క్రిప్టోకరెన్సీతో లాభాలు పొందొచ్చా?

Spread the love

ఇండియాలో బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత ఉందా? ఇది ఎందుకంత పాపులర్ అయ్యింది?

క్రిప్టో కరెన్సీలు భారతదేశంలో పాపులర్ కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇవి మాన్యువల్ కావు. అంటే వీటిని మనుషులు నిర్వహించరు. ఇవి అంతర్జాతీయంగా ఆన్ లైన్ లో ట్రేడ్ అయ్యేవి. లావాదేవీలన్నీ ఆన్ లైన్ లోనే సాగుతాయి. అందువల్ల సమస్యలు ఉండవనే చెప్పాలి. సెంట్రలైజ్ డ్ డిజిటల్ కరెన్సీ కనుక , అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీల్లో ఏదైనా ప్రభుత్వ వ్యవస్థ ద్వారా జరగాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వ సంస్థ జోక్యం లేకుండానే వ్యవహారాలు చేయవచ్చు. ప్రభుత్వపరంగా ఎదురయ్యే ఇబ్బందులు ఉండవు.
ఈక్విటీల మాదిరే మనీ మార్కెట్లలో క్రిప్టో కరెన్సీలకు కూడా అవే డైనమిక్స్ వర్తిస్తాయి. ఇవి ఒక పరిమితమైన మార్కెట్లో ట్రేడ్ అవుతాయి కనుక, పెట్టుబడిదారుడికి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ద్వారా కొన్ని ప్రయోజనాలున్నాయి. మధ్యవర్తిత్వం వహించే సందర్భాల్లో షేర్ హోల్డర్ కు కూడా భాగస్వామ్యం ఉంటుంది. క్రిప్టోను సులభంగా ఉపయోగించుకోవచ్చు. ట్రాన్స్ పెరెన్సీ ఉంది. అందువల్లే క్రిప్టోకు ఇంత గుర్తింపు, ఆమోదం లభించాయి. క్రిప్టో కరెన్సీలను, బ్లాక్ చైన్ ను ఎవరూ హ్యాక్ చేయలేరు.ప్రతివారి దగ్గర పూర్తి డేటా ఉంటుంది కనుక, బ్లాక్ చైన్ టెక్నాలజీతో నిర్వహింపబడుతోంది కనుక దీనికి పారదర్శకత ఉంది. టాంపరింగ్ కు, స్కాంలకు అవకాశం లేదు. ఇది నమ్మకమైన, సేఫ్ ట్రాన్స్ యాక్షన్. డేటా ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతుంది. ఒకసారి ట్రాన్స్ యాక్షన్ అయితే దాన్ని రివర్స్ చేయలేరు. ఈ విధానంలో చాలా స్పీడ్ గా లావాదేవీలు జరిపే వీలుంది. ఎంత వేగంగా అంటే కాంతి అంత వేగంగా. పైగా ఎలాంటి పొరపాట్లు, తప్పులు లేకుండా. ఇందువల్లే ప్రొఫెషనల్స్ క్రిప్టో కరెన్సీని ఎంపిక చేసుకున్నారు.


ఇండియాలో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత ఉందా?

చైనాలో దీని వినియోగం భారీగా ఉండడంతో మన దేశంతో సహా ఆసియాలో ఇది బాగా విస్తరించింది. కానీ ఇప్పుడు చైనా క్రిప్టోకరెన్సీ లావాదేవీలను నిషేధించింది. అయితే ఎంత నిషేధం విధించినా ఇతర దేశాల్లో దీని ప్రభావం మాత్రం తగ్గడం లేదు. ఆన్ లైన్ ట్రాన్స్ యాక్షన్లలో క్రిప్టో కరెన్సీ కీలకంగా మారుతోంది. పబ్లిక్ కూడా దీనికి అలవాటు పడుతున్నారు. ఆదరణ పెరుగుతోంది. అయితే వినియోగదారుల ఆర్థిక భద్రత విషయంలో ఆందోళన చెందిన రిజర్వ్ బ్యాంక్ 2018లో క్రిప్టో కరెన్సీ లావాదేవీలు చేయకూడదని కమర్షియల్ బ్యాంకులపై నిషేధం విధించింది. కానీ ఇటీవల సుప్రీంకోర్టు ఈ నిషేధాన్ని తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కరోనా తీవ్రత, లాక్ డౌన్ ల నేపథ్యంలో క్రిప్టో కరెన్సీ మరింత కీలకంగా మారింది. మన దేశంలో దీనికి చట్టబద్ధత కల్పించాల్సి ఉంది. అయితే దీనిపై ప్రభుత్వం తీవ్రంగా చర్చిస్తోంది. వచ్చే కేంద్ర బడ్జేట్ సమావేశాల్లో క్రిప్టోపై ఒక నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు.

కొన్ని ముఖ్యమైన క్రిప్టో కరెన్సీలు

బిట్ కాయిన్ (బిటిసి)
దీని గురించి ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఈ ఫీల్డ్ లో బిట్ కాయిన్ టాప్ పొజిషన్ లో ఉంది. ప్రపంచంలో నంబర్ వన్ గా ఉన్న బిట్ కాయిన్ ప్రస్తుతం సప్లైలో 21 మిలియన్ల కొరత ఎదుర్కొంటోంది. అలాగే దీని రేటు కూడా ఎక్కువే. కానీ ఇది చిన్న మొత్తంలో కూడా దొరుకుతుంది. దీనికి కనీస పెట్టుబడి 100 రూపాయలు. 2017 లో దాని విలువ ఒక కాయిన్ కు 1000 డాలర్లు ఉంది. ఇప్పుడు దాని విలువ 61,887 డాలర్లకు చేరింది.

ఇథోరియం (ఇటిహెచ్)
క్రిప్టో కరెన్సీ ఫీల్డ్ లో బిట్ కాయిన్ తర్వాత ఇథోరియం సెకండ్ ప్లేస్ లో ఉంది. ఇది 2017 లో ప్రారంభమైంది. దీర్ఘ కాలిక, స్వల్ప కాలిక కాయిన్స్ కూడా మార్కెట్ లో దొరుకుతున్నాయి.ఇది బిజినెస్ రంగంలో బాగా పాపులర్ అయింది. దీని విలువ దాదాపు 200 డాలర్ల మార్క్ ను చేరుకుంటోంది. ఇండియాలో 2021లో ఇథోరియం అనేది బెస్ట్ క్రిప్టో కరెన్సీల్లో ఒకటిగా నిలిచింది.

రిపిల్ (ఎక్స్ ఆర్ పి)
ఇండియాలో ఇది మూడో స్థానంలో ఉంది. బ్యాంకింగ్, ఆర్థిక సంస్థలకు రిపిల్ హాట్ ఛాయిస్. రాబోయే రోజుల్లో రిపిల్ వేగవంతమైన ట్రాన్స్ యాక్షన్ ప్రాసెసింగ్ టైమ్స్, క్రాస్ బార్డర్ పార్టనర్ షిప్స్ తో ఇది మరింత శక్తివంతం కాబోయే సూచనలున్నాయి.

లైట్ కాయిన్ (ఎల్.టి.సి)
ఇది బిట్ కాయిన్ బ్రాంచ్. మార్కెట్ కాపిటలైజేషన్ లో ఇది సుస్థిరంగా ఉంది. క్రిప్టో కరెన్సీ ప్రపంచంలో ఇది ఏడో స్థానంలో ఉంది. ఇది వినియోగదారులకు నియర్ జీరో, ఇన్ స్టంట్ కాస్ట్ పేమెంట్స్ ను అందిస్తోంది.

బినాన్స్ కాయిన్ (బిఎన్ బి)
ప్రపంచంలో లీడింగ్ క్రిప్టో కరెన్సీ ఎక్సేంజెస్ లో ఇదొకటి. వరల్డ్ లో టాప్ 10 క్రిప్టో కరెన్సీల్లో బి ఎన్ బి ఉంది. క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఇది నిలబడి నెగ్గుకు రాగలిగింది కాబట్టి దీనికి మంచి ఫ్యూచర్ ఉందని ఎనలిస్ట్ లు అంటున్నారు.

కొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి

  • క్రిప్టో కరెన్సీని కొనడంలో తగు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కంపెనీ యజమాని ఎవరు? క్రెడిబిలిటీ ఏమిటి? కంపెనీ సమాచారం ఉన్న ప్రాస్పెక్టస్ ను పూర్తిగా చదివి అవగాహన చేసుకోవాలి. మీరు కాక, ఇతర ప్రధాన ఇన్వెస్టర్లు ఎవరెవరో తెలుసుకోవాలి. వారు ఎలాంటి ఆందోళనా లేకుండా ఉన్నారా ? అని తెలుసుకోవాలి.
  • కంపెనీలో భాగస్వామ్యం ( స్టేక్) కోరుతున్నారా? లేక కేవలం కరెన్సీని కొనడం వరకే పరిమితం అవుతారా? కంపెనీ కరెన్సీ ఇప్పటికే మంచి పొజిషన్ లో ఉందా లేక డెవలప్ మెంట్ కోసం మనీని కంపెనీ రెయిజ్ చేయాలనుకుంటోందా? కంపెనీ ప్రాస్పెక్టస్ అంతా పాజిటివ్ గానే ఉంటుంది. కాబట్టి మార్కెట్ స్టడీ కూడా చేయాలి.

క్రిప్టో కరెన్సీ స్కాంలను నివారించడం ఎలా?

క్రిప్టోకరెన్సీలో మోసాలు, స్కాంలు చేసేవాళ్లు ఉన్నారు. వీరు వ్యక్తిగత ఖాతాదారుల డబ్బును దోచుకునేందుకు నిరంతరం రకరకాల ప్లాన్లు వేస్తుంటారు. మీ ఎసెట్స్ ను కంప్యూటర్ మాయాజాలం ద్వారా కొల్లగొట్టేందుకు హాకర్లు ట్రై చేస్తుంటారు. ముఖ్యంగా ఒకటి గుర్తుంచుకోండి. క్రిప్టో కరెన్సీ ద్వారా మీరు పేమెంట్ చేయాలని ఎవరైనా మీకు చెప్పినా, లేదా గిఫ్ట్ కార్డ్ లేదా వైర్ ట్రాన్స్ ఫర్ ద్వారా పే చేయాలని చెబితే ఆ వ్యక్తి తప్పకుండా స్కాం చేసేందుకే చెబుతున్నాడని గుర్తుంచుకోండి. ఎక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ ప్రాఫిట్ వస్తుందని ఆశ పెడతారు. ప్రామిస్ లు చేస్తారు. నకిలీ గ్యారెంటీలిస్తారు. తక్కువ టైంలో ఎక్కువ లాభాలు పొందండి అని కంపెనీలు ఊరిస్తాయి. మీరు పే చేస్తే ఆ ప్రాజెక్ట్ లో మరికొందరు కూడా చేరుతారని ఆశ చూపిస్తారు. ఆ మాయమాటలకు మోసపోయి ఒకవేళ మీరు పే చేస్తే మీ డబ్బు ఎప్పటికీ తిరిగి రాదు. వచ్చే దారి కూడా ఉండదు.

మీరు ఎలా మోసపోతారంటే ?

స్కాంలు చేసేవాళ్లు మొదట మీకు ఏదోక ఆశ చూపిస్తూ ఇ మెయిల్స్ పంపుతారు. పర్సనల్ సమాచారం, ఫోటోలు, పర్సనల్ వీడియోలు పంపమంటారు. మీరు పంపిన తర్వాత బెదిరించడం మొదలు పెడతారు. క్రిప్టో కరెన్సీ మోడ్ లో డబ్బు చెల్లించకుంటే వాటిని బయట పెడతామని భయపెడతారు. ఇలా బ్లాక్ మెయిల్ చేస్తారు. అప్పుడు మీరు వెంటనే పోలీసులకు లేదా ఎఫ్ బిఐ కి కంప్లయింట్ చేయాలి. ఇక సోషల్ మీడియా ద్వారా కూడా ఇలా చేస్తుంటారు. ఏదైనా ఒక టెక్స్ట్ మేటర్, ట్వీట్, ఇ మెయిల్ ద్వారా క్రిప్టో కరెన్సీ పంపమంటారు. ఆ మెసేజ్ మీకు తెలిసిన వారి పేరు మీద రావచ్చు. లేదా మీ అభిమాన సెలెబ్రిటీ పేరు మీద కూడా రావచ్చు. మిమ్మల్ని ట్రాప్ చేయడానికి వాళ్లు ఎన్ని ఎత్తులైనా వేస్తారు. కొందరు మీ సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేస్తారు. అప్పుడు మీరు వెంటనే సోషల్ మీడియాలో ఈ స్కాం గురించి చెప్పడం మంచిది. అలాగే సైబర్ నేరాలను విచారించే పోలీసులకూ సమాచారమివ్వాలి.

క్రిప్టోలో ఎంత పెట్టుబడి పెట్టవచ్చు?

దానికి ఇంత అని రూలేం లేదు. ఎంతైనా ఇన్ వెస్ట్ చేయవచ్చు. అయితే తక్కువ సొమ్ముతో స్టార్ట్ చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు బిట్ కాయిన్ లో ఎనిమిది డెసిబిల్స్ వరకు అనేక స్థాయిలున్నాయి కనుక మీరు మొదట చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టడం మంచిది. క్రిప్టో కరెన్సీ ని ఎంచుకునే ముందు ఈ రంగంలోకి మొదటిసారి అడుగు పెడుతున్న వ్యక్తి వివిధ కంపెనీల రికార్డుల్ని పరిశీలించి, మార్కెట్ ను అధ్యయనం చేసి ముందుకు వెళ్లడం మంచిది.

గమనిక ..

క్రిప్టో మార్కెట్ చాలా హెచ్చుతగ్గులకు గురవుతుంది. ఇది ఎంతో రిస్క్ తో కూడినది. ఈ క్రిప్టో కరెన్సీలో భారీ లాభాలు కనిపిస్తాయి. అంతేవిధంగా భారీ నష్టాలను కూడా తెచ్చిపెడ్తాయి. కొనే ముందు వినియోగదారులు తమ వ్యక్తిగత సలహాదారుల సలహా తీసుకోవాలి. ఇది అవగాహన కోసం మాత్రమే, తెలుగుపైసా.కామ్ ఇన్వెస్ట్ చేయమని సలహా ఇవ్వదు, ఎలాంటి బాధ్యత వహించబోదు.

క్రిప్టో కరెన్సీ.. రూపాయి, డాలర్ వంటిదేనా? అసలు ఈ క్రిప్టో అంటే ఏమిటి?

Spread the love

2 thoughts on “క్రిప్టోకరెన్సీతో లాభాలు పొందొచ్చా?”

  1. Thank you very much for sharing. Your article was very helpful for me to build a paper on gate.io. After reading your article, I think the idea is very good and the creative techniques are also very innovative. However, I have some different opinions, and I will continue to follow your reply.

    Reply

Leave a Comment

error: Content is protected !!