అత్యంత సురక్షితమైన పెట్టుబడి పిపిఎఫ్

Spread the love

దీంతో ప్రయోజనాలేమిటి? వడ్డీ ఎలా ఉంటుంది? దీనిలో పెట్టుబడి పెట్టడం ఎలా?

పన్ను పరంగా మెరుగైన, సురక్షితమైన పెట్టుబడి కావాలంటే కొన్ని పథకాలు ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్). ఈ స్కీమ్ మీకు ఫిక్స్ డ్ డిపాజిట్ కంటే ఎక్కువ రాబడిని అందిస్తుంది. ఎంతో సురక్షితమైనది. అంతేకాదు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సి కింద రూ.1.5 లక్షల వరకు పెట్టుబడులపై పన్ను మినహాయింపు కూడా ఉంటుంది.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పిపిఎఫ్)

దేశంలో సేవింగ్, పన్ను రెండింటి పరంగా ఉత్తమమైన పథకం ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పిపిఎఫ్). దీనిని 1968లో ఆర్థిక మంత్రిత్వశాఖ జాతీయ పొదుపుల సంస్థ ఈ స్కీమ్ ను ప్రవేశపెట్టింది. ఆదాయం పన్ను ప్రయోజనాలతో పాటు సహేతుకమైన రాబడిని అందిస్తూ, చిన్న మొత్తాల పొదుపులను సమీకరించడమే ఈ పథకం లక్ష్యం. పిపిఎఫ్ వడ్డీ రేటు ప్రస్తుతం 7.10 శాతంగా (ఇది 2021-12-11 తేదీన ఉన్న రేటు) ఉంది. ప్రతి మూడు నెలలకోసారి ప్రభుత్వం వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది. దీని వల్ల వడ్డీ రేట్లు స్వల్పంగా మారుతూ ఉంటాయి. ఈ ప్లాన్ తో ఇఇఇ హోదాతో వస్తుంది, అంటే మూడు పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. కంట్రిబ్యూషన్, వడ్డీ ఆదాయం, మెచ్యూరిటీ మొత్తం ఈ మూడింటికీ పన్ను మినహాయింపు ఇస్తారు.

  • పిపిఎఫ్ కు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సి కింద పన్ను మినహాయింపు ఉంటుంది.
  • రూ.500తో పిపిఎఫ్ ఖాతా ప్రారంభించవచ్చు. అయితే తరువాత ప్రతి సంవత్సరం రూ .500 కనీసం డిపాజిట్ చేయడం అవసరం. డిపాజిట్ చేయకపోతే ఫ్రీజ్ అవుతుంది. యాక్టివేట్ చేయాలంటే రూ.50 జరిమానా చెల్లించాలి.
  • ప్రతి సంవత్సరం గరిష్టంగా రూ 1.5 లక్షలు మాత్రమే డిపాజిట్ చేయవచ్చు.
  • ఈ స్కీమ్ గడువు 15 సంవత్సరాలు ఉంటుంది. దీనిని మధ్యలో విత్‌డ్రా చేయలేం. అయితే 15 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల చొప్పున పొడిగించవచ్చు. కానీ ఖాతా తెరిచిన 7 సంవత్సరాల నుండి పాక్షికంగా విత్ డ్రా చేసుకోవచ్చు. ఇంకా ఖాతా ప్రారంభించిన 4 సంవత్సరాల తర్వాత ప్రిమెచ్యూర్ విత్ డ్రాకు అనుమతి ఉంటుంది.

పిపిఎఫ్ పై ఎక్కువ వడ్డీ ఎలా పొందవచ్చు..

పిపిఎఫ్ పై వడ్డీ 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు మీ బ్యాలెన్స్‌పై లెక్కిస్తారు. అందువల్ల ప్రతి నెలలో 5వ తేదీలోపు మీ పిపిఎఫ్ ఖాతాలో డబ్బు ఉండేలా చూసుకుంటే, వడ్డీ ప్రయోజనం లభిస్తుంది. ఒకవేళ 5వ తేదీ తర్వాత డబ్బు వేస్తే లేదా 6వ తేదీన పిపిఎఫ్ కి డబ్బును వేస్తే తదుపరి నెలలో వడ్డీ లెక్కిస్తారు.

పిపిఎఫ్ పై లోన్..

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ద్వారా రుణం తీసుకోవచ్చు. మీరు కేవలం 1 శాతం (పిపిఎఫ్ వడ్డీ రేటు) రేటుతో రుణ ప్రయోజనం పొందవచ్చు. మీరు పిపిఎఫ్ పై లోన్ ఎలా పొందవచ్చో తెలుసుకుందాం.
పిపిఎఫ్ ఖాతాపై రుణం తీసుకోవడం చాలా సులభం. పిపిఫ్ ఖాతాను తెరిచిన 3-5 ఏళ్ల మధ్య పిపిఎఫ్ పై ఖాతాదారుడు రుణం పొందే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు 2021 జనవరిలో మీ పిపిఎఫ్ ఖాతాను తెరిచారనుకోండి, లోన్ 1 ఏప్రిల్ 2023 నుండి 31 మార్చి 2026 మధ్య పొందవచ్చు. డిపాజిట్‌పై 25 శాతం వరకు రుణం తీసుకోవచ్చు. 1 శాతం చొప్పున వడ్డీ ప్రయోజనం పొందుతారు.
లోన్ కాలపరిమితి చూస్తే గరిష్టంగా 3 సంవత్సరాలు, 36 నెలల లోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ 36 నెలలు దాటిన తర్వాత చేస్తే 6 శాతం వార్షిక వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఇంకా రుణాన్ని తిరిగి చెల్లించే వరకు మళ్లీ రుణం పొందలేరు.
ఈ లోన్‌ని పోస్టాఫీసు ద్వారా పొందవచ్చు లేదా మీరు పిపిఫ్ ఖాతాను ప్రారంభించిన బ్రాంచ్ వద్ద తీసుకోవచ్చు. దీని కోసం ఆధార్ కార్డు, కొన్ని పత్రాలు ఉండాలి.

పిపిఎఫ్ లో డబ్బు పెట్టుబడితో కోటీశ్వరుడు కావొచ్చు, అదెలాగో తెలుసా?

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారా కోటీశ్వరులు కావాలనుకుంటున్నారా.. మీ కలను నెరవేర్చుకోవచ్చు. ఈ ప్రభుత్వ పథకంలో డబ్బును పెట్టుబడి ద్వారా రూ.1 కోటి నిధిని సులభంగా పొందవచ్చు. ఈ స్కీమ్ ప్రభుత్వ హామీని కలిగి ఉండడం వల్ల ఎంతో సురక్షితమైంది. మీ డబ్బు గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. ఈ స్కీమ్‌లో పెట్టుబడి ద్వారా రూ. 1 కోటి ఎలా పొందవచ్చో తెలుసుకుందాం.

  • ఫిపిఎఫ్ ఖాతాలో గరిష్టంగా రూ.12,500 నెలవారీ పెట్టుబడి పెట్టొచ్చు.
  • వార్షికంగా పెట్టుబడి రూ. 1,50,000 ఇన్వెస్ట్ చేయవచ్చు.
  • ఈ పథకంలో 7.1 శాతం చొప్పున చక్రవడ్డీ పొందుతారు.
  • ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంటుంది.

1 కోటి ఎలా పొందవచ్చు?

ఈ పథకంలో రూ. 1 కోటి నిధిని సృష్టించాలనుకుంటే మాత్రం మీరు సంవత్సరానికి రూ.1,50,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. దీనిపై 7.1 శాతం చొప్పున చక్రవడ్డీని పొందుతారు. ఇలా ఈ పథకంలో 25 సంవత్సరాల పాటు ఆపకుండా రూ. 1,50,000 చొప్పున పెట్టుబడి చేయాలి. 25 సంవత్సరాల తర్వాత మీ పెట్టుబడి మొత్తం రూ.37,50,000 లక్షలు అవుతుంది. అయితే దీనిపై రూ. 65,58,015 లక్షల వడ్డీ పొందుతారు. దీంతో 25 ఏళ్లలో రూ.1.03 కోట్ల నిధి పొందుతారు. 15 ఏళ్ల తర్వాత పెట్టుబడి వ్యవధిని పెంచుకంటూ వెళ్లాలి. 20 ఏళ్ల పాటు డబ్బును ఇన్వెస్ట్ చేస్తే రూ.66 లక్షల పొందుతారు. మరో 5 సంవత్సరాలు పొడిగిస్తే అంటే మొత్తం 25 ఏళ్లకు గాను రూ.1 కోటి దాటుతుంది.


Spread the love

Leave a Comment

error: Content is protected !!