SIPలో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఈ నాలుగు మర్చిపోవద్దు..

Spread the love

మీ లక్ష్యం ఏమిటి..

మ్యూచువల్ ఫండ్ లేదా స్టాక్స్ లో సిప్(SIP) చేయవచ్చు. అయితే వీటిలో డబ్బును పెట్టుబడి పెట్టే ముందు మీరు ఎంత డబ్బు డిపాజిట్ చేయాలనుకుంటున్నారు, ఎంత డబ్బు రాబడిని పొందాలనుకుంటున్నారో ఖచ్చితంగా మీకు అవగాహన ఉంటే మంచిది. ఇలా ప్రణాళికా బద్దంగా డబ్బును ప్లాన్ చేసి పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం. చాలా డబ్బు కావాలని కోరుకునే వారు తప్పనిసరిగా లక్ష్యం ప్రకారం,  దీర్ఘకాలికంగా ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టాలి. లక్ష్యం చిన్నదైతే కొద్ది మొత్తంలో ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టవచ్చు.

పెట్టుబడి మొత్తం

అయితే SIPలలో పెట్టుబడి పెట్టిన డబ్బు మార్కెట్ రిస్క్‌ను కల్గివుంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పెట్టుబడిదారుడు నష్టపోయినప్పుడు  తట్టుకునే సత్తాను కల్గి ఉండాలి, అలాగైతేనే పెట్టుబడి పెట్టాలి. మరోవైపు, పెద్ద లక్ష్యాల సాధనకు అడ్డంకిగా నిలిచే పెట్టుబడి మొత్తం తక్కువగా ఉండకూడదు. అందుకే మితమైన డబ్బును పెట్టుబడి పెట్టడం ముఖ్యం.

లాంగ్ టర్మ్ పెట్టుబడి కావాలి 

పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఎవరైనా SIP అనేది దీర్ఘకాలిక పెట్టుబడి అని గుర్తుపెట్టుకోవాలి. మీ దగ్గర ఇప్పుడు ఎక్కువ డబ్బు ఉందని, ఒకేసారి గంపగుత్తగా డబ్బు పెట్టుబడి పెట్టకండి. మీరు ఆ మొత్తాన్ని వచ్చే నెలలో లేదా కొన్ని సంవత్సరాల్లో ప్రతి నెలలో ఎలా పెట్టుబడి పెడుతూ ఉండాలి.

రాబడిపై ఎక్కువగా ఆధారపడవద్దు

ఫండ్స్ లో SIPలో పెట్టుబడి పెట్టేటప్పుడు అధిక రిస్క్, తక్కువ రిస్క్ కలిగినవి ఉంటాయి, వాటిలో మీకు తగినది ఎంపిక చేసుకోవాలి. అధిక రిస్క్ పెట్టుబ‌డుల‌ను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ‌గా మ‌దుపు చేయ‌కండి. దీని కంటే డబ్బును తక్కువ రిస్క్ లేదా మీడియం రిస్క్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలి.


Spread the love

Leave a Comment

error: Content is protected !!