డిజిటల్ పేమెంట్లతో జాగ్రత్త!

Spread the love

సరైన అవగాహన లేకుంటే మోసపోతారు..
సురక్షితంగా లావాదేవీల కోసం కొన్ని సూచనలు పాటించండి..

ప్రతి దానికి బ్యాంకుకు వెళ్లి లావాదేవీలను నిర్వహించే రోజులు పోయాయి. ఇప్పుడు అంతా ఆన్ లైన్, డిజిటల్ మయం అయ్యింది. దీనికి తగ్గట్టుగా మనం కూడా మారాలి. ఎందుకంటే పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి తగ్గట్టుగానే మోసాలు కూడా పెరుగుతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా మన బ్యాంకు ఖాతాలో డబ్బు మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడవచ్చు. ఇటీవల ప్రజలు ఎక్కువగా మొబైల్ బ్యాంకింగ్ మోసాలకు గురవుతున్నారు. కొద్ది నిమిషాల్లో వారి ఖాతాలు ఖాళీ అవుతున్న సంఘటనలు చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితి రాకుండా ఆన్లైన్ బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం.

బహుళ గుర్తింపు విధానాలు

మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే మీరు లాగిన్ కు ఓకే పాస్ వర్డ్ ను కల్గివుంటే హ్యాకర్లు సులభంగా ఎంటర్ అయి మోసాలకు పాల్పడతారు. టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ విధానంతో ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయవచ్చు. ఉదాహారకు మీకు ఒక జి-మెయిల్ ఉందనుకోండి, దీనికి లాగిన్ అయ్యేందుకు సింపుల్ పాస్వర్డ్ పెట్టుకుంటాం. ఇలా కాకుండా టు అథెంటికేషన్ విధానంలో మీ పాస్వర్డ్ తో పాటు ఫోన్ నంబర్ కు కూడా లింక్ చేసుకోవాలి. దీంతో హ్యకర్లు మీ పాస్వర్డ్ ను తెలుకున్నా, ఫోన్ కు లింక్ కావడం వల్ల ఓటిపి మీకు వస్తుంది. ఇలా మోసాల నుంచి తప్పించుకోవచ్చు. అందుకే బ్యాంకింగ్ యాప్ లలో బహుళ అంచెల విధానాన్ని ఉపయోగించాలి. అంటే వినియోగదారులు లాగిన్ అవ్వడానికి ఫింగర్ ప్రింట్ స్కానర్, ఓటిపి, పాస్ వర్డ్ వంటి వాటితో డెబిట్ నంబర్ వంటి అనేక విషయాలు ఉండాలి. ఈ విధంగా బహుళ అంచెలుగా లాగిన్ విధానం ఉంటే, మోసపోవడానికి ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది.

నకిలీ యాప్ అవునా.. కాదా.. గుర్తించాలి

నేడు బ్యాంకు యాప్ ల మాదిరిగానే నకిలీ యాప్ లను సృష్టించి, సులువుగా మోసం చేస్తున్నారు. హ్యాకర్లు సృష్టించే నకిలీ యాప్ ల ఉచ్చులో పడి డబ్బును పొగొట్టుకోవద్దు. నకిలీ యాప్ లతో మీ ఫోన్ డేటా దొంగిలించి మోసం చేస్తారు. ఇలాంటివి గూగుల్ ప్లేస్టోర్ లో కూడా ఉంటాయి. వాటిని గుర్తించడం కష్టమైన విషయం. బ్యాంకు యాప్ నకిలీనా, నిజమైందా.. తెలియాలంటే ఒక చిట్కా పాటించాలి. మన ఖాతాకు చెందిన బ్యాంక్ ఒరిజినల్ వెబ్ సైట్ కు వెళ్లాలి, ఆ తర్వాత దానిలో యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. డైరెక్టుగా గూగుల్ ప్లేస్టోర్ ద్వారా యాప్ ఇన్‌స్టాల్ చేయాలనుకుంటే డెవలపర్, ఇన్‌స్టాల్, రేటింగ్, రివ్యూ వంటి అంశాలను పరిశీలించాలి.

ఎన్‌ఎఫ్‌సి సిమ్ కార్డ్ వాడకం

ఎన్ఎఫ్సి సిమ్ కార్డు అంటే మరింత భద్రతను అందించేది. ఇది మీ రెగ్యులర్ సిమ్ కార్డు కంటే అత్యధిక సురక్షితమైనది. ఎన్‌ఎఫ్‌సి ఎంబెడెడ్ సిమ్ కార్డ్ అనేది ఒక సిమ్ కార్డ్. నియర్ ఫీల్ కమ్యూనికేషన్ (ఎన్‌ఎఫ్‌సి) సిమ్ తో వినియోగదారులు తమ క్రెడిట్ కార్డ్ సమాచారాన్ని సురక్షితంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. ఈ సిమ్ కార్డు ప్రయోజనమేమిటంటే వినియోగదారుడు తన డెబిట్ లేదా క్రెడిట్ కార్డును తీసుకెళ్లవలసిన అవసరం ఉండదు. అందువల్ల మీ కార్డును కోల్పోవటం, మరచిపోవడానికి కూడా ఎటువంటి ఆస్కారం లేదు. ఈ ఎన్ఎఫ్సి కార్డు వల్ల హ్యాకర్ మీ ఖాతాను యాక్సెస్ చేసే అవకాశమే ఉండదు.


ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్

డిజిటల్ లావాదేవీలు వేగంగా పెరుగుతున్న ఈ రోజుల్లో భద్రత ఎంతో ముఖ్యం. పేమెంట్ కార్డులు, వ్యాపారులు, కార్డ్ బ్రాండ్లు, బ్యాంక్ కార్డులు వంటి అనేక రూపంలో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఈ లావాదేవీలను హ్యాకర్లు గుర్తించకుండా తగు జాగ్రత్త చర్యలు పాటించాలి. ఇలాంటి వాటికి ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ (ఇ2ఇఇ) ఒక పరిష్కార మార్గం. ఇ2ఇఇ ఒక కమ్యూనికేషన్ వ్యవస్థ, ఇది డేటాను సురక్షితంగా ఉంచేలా చేస్తుంది. ఇ2ఇఇతో సందేశాలను పంపిన వారు, గ్రహీతల మధ్య డేటా రహస్యంగా ఉంటుంది. ఈ సందేశాలను మూడో వ్యక్తి చదవడానికి, చూడడానికి ఆస్కారం లేదు. ఇది ఎన్ క్రిప్ట్ చేస్తారు.

డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ ఫోన్ల ప్రయోజనం

ఇప్పుడు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫోన్లు ఎక్కువగా అందుబాటులోకి వస్తున్నాయి. అయితే చాలా బ్యాంక్ యాప్ లకు ఫింగర్ ప్రింట్ సెక్యూరిటీని కూడా అందిస్తున్నాయి. డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌లలో బ్యాంకింగ్, పేమెంట్ యాప్ ల వల్ల భద్రత పెరుగుతుంది. దీని వల్ల ఐపి అడ్రస్, ప్లేస్, డే టైమ్, డివైజ్ మోడల్, స్క్రీన్, బ్రౌజర్ వంటి పలు రకాల సంకేతాలు అవతలి వారికి చేరుతాయి. సాధారణంగా వినియోగించే పాస్ వర్డ్ ల కంటే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఎంతో సురక్షితమైందని అంటారు. మోసగాళ్లను గుర్తించడం దీనివల్ల తేలిక అవుతుంది. అందువల్ల ఫింగర్ ప్రింట్ స్కానర్ పరికరాలను ఉపయోగిస్తే మంచిది.

రియల్ టైమ్ టెకస్ట్, ఇమెయిల్ హెచ్చరికలు

బ్యాంకు ఖాతాలకు రియల్ టైమ్ టెక్ట్స్, ఇమెయిల్ అలర్ట్ తో కూడిన యాప్ నోటిఫికేషన్లను కూడా ప్రజలు వినియోగించుకోవాలి. దీని వల్ల బ్యాంకు ఖాతాలో ఏదైనా లావాదేవీ నిర్వహిస్తే, దానికి సంబంధించిన సమాచారం తక్షణమే పొందుతారు. ఖాతాలకు సంబంధించిన లావాదేవీల సమాచారం మీకు ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్ రూపంలో రాకుంటే మీ బ్యాంక్ ఖాతా బ్రాంచ్ వారిని సంప్రదించండి. వారు సందేశం వచ్చేలా చేస్తారు.


Spread the love

1 thought on “డిజిటల్ పేమెంట్లతో జాగ్రత్త!”

Leave a Comment

error: Content is protected !!