ఆన్ లైన్ బ్యాంకింగ్ లో మోసపోతే ఏం చేయాలి?

Spread the love

మీ డబ్బు తిరిగి పొందాలంటే ఎలా?

ఈ రోజుల్లో ఆన్లైన్ లో పనులు సాధారణమైపోయాయి. పేటీఎం, ఫోన్ పే, జీ పే వంటి ఎన్నో సాధనాలు రావడంతో ఆన్ లైన్ లావాదేవీలు పెరుగుతున్నాయి. కానీ అదే విధంగా బ్యాంకింగ్ మోసాలు కూడా ఎక్కువయ్యాయి. మోసగాళ్లు చాలా చురుగ్గా ఉంటూ ప్రజల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. అంతేకాదు వివిధ పద్ధతులను వినియోగిస్తూ చాకచక్యంగా మోసాలు చేస్తున్నారు కూడా. ప్రభుత్వం మోసాలను నియంత్రించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నా, ఇవి ఆగడం లేదు. ఆన్ లైన్ లో మోసపోతే ఏం చేయాలి, ఏ విధంగా ముందుకు సాగాలో తెలుసుకుందాం.

155260 హెల్ప్ లైన్ నంబర్ కు కాల్ చేయండి..
ఆన్‌లైన్ బ్యాంకింగ్ మోసాల దృష్ట్యా పలు చర్యలు చేపట్టారు. 155260 హెల్ప్‌లైన్ నంబర్‌ను పోలీసులు జారీ చేశారు. ఈ నంబర్‌కు కాల్ చేసి మనకు జరిగిన ఆన్‌లైన్ మోసంపై ఫిర్యాదు చేయవచ్చు. ఈ నంబర్ కు కాల్ చేస్తే పోలీసులు మీకు సహాయం చేస్తారు.
తెలంగాణ వంటి ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఈ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి, సహాయం పొందవచ్చు. ఈ నంబర్ ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 24x7 పనిచేస్తుంది. ఢిల్లీ, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, అసోం, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ వంటివి ఉన్నాయి. మిగతా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ 155260 హెల్ప్ లైన్ నంబర్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. మరిన్ని వివరాల కోసం https://cybercrime.gov.in/Webform/Helpline.aspx సందర్శించండి.

ఎస్బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా), పిఎన్బి (పంజాబ్ నేషనల్ బ్యాంక్), బిఒబి (బ్యాంక్ ఆఫ్ బరోడా), యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్‌ఇండ్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ వంటి అన్ని ముఖ్యమైన బ్యాంక్లు ఈ హెల్ప్ లైన్ నంబర్ కు అయి ఉన్నాయి. అంతేకాదు ఫోన పే, పేటీఎం, మోబిక్వక్, ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి వ్యాలెట్ లు, వ్యాపార సంస్థలు కూడా అనుసంధానం అయి ఉన్నాయి.

gov.inలో ఫిర్యాదు చేయొచ్చు
ముందు హెల్ప్‌లైన్ నంబర్‌కు ప్రయత్నించండి. ఒకవేళ కాల్ చేయడం వీలుకాకపోతే gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి, ఫిర్యాదు దాఖలు చేయవచ్చు. ఆన్ లైన్ లో మోసపోయిన వారు హెల్ప్ లైన్ నంబర్, వెబ్ సైట్ ఈ రెండింటిని వినియోగించుకుని, సహాయం పొందవచ్చు


Spread the love

Leave a Comment

error: Content is protected !!