జిఎస్టీ 2.0 వచ్చేసింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ జిఎస్టి రేట్లను తగ్గించారు. ఈ రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి. అంటే ఒకే వస్తువును నిన్న కంటే ఈరోజు తక్కువ ధరకు కొనే అవకాశం ఇప్పుడు నిజమవుతోంది. ప్యాకేజ్డ్ ఫుడ్స్ నుంచి షాంపూల వరకు, చిన్న కార్ల నుంచి గృహోపకరణాల వరకు అనేక వస్తువుల ధరలు గణనీయంగా తగ్గుతున్నాయి. కొత్త పన్ను విధానం వల్ల మన జేబులో ఎంత సేవింగ్ అవుతుందో గణాంకాలతో చూద్దాం.
కొత్త పన్ను విధానం మన జేబుకి లాభమా?
“GST 2.0” అనే పదం విన్న వెంటనే చాలామంది “ఇంకా పన్ను పెంచేశారేమో?” అని అనుకుంటారు. కానీ ఈసారి సర్ప్రైజ్ పాజిటివ్‌గా ఉంది. సర్కార్ పాత నాలుగు పన్ను శ్లాబ్స్ (5%, 12%, 18%, 28%)ని తగ్గించి ఇప్పుడిప్పుడే రెండు slabs మాత్రమే ఉంచింది – అవే 5% మరియు 18%. దీంతో చాలా వస్తువులు ధరల్లో తగ్గుదల చూస్తాము.
రోటీ నుంచి రిఫ్రిజిరేటర్ వరకు…
GST 2.0 వల్ల, మన రోజు వారీ అవసరాల నుంచి గృహోపకరణాల వరకు అనేక వస్తువుల ధరలు తగ్గాయి. ఉదాహరణకు..
- నిన్న 100 రూపాయలకే కొన్న బిస్కెట్లు, ఇప్పుడు కేవలం ₹87–₹90లో వస్తాయి.
- నెలకు ఒకసారి కొనేవారు షాంపూ, సబ్బులు – 18% నుంచి 5%కి తగ్గడం వల్ల గణనీయంగా చవక అవుతున్నాయి.
- TV, AC, Fridge లాంటి ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు 28% నుంచి 18% slabకి మార్చడం వల్ల, కొనుగోలు చేసే వారికి మంచి సేవింగ్ అవుతుంది.
వాహన ధరలు కూడా తగ్గాయి
చిన్న కార్లు, 350ccలోపు బైకులు, ఆటో విడిభాగాల ధరలు తగ్గించబడ్డాయి. ఉదాహరణకి, ఒక hatchback car మీద పూర్వం ₹1.5 లక్షలు పన్ను వేసేవారు. ఇప్పుడు 18% శ్లాబ్ వచ్చినందున ₹12,000–₹25,000 వరకు సేవింగ్ సాధ్యమవుతుంది.
గణాంకాలతో టేబుల్
క్రింది టేబుల్ పాఠకులకు స్పష్టంగా అర్థమయ్యేలా, పాత & కొత్త GST రేట్లతో వస్తువులను చూపిస్తుంది:
వర్గం | ఉత్పత్తులు / సేవలు | పూర్వపు GST | కొత్త GST | అంచనా సేవింగ్ |
---|---|---|---|---|
ఆహార పదార్థాలు | రోటీ, పరోటా, పానీర్ | 5% | Nil | 5% |
పర్సనల్ కేర్ | షాంపూ, సబ్బు, టూత్‌పేస్ట్ | 18% | 5% | 13% |
ప్యాక్‌డ్ ఫుడ్స్ | బిస్కెట్లు, జ్యూస్, బటర్ | 12–18% | 5% | 7–13% |
ఎలక్ట్రానిక్స్ | ACs, TVs, ఫ్రిజ్ | 28% | 18% | 10% |
ఆటోలు & వాహన భాగాలు | చిన్న కార్లు, బైకులు | 28% | 18% | 10–12% |
ఆరోగ్య పరికరాలు | థర్మామీటర్లు, స్పెక్టకిల్స్, గ్లూకోమీటర్ | 12–18% | 5% | 7–13% |
వస్త్రాలు & పాదరక్షకాలు | షూస్, దుస్తులు | 12% | 5% | 7% |
వ్యవసాయ పరికరాలు | ట్రాక్టర్ భాగాలు, ఎరువులు, పీటికిల్లర్లు | 12–18% | 5% | 7–13% |
ద్రవ్యోల్బణంపై ప్రభావం
ఆర్థిక నిపుణుల ప్రకారం, GST 2.0 వల్ల సాధారణ ప్రజలకు 1.1% వరకు ద్రవ్యోల్బణం తగ్గుతుంది. అంటే, రాబోయే నెలల్లో నిత్యావసర వస్తువుల బిల్లు నుంచి ఇంటి అవసరాల ఇంటి అవసరాల ఖర్చుల వరకు కొంచెం తగ్గుదల కనపడే అవకాశం ఉంది.