దాదాపు 27 నెలలుగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్), సుకన్య సమృద్ధి వంటి చిన్న పొదుపు పథకాలలో వడ్డీ రేటును పెంచలేదు. ఈ స్కీమ్ లలో పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారులు అక్టోబర్ నెలలో శుభవార్తం వినవచ్చు.
అక్టోబర్ నుంచి డిసెంబర్ త్రైమాసికానికి చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేటును పెంచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి చిన్న పొదుపు పథకాల వడ్డీ రేటును సమీక్షిస్తుంది. అయితే గత 27 నెలలుగా వడ్డీ రేటులో ఎలాంటి మార్పు లేదు, స్థిరంగా కొనసాగుతోంది. చివరిసారిగా ఏప్రిల్-జూన్ 2020 త్రైమాసికంలో వడ్డీ రేట్లు సవరించారు.
ప్రభుత్వ సెక్యూరిటీల (జి-సెకన్) రాబడి పెరుగుదల కారణంగా వడ్డీ రేటు పెంపు అంచనా వేస్తున్నారు. ఇవి ప్రభుత్వంబాండ్లు, వీటి ఆధారంగా వడ్డీ రేట్లు పెంచడం లేదా తగ్గించడం జరుగుతుంది. ప్రస్తుతం పిపిఎఫ్ వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది, ప్రభుత్వ సెక్యూరిటీల ఈల్డ్ ఇప్పటికే 7.3 శాతం దాటింది. నిపుణుల ప్రకారం, పిపిఎఫ్ వడ్డీ రేటును త్వరలో పెంచవచ్చు.
ప్రస్తుతం వివిధ పథకాల్లో వడ్డీ రేటు ఎంత
- పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) – 7.1 శాతం
- నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ (NSC) – 6.8 శాతం
- ఒక సంవత్సర కాల డిపాజిట్ పథకం -5.5 శాతం
- సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (SCSC) – 7.4 శాతం
- సుకన్య సమృద్ధి యోజన -7.6 శాతం
- 5 సంవత్సరాల ఆర్డి(RD)- 5.8%
- సేవింగ్స్ డిపాజిట్ వడ్డీ రేటు- 4%
- టర్మ్ డిపాజిట్ 1 నుండి 5 ఏళ్లకు వడ్డీ రేటు- 5.5-6.7%