ఈ జాగ్రత్తలు పాటించకపోతే మీ డబ్బు సురక్షితం కాదు..

Spread the love

నెట్ బ్యాంకింగ్, ఆన్లైన్ లావాదేవీలు నిర్వహించేవారు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే..

ఆన్లైన్ మోసాలు పలు రకాలుగా ఉంటాయి. అందుకే నెట్ బ్యాంకింగ్ చేసేవారు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పిషింగ్, నెట్ బ్యాంక్ హ్యాకింగ్, ఎటిఎం క్లోనింగ్ అనే రకరకాల మోసాలు జరుగుతున్నాయి. ఇలాంటి మోసాలు రోజూ వార్తల్లో కనిపిస్తూనే ఉన్నాయి. ఈ రోజుల్లో నగదును మరొకరికి పంపాలంటే అనేక వ్యాలెట్ లు ఉన్నాయి. అయినప్పటికీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సురక్షితమైనదిగా భావిస్తారు. ఈ ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేపట్టే సమయంలో జాగ్రత్తలు పాటించకపోతే దీని వల్ల ప్రమాదం కూడా పొంచి ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అందువల్ల కొన్ని సూచనలు పాటించండి. అవేంటో తెలుసుకుందాం.

పాస్‌వర్డ్ తరచూ మారుస్తూ ఉండాలి..

నెట్ బ్యాంకింగ్ కు పాస్ వర్డ్ ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు, అందువల్ల పాస్‌వర్డ్‌ను ప్రతి మూడు నెలలకోసారి మార్చాలి. పాస్ వర్డ్ కు సంబంధించిన వివరాలను ఎక్కడ కూడా రాయడం గానీ, షేర్ చేసుకోవడం గానీ చేయకూడదు. మరో ముఖ్యమైన జాగ్రత్త వహించాల్సిన విషయం ఒకటి ఉంది. అదేమిటంటే మీ ఐడి, పాస్‌వర్డ్ గుర్తుంచుకునేందుకు మోజిల్లా ఫైర్ పాక్స్, గూగుల్ క్రోమ్, ఫోన్లలో ఇతర ఏ బ్రౌజర్లకు అనుమతి ఇవ్వొద్దు. మనం లాగిన్ అయ్యి లావాదేవీలు జరిపాక, పాస్వర్డ్ సేవ్ అని అడుగుతుంది. డోన్ట్ సేవ్ అనేదానికి క్లిక్ చేయాలి. అది మీ పర్సనల్ కంప్యూటర్ అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకపోవడమే మేలు. ఎందుకంటే మన పాస్వర్డ్ సేవ్ అయితే ఆ డేటా మిస్ యూజ్ అయ్యే అకాశం ఉంది.

పబ్లిక్ కంప్యూటర్ లో లావాదేవీలు వద్దు

చాలా మంది ఫ్రీగా వైఫై వస్తుంది కదా అని పబ్లిక్ ప్రదేశాల్లో నెట్ ను వినియోగించుకుంటారు. ముఖ్యంగా సైబర్ కేఫ్‌లు లేదా, ఇతర పబ్లిక్ ప్రాంతాల్లో కంప్యూటర్ ద్వారా నెట్‌బ్యాంకింగ్ సౌకర్యాన్ని వినియోగించుకోవద్దు. ఎందుకంటే పబ్లిక్ ప్రాంతాల్లో వైఫై వంటి సౌకర్యాలను వినియోగించుకోవడం వల్ల మన డేటా దొంగిలించే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో పబ్లిక్ కంప్యూటర్‌ను వినియోగించాల్సి వస్తే మాత్రం మీ తాత్కాలిక ఫైల్స్, బ్రౌజింగ్ హిస్టరీని అన్నింటిని డెలీట్ చేయాలి.

పాన్, ఆధార్ నంబర్ ఎవ్వరితో పంచుకోవద్దు

ఇప్పుడు పాన్, డెబిట్, క్రెడిట్ కార్డు, ఆధార్ కార్డు వివరాలను జాగ్రత్తపర్చుకోవాలి. ఫోన్ లేదా ఇమెయిల్ ద్వారా మీ రహస్య సమాచారాన్ని కోరబోమని, బ్యాంకులు, టెలికాం సంస్థలు తరచూ పదే పదే చెబుతున్నాయి. వినియోగదారులు తమ బ్యాంకింగ్ సమాచారం అంటే లాగిన్ ఐడి, పాస్‌వర్డ్, కార్డ్ గ్రిడ్ నంబర్, సివివి నంబర్ వంటివి ఎవరితోనూ పంచుకోవద్దు, చెప్పవద్దు.

సురక్షిత వెబ్‌సైట్, యాప్ వినియోగించాలి..

ఈ కాలంలో ఏది నకిలీనో ఏది ఒరిజినలో తెలుసుకోవడం కష్టంగా మారింది. ఎందుకంటే గూగుల్ లోకి మనం పలా బ్యాంక్ పేరు టైప్ చేసి సెర్చ్ చేస్తాం. కానీ దానిలో ఎన్నో కనిపిస్తాయి. వాటిలో సరైన వెబ్ సైట్ ఏది అనేది మనం కరెక్టుగా తెలుసుకోవాలి. బ్యాంక్ లావాదేవీలు నిర్వహించేటప్పుడు సురక్షిత వెబ్‌సైట్ ఉందా? లేదా? చెక్ చేసుకోకపోతే మోసపోతాం. బ్యాంక్ యుఆర్‌ఎల్‌ను సరైందా, కాదా సరి చూసుకోవాలి. వీటి ద్వారా కూడా మోసగాళ్లు మీ సమాచారాన్ని దొంగిలిస్తారనే విషయం గుర్తుంచుకోవాలి.

లావాదేవీ వివరాలను తరచూ చెక్ చేసుకుంటూ ఉండాలి..

ఆన్ లైన్ లావాదేవీలు నిర్వహించిన తర్వాత ఎల్లప్పుడు మీ ట్రాన్‌సాక్షన్ హిస్టరీ, ఇతర వివరాలను చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం చేసిన లావాదేవీ సరైందేనా, లేదా, తెలుసుకోవచ్చు. కానీ ఇప్పుడు ప్రతి బ్యాంక్ ఎప్పటికప్పుడు మీరు జరిపిన లావాదేవీల వివరాలను ఎస్‌ఎంఎస్ లేదా ఇమెయిల్ ద్వారా వెంటనే పంపిస్తున్నాయి. ఇలాంటి సౌకర్యం లేకుంటే వెంటనే గుర్తించి బ్యాంకు వారిని సంప్రదించాలి. అంతేకాదు ఎస్ఎంఎస్, ఇమెయిల్ కానీ మీకు రాకపోతే వెంటనే బ్యాంకు వారిని సంప్రదించి, వచ్చేలా చూసుకోవాలి.


Spread the love

Leave a Comment

error: Content is protected !!