క్రిప్టోకరెన్సీని నగదుగా మార్చుకోవచ్చా?

Spread the love

దీనికి ఏలాంటి పద్ధతులు ఉన్నాయి? పన్నులు ఏమైనా చెల్లించాలా?

క్రిప్టోకరెన్సీ తరచూ వినిపిస్తున్న పదం, దీనికి సంబంధించిన లావాదేవీలు కూడా పెరుగుతున్నాయి. ఇది డిజిటల్ లేదా వర్చువల్ కరెన్సీ కావడం వల్ల అన్నింటికి వినియోగించడం సాధ్యం కాదు. అందువల్ల దీంతో కొన్ని సమస్యలు ఉన్నాయి. అయితే వీటితో లావాదేవీలు జరపొచ్చా? వీటిని నగదుగా వినియోగించవచ్చా? అనే సందేహాలు ఉన్నాయి. క్రిప్టోకరెన్సీ చాలా హెచ్చు తగ్గులకు లోనవుతూ ఉంటుంది. అంటే విలువ ఎప్పడూ ఒకేలా ఉండదు మారుతూ ఉంటుంది. కావున దీనిని నగదుగా మార్చుకోవడం అంత సులభమైన విషయం కాదు. క్రిప్టో కరెన్సీని నగదుగా మార్చుకోవచ్చు. అయితే ఈ క్రిప్టోకు భారతదేశంలో చట్టబద్ధమైనది కాదు. ఇటీవల సుప్రీం కోర్టు వీటికి అనుమతి ఇస్తూ తీర్పు ఇచ్చినప్పటికీ ఆర్బిఐ (రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా) మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ క్రిప్రోకరెన్సీని నగుదుగా మార్చుకున్నా, ఆ తర్వాత వాస్తవ విలువను కోల్పోకుండా ఉండేందుకు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంది.

డిజిటల్ టోకెన్ల హెచ్చుతగ్గుల వల్ల డబ్బు విలువను కోల్పోయే అవకాశం ఉంది. క్రిప్టోకరెన్సీని నగదుగా మార్చుకుంటే మాత్రం వీటిపై భారతదేశంలో పన్నులు చెల్లించాల్సిన అవసరం ఉంది. వీటితో వచ్చే లాభాలపై పన్నులను చెల్లించాలి. అయితే క్రిప్టోకరెన్సీని నగదుగా ఎలా మార్చుకోవచ్చో కొన్ని విషయాలు తెలుసుకుందాం.

క్రిప్టోకరెన్సీ అంటే మొదట గుర్తుకొచ్చేది బిట్ కాయిన్, ఇది ఇప్పుడు ఎంతో పాపులర్. దీనిని నగదుగగా మార్చుకోవాలంటే ఎక్స్ఛేంజ్ ఫీ, అలాగే పన్ను, ఇది థర్డ్ పార్టీ బ్రోకర్ కు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు ఎంత చెల్లించాలనేది డిజిటల్ టోకెన్ల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. క్రిప్టోను నగదుగా మార్పిడి చేసి బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసేందుకు గాను బ్రోకర్ సాధారణంగా ఒకటి లేదా రెండు తీసుకుంటారు.

రెండు పద్దతుల్లో క్రిప్టోను నగదుగా మార్చుకోవచ్చు..

మొదటిది.. ఇతర దేశాలకు వెళ్లేందుకు ప్రయాణికులు విమానాశ్రయాలలో కరెన్సీని మార్చుకుంటారు. ఇది కూడా అలాగే ఉంటుంది. బిట్ కాయిన్ లను విత్ డ్రా చేసుకునేందుకు ముందు ఎక్స్ఛేంజ్ వద్దకు వెళ్లాలి. అక్కడ బ్రోకర్ మార్పిడి విలువను ఒకరి బ్యాంక్ ఖాతాకు బదిలీ చేస్తాడు. అయితే మనీలాండరింగ్‌కు సంబంధించిన బ్రోకర్లపై ఆంక్షలు ఉంటాయి. ఈ ఆంక్షల దృష్ట్యా ఇన్వెస్టర్ ఆ డబ్బును డిపాజిట్ చేసిన అదే బ్యాంకు ఖాతా ద్వారా విత్‌డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ సురక్షితమే కానీ దీనికి కొంత ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఇదొక్కటే ఈ విధానంలో ఉండే ప్రతికూలత అని చెప్పాలి. ఇన్వెస్టర్ ఖాతాలా డబ్బు పడేందుకు కొంత సమయం పట్టడమే కాదు, ఇంకా మార్పిడి కోసం ప్రతి లావాదేవీకి చార్జీల పేరిట ఫీజులను వసూలు చేస్తారు. ఈ ఫీజులు కూడా బ్రోకర్, అలాగే దేశాల వారీగా వేర్వేరుగా ఉంటాయి.

రెండోది.. క్రిప్టోకరెన్సీని ఎక్స్ఛేంజ్ లేదా బ్రోకర్ ద్వారా మార్చుకునే వీలుంటుంది. క్రిప్టో డిజిటల్ నాణేలను అమ్మేందుకు పీర్ టు పీర్ ప్లాట్ ఫామ్ ను వినియోగించుకునే వీలుంది. ఈ విధానంలో మనం ఫీజులను అంతగా చెల్లించాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు థర్డ్ పార్టీ బ్రోకర్ ద్వారా పొందే దానికంటే మెరుగైన మార్పిడి రేటును పొందవచ్చు. అయితే ఈ పద్ధతిలో ఇన్వెస్టర్ క్రిప్టోకరెన్సీని నగదుగా మార్చుకునే ముందు ఐడెంటి ప్రూఫ్స్ కావాలని కోరాలి. ఎందుకంటే మోసగాళ్లు ఉంటారు. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండి ఈ పనులను జాగ్రత్తగా చేసుకోవాలి.

గమనిక ..

క్రిప్టో మార్కెట్ చాలా హెచ్చుతగ్గులకు గురవుతుంది. ఇది ఎంతో రిస్క్ తో కూడినది. ఈ క్రిప్టో కరెన్సీలో భారీ లాభాలు కనిపిస్తాయి. అంతేవిధంగా భారీ నష్టాలను కూడా తెచ్చిపెడ్తాయి. కొనే ముందు వినియోగదారులు తమ వ్యక్తిగత సలహాదారుల సలహా తీసుకోవాలి. ఇది అవగాహన కోసం మాత్రమే, తెలుగుపైసా.కామ్ ఇన్వెస్ట్ చేయమని సలహా ఇవ్వదు, ఎలాంటి బాధ్యత వహించబోదు.

https://telugupaisa.com/%e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%aa%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8b%e0%b0%95%e0%b0%b0%e0%b1%86%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b8%e0%b1%80-%e0%b0%87%e0%b0%82%e0%b0%a4-%e0%b0%aa%e0%b0%be%e0%b0%aa%e0%b1%81/
Spread the love

Leave a Comment

error: Content is protected !!