ఇంటర్నెట్ లేకుండా Google Pay, Paytm, PhonePe ద్వారా డబ్బు పంపొచ్చా?

అవును పంపొచ్చు.. అదెలాగో తెలుసుకుందాం..

నేడు డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. ఎక్కడైనా కొనుగోళ్లు జరిపినా లేదా ఇతరులకు డబ్బు ఇవ్వాల్సి వచ్చినా Google Pay, Paytm, PhonePe, అమెజాన్ పే, వాట్సాప్ పే వంటి యాప్ లను వినియోగిస్తున్నారు. కరోనా మహమ్మారి తర్వాత నుంచి ప్రజలు ప్రత్యక్ష నగదు లావాదేవీలు తగ్గించి, వీటి వైపు ఆసక్తి చూపించారు. అయితే ఈ లావాదేవీలు ఫోన్ ద్వారా నిర్వహించే సమయంలో ఇంటర్నెట్ తప్పనిసరిగా ఉండాలి. లేకపోతే ఇతరుల డబ్బును ఆన్ లైన్ ద్వారా పంపలేం. కానీ ఇంటర్నెట్ లేకపోయినా లావాదేవీలు జరపొచ్చు. ఈ విషయం అందరికీ తెలిసి ఉండకపోవచ్చు. కానీ Google Pay, Phone Pay, Paytm వంటి యాప్‌ల ద్వారా ఇంటర్నెట్ లేకుండా డబ్బును పంపొచ్చు. అదెలాగో పూర్తిగా వివరిస్తాను.

ఇంటర్నెట్ లేకుండా మనీ ట్రాన్స్ ఫర్

  • దీనికి ముందుగా తప్పనిసరిగా మీ ఫోన్‌లో BHIM యాప్ ఉండాలి. ఒకవేళ లేకపోతే డౌన్ లోడ్ చేసుకోండి. భీమ్ యాప్ లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేసుకోవాలి. అది చేస్తేనే ఆఫ్ లైన్లో అంటే ఇంటర్నెట్ లేకుండా మనీ లావాదేవీలను నిర్వహించవచ్చు.
  • ఆ తర్వాత ఇంటర్నెట్ లేకుండా UPIని వినియోగించేందుకు మీరు స్మార్ట్ ఫోన్ లో డయలర్ లో *99# అనే కోడ్ టైప్ చేయాలి. ఆ వెంటనే మీ ఫోన్ లో ఒక మెనూ వస్తుంది. దీనిలో ఏడు అంశాలు ఉంటాయి. వాటిలో మనీ ట్రాన్స్ ఫర్, మనీ రిసీవింగ్, బ్యాలెన్స్ చెక్, మై ప్రొఫైల్, పెండింగ్ రిక్వెస్ట్, ట్రాన్ సాక్షన్, యుపిఐ పిన్ వంటి ఉంటాయి.
  • వీటిలో మొదట 1 నంబర్ ను ప్రెస్ చేయాలి అంటే నొక్కాలి. ఆ తర్వాత మీ ఫోన్ నంబర్ ను ప్రెస్ చేయాలి. ఇక యుపిఐ ఐడిని వినియోగించి మీ బ్యాంక్ ఖాతా నంబర్, IFSC ఉపయోగించి డబ్బును పంపాలి.
  • ఇలా కాకుండా మీరు UPI ID ద్వారా డబ్బు పంపాలనుకుంటున్నారా? దీనికి మాత్రం మీరు అవతల వ్యక్తి యుపిఐ ఐడిని తెలుసుకోవాల్సి ఉంటుంది. వారి యుపిఐ ఐడిని నమోదు చేసిన తర్వాత ఎంత మొత్తం డబ్బు పంపాలనుకుంటున్నారో టైప్ చేయండి. ఆఖరుగా యుపిఐ పిన్ సంఖ్యను నమోదు చేసి, ఆ తర్వాత సెండ్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత మీరు ధృవీకరణ ఎస్ ఎం ఎస్ వస్తుంది.

ఆన్ లైన్ లో బంగారం.. రూ.100కే గోల్డ్ సేల్ చేస్తున్న జువెలర్స్

కరోనా మహమ్మారి తర్వాత ఇప్పుడు బంగారం కొనుగోళ్లు జోరందుకున్నాయి. పండుగ సీజన్ సందర్భంగా జువెలరీ సంస్థ వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆన్ లైన్ షాపింగ్ పెరిగిన నేపథ్యంలో పలు గోల్డ్ స్కీమ్ లను కూడా షాప్ లు ఆఫర్ చేస్తున్నాయి. తనిష్క్, కజానా జ్యువెలర్స్, పిసి జ్యువెలర్స్ వంటి పెద్ద బ్రాండ్లు ఆన్‌లైన్‌లో బంగారాన్ని విక్రయించడం మొదలు పెట్టాయి.

ఓవైపు బంగారం ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. కరోనా మహమ్మారి నుంచి భారీగా పెరిగిన పసిడి ధరలు మళ్లీ తగ్గేదే లేదు అన్నట్టు అక్కడే ఉన్నాయి. కొద్ది అటుఇటు మార్పులు అయినా 10 గ్రాముల బంగారం 50 వేల రూపాయల వద్దనే కదలాడుతోంది. లాక్‌డౌన్‌ సమయంలో బంగారం ఆన్‌లైన్ షాపింగ్ ఎక్కువగా జరిగింది. ఆన్‌లైన్ షాపింగ్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో పెద్ద జువెలరీ సంస్థలు ఆన్‌లైన్‌లో బంగారాన్ని విక్రయిస్తున్నాయి.

రూ.100కే అంటే 1.35 డాలర్లకే సంస్థలు బంగారాన్ని విక్రయించే అవకాశాన్ని ఇస్తున్నాయి. పెద్ద పెద్ద బ్రాండ్లు తమ వెబ్‌సైట్ల ద్వారా డిజిటల్ గోల్డ్ ను అందిస్తున్నాయి. ఒక గ్రాము బంగారంను కొనొచ్చు, దీంతో వినియోగదారులు తమ ఇంటికి బంగారం డెలివరీ పొందే అవకాశం కూడా కల్పిస్తున్నాయి. అదే సమయంలో ప్రజలు ఆన్ లైన్ లో బంగారం కొనడానికి కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే చాలా సంస్థలు డిజిటల్ గోల్డ్ విక్రయాలను చేపడుతున్నాయి. మొబైల్ వాలెట్, ఆగ్మాంట్ గోల్డ్ ఫర్ ఆల్, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సహాయంతో డిజిటల్ గోల్డ్ లావాదేవీలు నిర్వహిస్తున్నాయి.

ఆన్ లైన్లో బంగారం విక్రయాలు అంత సురక్షితం కాదనే వాదన కరోనా తర్వాత తగ్గింది. ఇప్పటివరకు ప్రజలు స్టోర్లకే వెళ్లి కొనాలనే ఆలోచన ఉండేది. కానీ క్రమంగా ఇది తగ్గుతోంది. దీని కారణం కరోనా సమయంలో వ్యాపార సంస్థలు నమ్మకంతో ఆన్ లైన్ సేల్స నిర్వహించాయి. దీంతో ఇప్పుడు ఆన్ లైన్ అమ్మకాల పట్ల వారు ఆకర్షితులవుతున్నారు. పండుగ సీజన్‌లో కొత్త ఆఫర్లతో కస్టమర్లను జువెలరీ సంస్థలు ఆకర్షిస్తున్నాయి. దేశవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ పెరుగుతొంది. ఈసారి పండుగ సీజన్‌లో ప్రజలు ఆన్‌లైన్‌లో పెద్ద సంఖ్యలో షాపింగ్ చేస్తారని అంచనా వేస్తున్నారు.

Leave a Comment

error: Content is protected !!