డిసెంబరు 28 నుంచి ఆరు గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ

Spread the love

జనవరి 6 వరకు గడువు.. ఆధార్, రేషన్ కార్డు ఉండాలి

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీల హామీని నెరవేర్చేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం కింద డిసెంబర్ 28 నుంచి రాష్ట్రంలోని అన్ని గ్రామాల పరిధిలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. దరఖాస్తుల స్వీకరణ కోసం డిసెంబరు 28 నుంచి జనవరి 6 వరకు ఎనిమిది రోజుల పాటు అన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో తొలి సమావేశంలో ప్రకటించారు. ఆరు హామీలకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించడమే ప్రజాపాలన లక్ష్యంగా ఉండనుంది. అన్ని గ్రామాల్లో నాలుగు నెలలకు ఒకసారి ప్రజాపాలన ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహిస్తారు.

ఈ ఆరు హామీలను “మహాలక్ష్మి”గా వర్గీకరించారు.  “రైతు భరోసా”, “గృహ జ్యోతి”, “ఇందిరమ్మ ఇండ్లు”, “యువ వికాసం” మరియు “చేయుత”. వీటి వివరాలు ఇవే..

1.మహాలక్ష్మి:

మహిళలకు నెలవారీ రూ. 2,500 ఆర్థిక సహాయం; 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు మరియు రాష్ట్రవ్యాప్తంగా TSRTC బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.

  • ప్రతి నెల ₹2,500
  • రూ.500కి గ్యాస్ సిలిండర్లు
  • RTC బస్సుల్లో ఉచిత ప్రయాణం

2.రైతు భరోసా:

రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు రూ. 15,000 ఆర్థిక సహాయం అందజేస్తుంది. వ్యవసాయ కూలీలకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌తో పాటు ప్రతి సంవత్సరం రూ.12,000 అందజేస్తారు.

  • రైతులకు, కౌలు రైతులకు ప్రతి సంవత్సరం ఎకరాకు ₹15,000
  • వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి ₹12,000
  • వరి పంటకు సంవత్సరానికి ₹500 బోనస్

3.గృహ జ్యోతి:

  • ఈ పథకం కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది

4.ఇందిరమ్మ ఇండ్లు:

  • సొంత ఇల్లు లేని కుటుంబాలకు ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తారు. తెలంగాణ ఉద్యమ యోధులందరికీ 250 చదరపు గజాల ఇంటి స్థలం.
  • తెలంగాణ ఉద్యమ యోధులందరికీ 250 చదరపు గజాల ప్లాట్
  • ఇంటి స్థలం, సొంత ఇల్లు లేని వ్యక్తులకు ₹5 లక్షలు

5.యువ వికాసం:

విద్యా భరోసా కార్డ్ – రూ. 5 లక్షల విలువైన ఆర్థిక సహాయ కార్డ్ విద్యార్థులకు అందించబడుతుంది, దీనిని కళాశాల ఫీజులు (ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు), కోచింగ్ ఫీజులు, విదేశీ కళాశాల ఫీజులు, విదేశీ ప్రయాణ ఖర్చులు, ట్యూషన్‌ల చెల్లింపులో ఉపయోగించవచ్చు. ఫీజులు, పుస్తకాలు మరియు స్టడీ మెటీరియల్‌ల కొనుగోలు, హాస్టల్ ఫీజులు, పరీక్ష ఫీజులు, స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు, ల్యాప్‌టాప్‌లు లేదా పరిశోధనా సాధనాలు మరియు ఇతర విద్య సంబంధిత ఖర్చులు; ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ నిర్మిస్తామన్నారు.

  • విద్యార్థుల కోసం రూ. 5 లక్షల విలువైన విద్యా భరోసా కార్డ్
  • ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు

6. చేయూత

డయాలసిస్ చేయించుకుంటున్న సీనియర్ సిటిజన్లు, వితంతువులు, వికలాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ మరియు ఫైలేరియా రోగులు మరియు కిడ్నీ రోగులకు నెలవారీ రూ.4,000 పెన్షన్ అందించబడుతుంది; రాజీవ్ ఆరోగ్యశ్రీ  రూ. 10 లక్షల ఆరోగ్య బీమా అందించబడుతుంది.

  • సీనియర్ సిటిజన్లకు రూ.4,000 నెలవారీ పెన్షన్
  • రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా కింద రూ.10 లక్షలు

 అర్హతలేమిటి, దరఖాస్తు ఎలా.. 

  ప్రజా పలానా అప్లికేషన్ అనే దరఖాస్తు ఫారమ్‌….

ఈ ఒక్క ఫారమ్ తో 1.మహా లక్ష్మి, 2.రైతు భరోసా, 3.గృహ జ్యోతి, 4.ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్, 5.చేయూత స్కీమ్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు గ్రామసభలు, వార్డు సభలు నిర్వహించనుంది. ఈ సమావేశాల్లో ప్రజలు ఆరు గ్యారంటీ సర్వీసుల కోసం దరఖాస్తులు చేసుకోవాలి. 

వీటికి 28.12.2023 నుండి 06.01.2024 గడువు ఉచ్చారు. ఈ దరఖాస్తులను గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ కార్యాలయాల్లోనూ ఇవ్వవచ్చని ప్రభుత్వం తెలిపింది.

ప్రజాపాలన దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు

 మొత్తం ఐదు పథకాలను కవర్ చేసే ఒకే దరఖాస్తు ఫారమ్ తో పాటు మీరు ఈ క్రింది పత్రాలను జతచేయాలి.

  1. పాస్ పోర్ట్ సైజ్ ఫొటో
  2. ఆధార్ కార్డ్
  3. రేషన్ కార్డు
  4. భూమి పాస్ బుక్
  5. సదరం సర్టిఫికేట్
  6. ఎఫ్‌ఐఆర్ కాపీలు (తెలంగాణ అమరవీరులకు)
  7. ఉపాది హమీ కార్డ్ నంబర్

మీరు గ్రామీణ ప్రాంతంలో నివసిస్తుంటే, గ్రామసభల్లో దరఖాస్తును సమర్పించాలి, అలాగే.. మీరు పట్టణ ప్రాంతంలో నివసిస్తే గనుక వార్డు కౌన్సిల్‌కు సమర్పించాలి. మీకు దగ్గరలో కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. 
మీరు అవసరమైన జికాక్స్ పత్రాలను జోడించి.. సంతకం, లేదా వేలిముద్రతో ధృవీకరించి ఫారమ్ ను సమర్పించాలి.

దరఖాస్తుకు PDF ఫారమ్ ఇదే… [download)

HD_Praja Palana Darakasthu_v10

FORMS..


Spread the love

Leave a Comment