Jobs Lost Due to AI : ప్రపంచంలో ఏ టెక్నాలజీ అయినా పని చేసే పద్ధతిని మార్చేస్తోంది. ఇప్పుడు ఎఐతో వస్తున్న ఆ మార్పు అంతా ఇంతా కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) ఇది ఉద్యోగాల మీద ఎంత ప్రభావం చూపుతున్నదంటే, గత పరిశ్రమల విప్లవాల కంటే వేగంగా ఉద్యోగాలను మార్చేస్తోంది.
గతంలో పరిశ్రమ విప్లవాలు ఇవే..
1900లలో: ఫ్యాక్టరీల ఆటోమేషన్ వల్ల చేతితో పని చేసే కార్మికుల ఉద్యోగాలు పోయాయి.
1970లలో: ATMలు రాకతో బ్యాంక్ టెలర్ల అవసరం తగ్గింది.
2000లలో: ఈ-కామర్స్ వల్ల షాపింగ్ ఉద్యోగాలు, బ్లాక్‌బస్టర్ లాంటి కంపెనీలు మూసుకోవాల్సి వచ్చింది.
ఇప్పుడు 2025లోకి వచ్చాం… ఇంకా మొదటి త్రైమాసికం కూడా పూర్తికాకముందే Meta కంపెనీ 3,600 మంది ఉద్యోగులను తొలగించింది. కారణం? తక్కువ పనితీరు కాదు, AI వల్ల వస్తున్న మార్పే కారణం.
AI వల్ల ఉద్యోగాలకు ముప్పు నిజమేనా?
అవును. కానీ అదే సమయంలో కొత్త అవకాశాలు కూడా వస్తున్నాయి. WEF (World Economic Forum) నివేదిక ప్రకారం, 85 మిలియన్ ఉద్యోగాలు పోతాయని అంచనా ఉంది. అదే సమయంలో 9.7 కోట్ల కొత్త ఉద్యోగావకాశాలు కూడా రానున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధానంగా ఎఐ , డేటా సైన్స్, హ్యూమన్ ఏఐ సహకార రంగాల్లో అనేక అపారమైన ఉపాధి అవకాశాలు వస్తాయంటున్నారు.
ఇది కూడా పరిశ్రమల విప్లవాల్లో ఒకటే.. పాత ఉద్యోగాలు పోతున్నా, కొత్త ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి భయపడాల్సిన పని లేదు. బదులుగా మార్పుకు తాయారు కావాలి.
2025లో AI రీప్లేస్ చేసే 11 ఉద్యోగాలు
1. ఫ్యాక్టరీ ఉద్యోగాలు
మిషన్ ఆపరేషన్, ప్యాకేజింగ్, టెస్టింగ్ వంటి పనులు ఇప్పుడు రోబోట్‌లు చాలా చక్కగా చేస్తాయి.
2. రిటైల్ & ఈ-కామర్స్ ఉద్యోగాలు
చాట్‌బాట్‌లు, AI ఫ్రాడ్ డిటెక్షన్, స్టాక్ మేనేజ్మెంట్ వల్ల మానవ ఉద్యోగాలు తగ్గుతాయి.
3. ట్రాన్స్‌పోర్ట్ & లాజిస్టిక్స్
సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలు ఉంటాయి.. అంటే డ్రైవర్లను అవసరంలేని ఉద్యోగం
4. డేటా ఎంట్రీ & విశ్లేషణ
సాధారణ డేటా నమోదు, గ్రాఫ్ తయారీ, ఫార్ములా ఆధారిత విశ్లేషణలను AI సులభంగా చేస్తుంది.
5. ఫైనాన్షియల్ అనాలిస్ట్ ఉద్యోగాలు
సాధారణ ఫైనాన్స్ ప్రొజెక్షన్స్ AI మోడల్స్ ద్వారా త్వరగా చేయవచ్చు.
6. ట్రావెల్ ఏజెంట్లు
మనం AI ద్వారా ట్రిప్‌లు, హోటల్స్, టికెట్లను బుక్ చేసుకోవచ్చు – మానవ మద్దతు అవసరం లేకుండా.
7. ట్రాన్స్లేటర్లు
Google Translate, DeepL వంటి టూల్స్ మంచి నాణ్యతలో అనువాదం చేయగలవు.
8. టాక్స్ ప్రిపరేషన్ & బుక్ కీపింగ్
TurboTax, Zoho Books వంటివి పన్నుల లెక్కలు, ఖాతా నిర్వహణను స్వయంగా చేయగలవు.
9. ప్రూఫ్ రీడర్లు
Grammarly, ChatGPT వంటి టూల్స్ టైపోస్, గ్రమర్ తప్పులను వేగంగా గుర్తిస్తాయి.
10. పారలీగల్స్
కేస్ డాక్యుమెంట్ల విశ్లేషణ, న్యాయ సాయాలు ఇప్పుడు AI సహాయంతో జరుగుతున్నాయి.
11. బేసిక్ గ్రాఫిక్ డిజైనర్లు
Canva, DALL·E వంటివి కేవలం టెక్స్ట్ ప్రాంప్ట్‌లతో డిజైన్‌లు రూపొందించగలవు.
2025లో AI ప్రభావం ఉండని 15 పైగా ఉద్యోగాలు
ఎఐ ప్రభావం పడని ఉద్యోగాలు ఉన్నాయి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సృజనాత్మకత, మానవ నిర్ణయాలు అవసరమైనవి.. వీటి కేటగిరీలో ఉంటాయి.
1. AI రంగంలో ఉద్యోగాలు
- మిషన్ లెర్నింగ్ ఇంజినీర్లు
- డేటా సైంటిస్టులు
- AI డెవలపర్లు
- సైబర్ సెక్యూరిటీ నిపుణులు
- AI మేనేజర్లు
2. AIతో కలిసి పనిచేసే ఉద్యోగాలు
- నర్సులు, ఫారమెడిక్స్ – రోగులకు మానవ టచ్ అవసరం
- కొరియోగ్రాఫర్స్, సంగీతకారులు – సృజనాత్మకతను AI పునఃసృష్టించలేడు
- మానసిక నిపుణులు – కౌన్సెలింగ్‌లో మానవ అనుభూతి అవసరం
- అధ్యాపకులు – విద్యార్థులను ప్రభావితం చేయడం AI చేయలేని పని
- సివిల్ ఇంజినీర్లు – నిర్మాణాలు వ్యక్తిగత నిర్ణయాలతో తయారవుతాయి
- శస్త్రచికిత్స నిపుణులు – క్లిష్టమైన నిర్ణయాలు మానవ డాక్టర్లవే
- ప్రాజెక్ట్ మేనేజర్లు – టీమ్‌ను నడిపించడం మానవ నైపుణ్యం
- ఆపరేషన్స్ డైరెక్టర్లు – వ్యూహాత్మకంగా బిజినెస్‌ను మేనేజ్ చేయడం
- రైటర్లు – AI కంటే మెరుగైన కథనాలు రాయగలరు
భయపడాలా? సిద్దపడాలా?
భయపడాల్సిన పని లేదని నిపుణులు చెబుతున్నారు. దిగ్గజ సంస్థ ఐబిఎ వైస్ ప్రెసిడెంట్ జస్టినా నిక్సన్ చెప్పిన ప్రకారం, ఇప్పుడు నేర్చుకోవడం ఆపకూడదు, అలా చేస్తేనే సమస్య వస్తుంది. ప్రతి ఉద్యోగం మీద ఎఐ ఎఫెక్ట్ ఉండడం ఖాయం, అందువల్ల అందరూ ఈ ఎఐ గురించి తెలుసుకొని, నేర్చుకోవాలని అంటున్నారు.
చేయాల్సిన పనులు:
AI పరిజ్ఞానం పెంచుకోండి. ఓన్లైన్ కోర్సులు, సర్టిఫికేషన్లు తీసుకోండి. మీ రంగంలో AI ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి. ఏ ఉద్యోగం అయినా మార్పు చెందుతుంది. అందువల్ల అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది.
AI ఉద్యోగాలపై ప్రశ్నలు
1. ఏ ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయి?
ఎక్కువగా రిపిటేటివ్, మ్యాన్యువల్, బోరింగ్ పనులు ఉంటే, అవి ఎఐ వల్ల తొలగించబడతాయి.
2. ఎలాంటి ఉద్యోగాలను AI ఎప్పటికీ రీప్లేస్ చేయదు?
నాయకత్వం, మానవ అనుభూతి, సృజనాత్మకత, మానవ పరస్పర చర్య అవసరమైన ఉద్యోగాలు.
3. నా ఉద్యోగం ప్రమాదంలో ఉన్నట్లయితే ఏమి చేయాలి?
- భయపడకండి. చర్యలు తీసుకోండి.
- AI టూల్స్ నేర్చుకోండి
- కొత్త నైపుణ్యాలు పొందండి
- అనుకూలమైన మార్గాల్లో దిశ మార్చండి
AI వల్ల ఉద్యోగాలు పోతున్నాయనేది నిజం. కానీ అదే సమయంలో కొత్త అవకాశాలు కూడా వస్తున్నాయి. మనం మార్పును స్వీకరిస్తే, భవిష్యత్తు మనదే. మీరు ఇప్పటికే ఓపెన్ మైండ్‌తో, AI నేర్చుకోవాలని నిర్ణయిస్తే, మీరు పోటీకి సిద్ధంగా ఉన్నట్టే.