వాటిని బ్యాంకులో మార్చుకోవచ్చా? ఎలా? ఆర్బిఐ ఏం చెబుతోంది?
మనం దుకాణానికి వెళ్లినా, ఎక్కడైనా షాపింగ్ చేసినా, వీధుల్లో ఏమైనా చిరుతిండ్లు తిన్నా, పెట్రోలు బంకుల వద్ద అనుకోకుండా చిరిగిన నోట్లు వస్తే వెంటనే మనం గుర్తించి, వాటిని వెనక్కి ఇచ్చి మరో నోటు తీసుకుంటాం. కానీ బ్యాంక్ ఎటిఎంల నుంచి చిరిగి నోట్లు వస్తే ఎలా? దీనికి దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఆ ఎటిఎంకు చెందిన బ్యాంక్ వారే ఆ చిరిగిన నోట్లకు బదులుగా మంచి నోట్లు ఇస్తారు. ఎలా? వివరాలెంటో తెలుసుకుందాం.
ఎటిఎంలు వచ్చిన తర్వాత ఇంట్లో డబ్బులు దాచుకోవడం తగ్గింది. డబ్బు అవసరమైతే ఎటిఎం వద్దకు వెళ్లి ఎంత కావాలో విత్ డ్రా చేసుకుంటున్నారు. ఇలా డబ్బును విత్ డ్రా చేసుకునే సమయంలో ఒక్కోసారి పాత నోట్లు, చిరిగిన నోట్లు కూడా చూస్తుంటాం. వీటిని మార్చుకోవాలంటే ఏం చేయాలో అర్థం కాదు, అవి యంత్రం నుంచి వచ్చాయి కదా, అని అనుకుంటాం.
బ్యాంకు ఎటిఎంల నుంచి చిరిగి నోట్లు రావడం సాధారణమైన విషయం, కానీ మీరు ఏం చేయలేం, అని అనుకోవడం మాత్రం పొరపాటు. ఎటిఎం నుంచి వచ్చిన చిరిగిన నోట్లను సంబంధిత బ్యాంక్ కు వెళ్లి నోట్లను మార్చుకునే వీలుంది. బ్యాంకులు దీనికి నిరాకరించవు కూడా. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఆర్‌బిఐ ఏం చెప్పింది?
సింపుల్ గా ఆర్బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) చెప్పిందేమిటో తెలుసుకుందాం. ఎటిఎంల నుంచి చిరిగిన నోట్లు వస్తే ప్రభుత్వరంగ లేదా ప్రైవేటురంగ బ్యాంకుల్లో మార్చుకోవచ్చు. దీని ఆ బ్యాంకులు నిరాకరించలేవు. 2017 సంవత్సరంలో ఆర్బిఐ విడుదల చేసిన మార్గదర్శకాల్లో అన్ని బ్యాంకులు అభ్యంతరం చెప్పకుండా చిరిగిన, లేదా తడిసిన నోట్లను మార్పిడి చేస్తాయని పేర్కొంది.
చిరిగిన నోట్లను ఎలా మార్చుకోవాలి?
మనం ఏ బ్యాంక్ ఎటిఎం నుంచి అయితే విత్ డ్రా చేశామో, అదే బ్యాంక్ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ మీరు ఒక అప్లికేషన్ రాసి, ఎటిఎం నుంచి విత్ డ్రా చేసిన డబ్బు మొత్తం, తేదీ, సమయం వంటి వివరాలను తెలియజేయాలి. అలాగే ఎటిఎం విత్ డ్రా స్లిప్ ను చూపాలి, అది లేకపోతే మీ ఫోన్ లో వచ్చిన డెబిట్ మెసేజ్ ను చూపించాలి.
నిరాకరిస్తే జరిమానా
ఆర్బిఐ 2016 జూలైలో జారీ చేసిన సర్క్యలర్ ప్రకారం, బ్యాంక్ ఎటిఎంల నుంచి విత్ డ్రా చేస్తే వచ్చిన చిరిగిన నోట్లను మార్పిడి చేసేందుకు సదరు బ్యాంకు గనుక నిరాకరిస్తే శిక్ష ఉంటుంది. రూ.10 వేల జరిమానా విధిస్తారు. ఈ నిబంధనలు ప్రభుత్వరంగ, ప్రైవేటురంగ బ్యాంకులకు వర్తిస్తాయి.