ఇప్పుడు కంపెనీ బోనస్ షేర్లను ఇస్తోంది..
ఫైనాన్స్ కంపెనీ ఛాయిస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ తన ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లను ఇచ్చింది. ఈ బోనస్ షేర్ 1:1 నిష్పత్తిలో పంపిణీ చేసింది. అంటే ప్రతి షేరుకు ఒక వాటా ఇచ్చింది. దీని రికార్డు తేదీ సెప్టెంబర్ 23గా నిర్ణయించారు. కంపెనీ డైరెక్టర్ల బోర్డు తెలిపిన ప్రకారం, బోనస్ ఈక్విటీ షేర్లు 1:1 నిష్పత్తిలో ఇచ్చింది. రికార్డు తేదీ శుక్రవారం అంటే 2022 సెప్టెంబర్ 23గా నిర్ణయించింది.
ఛాయిస్ ఇంటర్నేషనల్ స్టాక్ రూ.469.95 నుండి 0.09% పెరిగి రూ.470.35కి చేరుకుంది. గత 4 రోజుల్లో స్టాక్ 7% పైగా రాబడిని ఇచ్చింది. ఈ స్టాక్ గత ఐదేళ్లలో 386.15%, గత పదేళ్లలో 1126.47% రాబడిని ఇచ్చింది. గత మూడేళ్లలో ఈ స్టాక్ 1050% కంటే ఎక్కువ రాబడిని ఇచ్చింది. అదే సమయంలో స్టాక్ గత సంవత్సరం 236.71% రాబడిని ఇచ్చింది. ఎన్ఎస్ఇలో 2022 ఏప్రిల్ 8న స్టాక్ రూ. 481 స్థాయిని తాకగా, ఇది 52 వారాల గరిష్టం, అలాగే రూ. 297 దాని 52 వారాల కనిష్టంగా ఉంది. చాయిస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ స్మాల్ క్యాప్ కంపెనీ, ఈ సంస్థ మార్కెట్ విలువ రూ. 2,340.27 కోట్లుగా ఉంది. ఈ కంపెనీ తన ఖాతాదారులకు వివిధ రకాల ఆర్థిక సేవలను అందిస్తుంది.
గమనిక…. ఇది పెట్టుబడి సలహా కాదు. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు, నిపుణులను సంప్రదించండి. తెలుగు పైసా పెట్టుబడి కోసం మీకు ఎలాంటి సలహా ఇవ్వదు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం అనేది నష్టాలకు లోబడి ఉంటుంది, దయచేసి పెట్టుబడి పెట్టే ముందు మీ సలహాదారుని సంప్రదించండి.