంటారు. అయితే అందుకు మొదట కొంత త్యాగం చేయక తప్పదు. తమ సొమ్మును పెట్టుబడిగా మార్చాలనుకునే వారికి ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, సరైన నాలెడ్జి లేకుండా ఇన్వెస్ట్ చేస్తే నష్టపోతాం లేదా మన డబ్బు వ్యర్థం కావచ్చు. కాబట్టి, ఇన్వెస్ట్ చేసేముందు వ్యాపారంలో చిట్కాలు, మెలకువలు తెలుసుకోవాలి.

ప్రారంభ పెట్టుబడుల ప్రాముఖ్యత

వయసులో ఉన్న యువకుడికి శక్తి, చురుకుదనం ఉంటాయి. వ్యాపారంలో నష్టాలు వచ్చిన తట్టుకునే సామర్థ్యం, బలం ఉంటాయి. నిజమే. బిజినెస్ కోసం పెట్టుబడి పెట్టడంలో మొదట్లో రిస్క్ లుంటాయి. ఒక్కోసారి నష్టాలూ రావచ్చు. ఎన్నో సంవత్సరాలు ప్రయోగాలు, ప్రయత్నాలూ చేశాక, పరీక్షలు ఫేస్ చేశాక… పెట్టుబడి పెట్టడంలో సాధకబాధకాలు, మార్గాలూ తెలుస్తాయి. పెట్టుబడి పెట్టడంలో ఒకసారి పట్టు సాధించాక మీరు డెఫినెట్ గా సక్సెస్ అవుతారు.

ఈ రంగంలో విజయం సాధించడానికి ముఖ్యమైన అంశం టైమ్. పెట్టుబడుల గురించి నేర్చుకోవడానికి లేదా తెలుసుకోడానికి, పెట్టుబడి చేయడానికి, చివరిగా ఫలితం సాధించేందుకు చాలా టైమ్ పడుతుంది. అందుకే మీరు ఆలస్యం చేయకుండా, మొదటే స్టార్ట్ చేయాలి. పెట్టుబడి పెట్టడం సమ్మేళనంపై (కాంపౌండింగ్) ఆధారపడి ఉంటుంది. అది… రోజులు గడిచేకొద్దీ మనీ విలువను పెంచుతుంది. డబ్బు ఎన్నో రెట్లు పెరిగి పెద్ద మొత్తం కావడానికి తగినంత సమయం మనం ఇవ్వాలి. అందుకే సాధ్యమైనంత తొందరగా పెట్టుబడులు పెట్టడం అవసరం.

ఇప్పుడు మీరు 1000 రూపాయలు పెట్టుబడి పెడితే, కొన్ని నెలల తర్వాత మీకు 10,000 రూపాయలు రావచ్చు. కొన్ని సంవత్సరాల తర్వాత మీరు పెట్టిన వెయ్యి రూపాయల పెట్టుబడి కోటి రూపాయల వరకు పెరగవచ్చు. కాస్త ఓపిగ్గా ఉంటే మీరు జీవితంలో త్వరగా పెద్ద మొత్తాన్ని కూడబెట్ట గలుగుతారు. అంతేకాదు, మొదట్లో పెట్టుబడి వల్ల మీకు తక్కువ కాలంలోనే ఆర్థిక స్వాతంత్య్రం వస్తుంది. రిటైర్ మెంట్ తర్వాత వచ్చే అవసరాల్ని తీరుస్తుంది.

యువ పెట్టుబడి దారులు ఎలా పెట్టుబడి పెట్టాలో తెలీక అయోమయంలో ఉంటారు. అలాంటప్పుడు పుస్తకాలు చదివితే వాటివల్ల ఉపయోగం ఉంటుంది. తెలీని విషయాలు తెలుస్తాయి. మనకు హెల్ప్ చేస్తాయి. ఆర్థిక విషయాలకు సంబంధించిన పుస్తకాలు మీరు ఆర్థిక విషయాలు తెలుసుకోడానికి, నేర్చుకోడానికి ఎంతో ఉపకరిస్తాయి. మీకు ఫైనాన్షియల్ నాలెడ్జి వస్తుంది. పెట్టుబడికి సంబంధించి మీ ఆలోచనలో కూడా మార్పురావచ్చు. ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ అనే ఓ గొప్ప పుస్తకం చాలు మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోడానికి. మీ ఆలోచనా విధానంలో చాలా మార్పు వస్తుంది. ’నేనేం చేయలేను’ అనే మీ ఆలోచన మారిపోయి, ‘నేనెలా సాధించగలను?’ అనే పాజిటివ్ థింకింగ్ వస్తుంది.

స్టాక్స్ లో పెట్టుబడి భయంతోనూ, దురాశతోనూ కూడుకొన్నది. వ్యాపారంలో కోలుకోలేని దెబ్బతిన్నా, గుండె నిబ్బరంతో తనను తాను కంట్రోల్ చేసుకోగలిగిన వారే విజయాన్ని సాధించే ఇన్వెస్టర్లు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎంతో స్టడీ చేసి, ఒక కంపెనీ షేర్లను లాంగ్ టర్మ్ కు కొంటారనుకోండి. ఏడాది తర్వాత పెట్టుబడిపై లాభం పొందడానికైనా, నష్టపోవడానికైనా సమానావకాశం ఉంది. అంటే 50-50 ఛాన్స్ ఉంటుంది. మీరు లాభపడినా, నష్టపోయినా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. నష్టం వస్తే ఆందోళనకు గురై అమ్మేయడం లేదా లాభంకోసం మరో కంపెనీ షేర్లను బుక్ చేసుకోవద్దు. మొదట కంపెనీల బ్యాలెన్స్ షీట్లను, వార్షిక నివేదికల్ని స్టడీ చేయవచ్చు. మీరు దీర్ఘ కాలిక పెట్టుబడి పెట్టారనుకోండి. కంపెనీ ఆర్థిక పరిస్థితి బాగుంటే మీరు ఎందుకు అమ్మాలి? లేదా ఎందుకు కొనాలి? ఇలాంటి విషయాల్లో పుస్తకాలు, మీ అనుభవాలే మీ పెట్టుబడి ప్రయాణంలో దారి చూపుతాయి.

10 విలువైన పుస్తకాలు

పెట్టుబడి విషయంలో, అప్పుడే ఎంటరయ్యే యువతకు సరైన దారి చూపే పది పుస్తకాలున్నాయి. ఒకటి గుర్తుంచుకోండి. వాటిని చదవడం మొదలు పెడితే మీరిక వదలరు. అవేంటో తెలుసుకుందాం..

ది ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్

బెంజమిన్ ఫ్రాంక్లిన్ రాసిన బుక్ ‘ది ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్‘. 1949లో పబ్లిష్ అయిన ఈ పుస్తకం ఇన్ని డికేడ్స్ గడిచినా ఇంకా ఇప్పటికీ రీడర్స్ మనస్సుల్లో దానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇన్వెస్ట్ చేయడానికి ముందు ఈ పుస్తకం మీరు తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాల్ని తెలుపుతుంది. సురక్షితంగా ఎలా పెట్టుబడి పెట్టవచ్చు? లాంగ్ టెర్మ్ బెనిఫిట్స్ ను ఎలా సొంతం చేసుకోవచ్చు… అనేది ఈ బుక్ సెంట్రల్ పాయింట్. సక్సెస్ సాధించాలంటే మీ మానసిక వైఖరి ఎలా ఉండాలో కూడా ఈ పుస్తకంలో చర్చించారు. తెలివైన ఇన్వెస్టర్ లక్షణాలు ఎలా ఉంటాయి, ఏఏ అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు? అనే కీలకాంశం ఇందులో ఉంది. తెలివైన ఇన్వెస్టర్ కావాలంటే ముఖ్యంగా మూడు ప్రిన్సిపల్స్ పాటించాలని ది ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ స్పష్టంగా చెప్పింది. ఒకే చోట పెట్టుబడి పెట్టి నష్టానికి గురి కాకుండా ఉండేందుకు, నికరంగా రిటర్న్స్ పొందేందుకు తెలివైన ఇన్వెస్టర్ తన పెట్టుబడుల్ని అనేక రకాలుగా డివైడ్ చేసుకుంటాడు. తను ఇన్వెస్ట్ చేయబోయే కంపెనీ పది కాలాలపాటు నిలబడగలదా, లేదా అన్నది పెట్టుబడికి ముందే స్టడీ చేస్తాడు. పెట్టుబడుల్లో దిగ్గజం అని పేరున్న వారెన్ బఫెట్ తనకు ఈ పుస్తకం ఎంతో ఇష్టమైన ‘ఇన్వెస్ట్ మెంట్ గైడ్’ అని కామెంట్ చేశాడు.

సైకాలజీ ఆఫ్ మనీ

‘ది సైకాలజీ ఆఫ్ మనీ’ పుస్తకాన్ని మోర్గాన్ హోసెల్ రాశారు. డబ్బు గురించి మనకు తెలిసిన టెక్నికల్ నాలెడ్జ్ కన్నా, డబ్బుతో మనకొచ్చే ఫైనాన్షియల్ స్టేటస్ పై మానసిక, భావోద్వేగ అంశాలు ఎలా ఎక్కువగా పనిచేస్తాయి?.. అనే పాయింట్ పై ఈ పుస్తకాన్ని రాశారు. మనీ గురించి ప్రజలు ఏవిధంగా ఆలోచిస్తారో మోర్గాన్ 19 విభిన్న కథనాల ద్వారా తెలిపారు. పుస్తకం చివరలో చదువుతున్నప్పుడు మనీ గురించి మన ఆలోచనలు మారిపోతాయి. సంపదకు, ధనవంతుడిగా ఉండడానికి మధ్య ఉన్న తేడాను రచయిత చాలా తెలివిగా వివరించారు. డబ్బును పెట్టుబడిగా పెట్టే ముందు అది ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకోవాలంటే ఈ పుస్తకం తప్పక చదవాలి.

ఎ బిగినర్స్ గైడ్ టు ది స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ గురించి బిగినర్ కు మంచి అవగాహన కలిగించే పుస్తకం ఇది. దీన్ని మాథ్యూ ఆర్. క్రాటర్ రాశారు. స్టాక్ మార్కెట్ లలో ఇన్వెస్ట్ చేయాలని చాలామందికి ఉంటుంది. కానీ వారేం చేస్తున్నారో, ఏం చేయాలో సరైనా ఐడియా ఉండదు. అలాంటి వారికి ఇది వెలకట్టలేని పుస్తకం. స్టాక్స్ గురించి తెలిసీ తెలీనివారి కళ్లు తెరిపించే పుస్తకం కూడా ఇది. ఏదో కాస్త తెలుసు కదా అని స్టాక్స్ లోకి దిగి, అందులో కూరుకుపోయి… సక్సెస్ కోసం స్ట్రగుల్ అవుతున్నవాళ్లు ఎందరో ఉన్నారు. స్టాక్స్ లో ఏది విలువైంది, యోగ్యమైంది? ఏది కాదు… అని విడమరచి చెప్పడమే కాక, షేర్లు కొనేటప్పుడు సాధారణంగా చేసే పొరపాట్ల గురించి కూడా రచయిత చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఎంతో పనికొచ్చే గైడ్ ఈ పుస్తకం.

వన్ అప్ ఆన్ ది వాల్ స్ట్రీట్

వన్ అప్ ఆన్ ది వాల్ స్ట్రీట్ పుస్తకాన్ని పీటర్ లించ్ రాశారు. 1989లో ఇది పబ్లిష్ అయింది. ఒకవేళ మీరు స్టాక్స్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటే మీరు తప్పకుండా చదవాల్సిన పుస్తకాల్లో ఇదొకటి. స్టాక్ మార్కెట్, ఇన్వెస్ట్ మెంట్ గురించి బేసిక్స్ ను ఈ బుక్ చెబుతుంది. పీటర్ లించ్ ఈ పుస్తకంలో ఎన్నో కోట్స్ (సూక్తులు) ఉదహరించారు. వాటిలో చాలా ఫేమస్ అయిన ఒక కొటేషన్ : ‘రీసర్చ్ చేయకుండా ఇన్వెస్ట్ చేయడమంటే పోకర్ గేమ్ ఆడతారు కానీ, కార్డ్స్ వంక ఎప్పుడూ చూడరు’. బిగినర్స్ అర్థం చేసుకుంటే ఈ ఒక్క సూక్తి వాళ్ల లైఫ్ నే మార్చేస్తుంది. ఇలాంటి సూక్తులతో పీటర్ … పెట్టుబడికి ముందు రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పారు.

బుక్ ఆన్ రెంటల్ ప్రాపర్టీ ఇన్వెస్టింగ్

రెంటల్ ప్రాపర్టీ ఇన్వెస్ట్ మెంట్ ఎలా చేయవచ్చో రైటర్ బ్రాండన్ టర్నర్ బాగా వివరించారు. రెంటల్ ప్రాపర్టీ ఇన్వెస్ట్ మెంట్స్ కు కావలసిన సమాచారాన్ని, నాలెడ్జిని టర్నర్ ఈ బుక్ లో వివరించారు. పెట్టుబడులంటే కేవలం స్టాక్స్ లోనూ, బాండ్స్ పెట్టుబడి పెట్టడం మాత్రమే కాదు. అదొక్కటే లాభాలు తెచ్చే ప్రాఫిటబుల్ ఇన్వెస్టింగ్ జోన్ కాదు. రియల్ ఎస్టేట్ మార్కెట్లలో పెట్టే పెట్టుబడులపై కూడా మంచి రిటర్న్స్ పొందవచ్చు. అదెలా సాధ్యమో ఈ పుస్తకం చదివి తెలుసుకోవచ్చు.రియల్ ఎస్టేట్ ద్వారా లైఫ్ కు సరిపడా ఆదాయం ఎలా వస్తుందో ఆథర్ చెప్పారు.

ఏ ఒక్కరి నుంచో సలహా తీసుకోవడం కన్నా పదిమంది నుంచి సమిష్టిగా వచ్చే సలహా ఉత్తమమైంది అని రచయిత సూచిస్తున్నారు. సరైన డీల్స్ ను కోరుకునే వారికి ఈ బుక్ ఒక కంప్లీట్ గైడ్. సెల్లింగ్ , రెంటింగ్ లను ఎలా ఎనలైజ్ చేయాలి? ఎలా ఎంచుకోవాలి? అన్నది ఈ పుస్తకం చదివి తెలుసుకోవచ్చు. రచయిత రాయడమే కాకుండా నిపుణుల సూచనల్ని కూడా ఇందులో పొందుపరిచారు. రియల్ ఎస్టేట్ లో ఎలా ఇన్వెస్ట్ చేయవచ్చో తెలిపే 40 స్టోరీస్ ఈ బుక్ లో ఉన్నాయి.

సెక్యూరిటీ ఎనాలిసిస్

సెక్యూరిటీ ఎనాలిసిస్ అనే ఈ పుస్తకాన్ని బెంజమిన్ గ్రాహం, డేవిడ్ డోడ్ కలిసి రాశారు. మార్కెట్ లో బెస్ట్ ఇన్వెస్ట్ మెంట్స్ ను ఎలా ఎనలైజ్ చేయాలో ఈ పుస్తకం నేర్పిస్తుంది. సెక్యూరిటీస్ లో లాభదాయకమైన పెట్టుబడులను ఎలా నిర్ణయించుకోవచ్చో ఈ పుస్తకం ఎనలైజ్ చేసింది. పనికొచ్చే అంటే యోగ్యమైన ఇన్వెస్ట్ మెంట్ స్వభావాలు, లక్షణాలు ఎలా ఉంటాయనేది కూడా
సెక్యూరిటీ ఎనాలిసిస్ వివరిస్తుంది. అంతేకాదు, సేఫ్టీ ప్రిన్సిపల్స్, మంచి రిటర్న్స్ గురించి కూడా ఇందులో ఉంది. ఇన్వెస్ట్ మెంట్స్ పై ఒక లాజిక్ కూడా ఇందులో ఇచ్చారు. ఒకవేళ మీరు పెట్టే ఫలానా పెట్టుబడి ఏ ఇద్దరికైనా నచ్చకుంటే అక్కడ ఇన్వెస్ట్ చేయడం మంచిది కాదు. అది కేవలం స్పెక్యులేషన్, పెట్టుబడి కాదు… అని కూడా సెక్యూరిటీ ఎనాలిసిస్ సలహా ఇస్తుంది. సెక్యూరిటీ ఎనాలిసిస్ ఫంక్షన్స్ ఏమిటో కూడా ఇందులో ఇచ్చారు. పెట్టుబడి పెట్టడానికి ముందు ఇన్వెస్టర్లు తమకు తాము వేసుకోవాల్సిన ప్రశ్నలపై కూడా ఒక స్పష్టమైన ఐడియా ఈ పుస్తకం మనకు ఇస్తుంది.

ది లిటిల్ బుక్ ఆఫ్ కామన్ సెన్స్ ఇన్వెస్టింగ్

ది లిటిల్ బుక్ ఆఫ్ కామన్ సెన్స్ ఇన్వెస్టింగ్ అనే పేరుగల ఈ బుక్ ను జాన్ సి బోగ్లీ రాశారు. 2007లో ఇది మొదటిసారి ప్రచురించబడింది. ఒకే చోట పెట్టుబడి పెడితే రిస్క్. అలా కాకుండా అనేక రకాలుగా పెట్టుబడి పెడితే రిస్క్ తక్కువ … అని రచయిత పదే పదే చెప్పారు. పెట్టుబడుల్లో మీరు ఇప్పటికే బేసిక్స్ తెలుసుకొని ఉంటే ఈ పుస్తకం … మీ పెట్టుబడి సక్సెస్ కావాలంటే మీరు తెలివిగా వేయాల్సిన స్టెప్స్ గురించి ది లిటిల్ బుక్ ఆఫ్ కామన్ సెన్స్ ఇన్వెస్టింగ్ మంచి సలహాలిస్తుంది. తక్కువ రిస్కీ పోర్ట్ ఫోలియోను ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఇండెక్స్ ఫండ్స్ ఇంపార్టెన్స్ ఏమిటి? అనే అంశాల్లో ఈ బుక్ మీరు సరైన డైరెక్షన్ ఇస్తుంది. తక్కువ పెట్టుబడి వ్యయంతో ఇండెక్స్ ఫండ్ ఇన్వెస్టర్ యావరేజ్ మార్కెట్ రిటర్న్ ని ఎలా పొందవచ్చు?, ఇతర ఇన్వెస్టర్ల కంటే బెటర్ గా ఎలా వ్యవహరించవచ్చు? అనే మేటర్ పై కూడా ఇందులో ఫోకస్ పెట్టారు.2017లో ప్రచురించిన ఎడిషన్ లో మరో చాప్టర్లను చేర్చారు. అవి రిటైర్ మెంట్ ఇన్వెస్ట్ మెంట్ ఆప్షన్స్. అస్సెట్ ఎలొకేషన్.

రిచ్ డాడ్ పూర్ డాడ్

రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే టైటిల్ తో రాబర్ట్ టి. కియోసాకి ఈ బుక్ రాశారు. ఇందులో స్టోరీ ఓ లిటిల్ హీరో, డిఫరెంట్ మెంటాలిటీస్ ఉన్న అతని ఇద్దరు డాడ్ ల చుట్టూ తిరుగుతుంది. ఇద్దరిలో ఒకరు రిచ్ డాడ్. మరొకరు పూర్ డాడ్. ఈ పూర్ డాడ్ మనీ గురించి మామూలు మెంటాలిటీతో ఉండే సాధారణమైన మనిషి. పూర్ డాడ్ ఒక ప్రొఫెసర్. పనిచేసి సంపాదించేదంతా ఖర్చులకు, బాధ్యతలు తీర్చడానికి సరిపోతుంది. ఏదైనా పెట్టుబడి పెట్టాలన్న ఆలోచన రాదు. కాబట్టి జీవితమంతా పనిచేస్తూనే ఉంటాడు.
ఇక రిచ్ డాడ్ మొదట పేదరికాన్ని అనుభవించాడు. కానీ తన మనీని ఇన్వెస్ట్ చేయడంలో బిజీ. క్రమంగా అతను మిలియనీర్ అవుతాడు. అప్పుడు అతను స్వయంగా పనిచేయాల్సిన అవసరం ఉండదు. అతని మనీనే అతని పన్లు చేసిపెడుతుంది. బాధ్యతలు, ఆస్తుల మధ్య తేడా ఏమిటనేది ఈ పుస్తకం చాలా స్పష్టంగా చెప్పింది. బాధ్యతలు తీర్చుకోడానికి కన్నా ఆస్తులు ఏర్పరచుకోవడమే అవసరం అని, అందుకే ఖర్చు చేయాలని తేల్చి చెప్పింది. ఈ తేడాను సులభంగా తెలుసుకోడానికి కొన్ని అంశాల కాలమ్స్ ఉన్న టేబుల్ కూడా ఇందులో ఉంది. సరైన చోట్ల పెట్టుబడులు పెట్టి డబ్బును సద్వినియోగం చేసుకోవాలనే రిచ్ డాడ్ స్వభావాన్నిచాలా క్లియర్ గా చెప్పింది. ధనవంతులు ఇంకా ఇంకా సంపన్నులు ఎలా అవుతారు, పేదవాళ్లు మరింత పేదవాళ్లుగా ఎందుకు మారుతారో ఈ పుస్తకం వివరించింది. జీవితానికి కావలసిన ప్రతిదాని గురించి, స్కూలు నేర్పించని విషయాలను ఈ పుస్తకం చాలా తేటతెల్లంగా తెలిపింది.

స్టాక్స్ టు రిచెస్: ఇన్ సైట్స్ ఆన్ ఇన్వెస్టర్ బిహేవియర్

ఈ పుస్తకాన్ని స్వర్గీయ పరాగ్ పారిఖ్ 2005 జనవరిలో తీసుకొచ్చారు. భారతదేశంలోని బెస్ట్ ఇన్వెస్టర్లలో ఈయన ఒకరు. పెట్టుబడుల ద్వారా తమ సంపదను ఎలా పెంచుకోవచ్చో మధ్యతరగతికి చెప్పి, వారి జీవితాల్ని బాగు చేయాలనే ఉద్దేశంతో పారిఖ్ ఈ పుస్తకం రాశారు. ఇండియాలో యంగ్ ఇన్వెస్టర్లకోసం వచ్చిన ఇన్వెస్టింగ్ బుక్స్ లో ఇదో మంచి పుస్తకం. స్టాక్స్, ఇన్విస్టింగ్ గురించి తెలుసుకోవలసిన బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ ఈ పుస్తకంలో ఉన్నాయి. గుంపులో గోవింద, మందలో ఒక పశువు అనే మనస్తత్వం నుంచి బయటపడాలని, అలాగే ఎవరో చేశారని మనమూ ఆలోచన లేకుండా ఇన్వెస్ట్ చేయడం మొదలెట్టకూడదని ఈ పుస్తకం మోటివేట్ చేస్తుంది. ఖర్చుల్లో కూరుకుపోకుండా ఏంచేయాలి, నష్టాల్ని ఎలా తట్టుకోవాలి, ట్రేడింగ్. స్పెక్యులేషన్, ఇంకా ఇన్వెస్ట్ మెంట్ కు సంబంధించిన ఎన్నో అంశాల్ని ఈ పుస్తకంలో కంప్లీట్ గా వివరించారు రచయిత. ఇన్వెస్ట్ చేయాలను కునే బిగినర్లకు, సమస్యల్ని ఫేస్ చేస్తున్న ఇన్వెస్టర్ కు ఇది మంచి గైడ్.

బెస్ట్ క్లాసిక్ – థింక్ అండ్ గ్రో రిచ్

నెపోలియన్ హిల్స్ రచించిన బెస్ట్ సెల్లింగ్ బెస్ట్ క్లాసిక్ – థింక్ అండ్ గ్రో రిచ్ పుస్తకం మోటివేషనల్ గైడ్, ఫైనాన్షియల్ గైడ్ రెండింటి కలయికగా ఉంటుంది. వ్యాపార దిగ్గజాలు ఆండ్రూ కార్నెగీ, హెన్రీ ఫోర్డ్, అలాగే థామస్ ఎడిసన్ సేకరించిన లా ఆఫ్ సక్సెస్ ఫిలాసఫీ లేదా ఒకరు విజయం సాధించడంలో ఉపయోగపడే సూత్రాలు ఉంటాయి. ఫిలాసఫీ లేదా సూత్రాలు ఇవి విజయం సాధించడంలో దోహదం చేస్తాయి. ఈ పుస్తకం మొదట 1937లో పబ్లిష్ అయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు 1.5 కోట్ల కాపీలు అమ్ముడైంది. ఈ పుస్తకం అప్ డేటెడ్ వెర్షన్లో రచయిత, లెక్చరర్, కన్సల్టెంట్ ఆర్థర్ ఆర్.పెల్(పిహెచ్డి) నుంచి కామెంటరీ ఉంటుంది.

తెలివిగా వ్యవహరించి చేసుకోగలిగితే … త్వరగా సక్సెస్ కావడానికి ఇన్వెస్ట్ మెంట్స్ అద్భుతమైన వని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. పైన పేర్కొన్న పది పుస్తకాలు పెట్టుబడుల రంగంలో ఎంతగానో ఉపయోగపడతాయి.

Spread the love

1 thought on “మీలో మార్పును తీసుకొచ్చే 10 పుస్తకాలు”

  1. -You are such a great author. I can see your point clearly! Thanks for sharing this lovely article. By the way, what about super hero tv series, you know like The Flash from DC Comics? Will be lovely if you have review about that as well. Thank you!

    Reply

Leave a Comment

error: Content is protected !!