FD కంటే అధిక రాబడినిచ్చే డెట్ మ్యూచువల్ ఫండ్స్

Spread the love

సంవత్సర కాలంలో 11 శాతం వరకు రాబడి

ఫిక్స్ డ్ డిపాజిట్లలో తక్కువ రిస్క్ ఉంటుంది. కానీ రాబడి మాత్రం మ్యూచువల్ ఫండ్స్ తో పోలిస్తే తక్కువే. ఎఫ్ డి కంటే మంచి రాబడి రావాలని కోరుకుంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. దీనిలో గతేడాది 1 సంవత్సర కాలంలో 11 శాతం వరకు రాబడి వచ్చింది.

డెట్ మ్యూచువల్ ఫండ్ అంటే?
మ్యూచువల్ ఫండ్స్ లో డెట్ ఫండ్ ఒకటి. ఈ ఫండ్స్ ముఖ్యంగా ప్రభుత్వ సెక్యూరిటీలు, కార్పొరేట్ బాండ్లు, డిపాజిట్ సర్టిఫికేట్లు మొదలైన స్థిర ఆదాయ సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేస్తాయి. దీనిలో మంచి ఎఫ్ డి కంటే అధిక రాబడి ఉంటుంది. దీనిలో సురక్షితమైన రాబడులను పొందదవచ్చు. మూడు, నాలుగేళ్లు కోసమైతే డెట్ మ్యూచువల్ ఫండ్‌లను ఎంచుకోవచ్చు.

పెట్టుబడి మొత్తం ఎంత ఉండాలి?
ఆర్థిక నిపుణుల ప్రకారం, డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో మీరు మొత్తం పోర్ట్‌ఫోలియోలో మీ వయస్సుతో సమానమైన శాతాన్ని పెట్టుబడి పెట్టాలి. ఉదాహరణకు మీకు 50 ఏళ్లు ఉన్నాయనుకుందాం. మీ వద్ద రూ.1 లక్ష ఉంటే డెట్ మ్యూచువల్ ఫండ్లలో రూ.50 వేల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అంటే వయస్సును శాతంగా భావించి, మీ దగ్గర ఉన్న మొత్తంలో అంత శాతమే పెట్టుబడి పెట్టాలన్న మాట.

టాక్స్ పడుతుందా?
పన్ను వీటికి ఎలా ఉంటుందంటే, 3 సంవత్సరాల తర్వాత డెట్ ఫండ్స్ ఉపసంహరించుకుంటే ఎల్టిసిజి (లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్) ఉంటుంది. ఒకవేళ మూడేళ్ల లోపు డబ్బును తీసుకుంటే ఎస్టీసిజి (స్మాల్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ టాక్స్) విదిస్తారు.
దీనికి ఒక ఉదాహరణను పరిశీలిద్దాం. డెట్ మ్యూచువల్ ఫండ్లలో రూ. 100,000 పెట్టుబడి పెట్టామనుకుందాం. పెట్టుబడి పెట్టిన తర్వాత మూడేళ్ల లోపు మొత్తాన్ని ఉపసంహరించుకుంటే, అది ఎస్టీసిజి కిందకు వస్తుంది. అంటే రూ.1 లక్షపై ఎల్టీసిజి విధిస్తారు. మూడేళ్ల తర్వాత విత్‌డ్రా చేస్తే 20 శాతం ఎల్టీసిజి పన్ను విధిస్తారు.

కొన్నిబెస్ట్ డెట్ ఫండ్స్

– ఎస్బీఐ మాగ్నమ్ మీడియం టర్మ్ ఫండ్
– ఐసిఐసిఐ క్రెడిట్ రిస్క్ డెట్ ఫండ్
– హెచ్డిఎఫ్సి క్రెడిట్ రిస్క్ డెట్ ఫండ్
– ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఆల్ సీజన్ బాండ్
– కోటక్ డైనమిక్ బాండ్ ఫండ్

ఎఫ్డీలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఈ ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలి

బ్యాంక్లో ఫిక్స్ డ్ డిపాజిట్ ఎంతో సురక్షితం, వీటిలోనే ప్రజలు ఎక్కువగా పెట్టుబడి పెడతారు. అయితే కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. ఎఫ్డిలో పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ కాలం నిర్ణయించుకుంటాం. మెచ్యూరిటీ పూర్తయ్యేంత వరకు వాటి జోలికి వెళ్లొద్దు. మెచ్యూరిటీకి ముందు ఎఫ్డీని విత్ డ్రా చేసుకోవాలనుకుంటే మాత్రం పెనాల్టీ విధిస్తారు. ఈ విషయం గుర్తుంచుకుంటే మంచిది. మెచ్యూరిటీకి ముందే ఎఫ్డీ డబ్బును తీసుకుంటే గనుక సంపాదించిన మొత్తం వడ్డీ తగ్గిపోతుంది.

వేర్వేరుగా ఎఫ్డీ చేయండి
పెద్ద మొత్తంలో ఒకే బ్యాంక్ లో ఎఫ్డీ చేయడం మంచిది కాదు. అంటే మీరు 5 లక్షల రూపాయలు ఎఫ్డీ చేయాలని భావించారు అనుకుందాం. అప్పుడు మీరు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో రూ.1 లక్ష చొప్పున 5 ఎఫ్డీలను చేయండి. ఇది ఎంతో ఉత్తమమైన ఆలోచన. ఎందుకంటే మీకు డబ్బు అవసరమైనప్పుడు ఇది ఉపయోగపడుతుంది. తక్కువ మొత్తంలో వేర్వేరుగా 5 ఎఫ్డీలు ఉండడం వల్ల ఒకటి ఎఫ్డీని ఉపసంహరించుకుంటే పెద్దగా నష్టమనేది ఉండదు. మిగతావి అలాగే ఉంటాయి. అదే ఒకేసారి 5 లక్షల ఎఫ్డీ చేస్తే గనుక, దానిని విత్ డ్రా చేస్తే చాలా నష్టపోతాం.

ఎఫ్డీపై టాక్స్
ఫిక్స్ డ్ డిపాజిట్లపైనా ఆదాయం పన్ను అనేది ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో (2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి వరకు) ఎఫ్డీపై వచ్చే వడ్డీ రూ.10 వేల కంటే ఎక్కువగా ఉంటే టిడిఎస్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ టిడిఎస్ వచ్చిన వడ్డీ మొత్తంలో 10 శాతం విధిస్తారు. అయితే సీనియర్ సిటిజన్లకు మాత్రం రూ.50 వేల వరకు పరిమితి ఇచ్చారు.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎఫ్డీలో టిడిఎస్ చెల్లించాల్సి వస్తే గనుక ఫామ్ 15జి, ఫామ్ 15హెచ్ ని నింపి బ్యాంకు వారికి అందజేయాలి. ఇక బ్యాంకులు ఎఫ్డీలో ఒక సౌకర్యం కల్పించారు. అదే మూడు నెలలకోసారి, సంవత్సరానికోసారి వడ్డీని ఉపసంహరించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు కొన్ని బ్యాంకులు నెల వారీగా కూడా ఉపసంహరించుకునే అవకాశం కల్పిస్తున్నాయి.

FD కంటే అధిక రాబడినిచ్చే డెట్ మ్యూచువల్ ఫండ్స్

Spread the love

Leave a Comment

error: Content is protected !!