తక్షణం పాటించాల్సిన పనులు ఇవే..
ఇప్పుడున్న టెక్నాలజీ మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతోంది. అయితే జాగ్రత వహించకపోతే మనం చేసే పొరపాట్లు సరిదిద్దుకోలేని పరిస్థితికి దారితీయవచ్చు. ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా డిజిటల్ వాలెట్‌లు, నెఫ్ట్, ఆర్‌టిజిఎస్, యుపిఐ, గూగుల్ పే, భీమ్ వంటి ఇతర సేవలేన్నో మనకు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా డబ్బును పంపడం, అందుకోవడం రెండూ సులభతరం అయ్యాయి. డబ్బును ఎవరికైనా పంపాలంటే కొన్ని సెకన్లలోనే చేసే సౌకర్యం ఉంది ఇప్పుడు. ఐఎఫ్‌ఎస్‌సి కోడ్, పేరు, బ్యాంక్ శాఖ పేరు వంటి అదనపు వివరాల అవసరం లేకుండానే డబ్బుని పంపే సౌకర్యం వచ్చింది. కానీ కొన్ని సమయాల్లో డబ్బు పంపేటప్పుడు ఖాతా నంబరు తప్పుగా ఇస్తే, ఆ డబ్బు వేరే వారికి వెళుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి. మీరు పంపిన తప్పు ఖాతా సంఖ్య ఉనికిలో లేకుంటే పర్వాలేదు, ఎందుకంటే ఆ డబ్బు తిరిగి మన ఖాతాలోనే క్రెడిట్ అవుతాయి. కానీ తప్పుగా పంపిన ఖాతా సంఖ్య కరెక్టుగా ఉంటే మన డబ్బు పోయినట్లేనా.. ఒక వేళ అలాంటి తప్పులు జరిగితే ఏం చేయాలి.. పూర్తిగా తెలుసుకుందాం.
మొద చేయాల్సింది బ్రాంచ్ మేనేజర్‌ను కలవడం..
మీరు పంపిన డబ్బు తప్పు ఖాతాకు వెళితే ముందుగా చేయవలసింది బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్‌ను కలవడం. ముందు బ్యాంకుకు ఒక మెయిల్ లేదా ఫోన్ కాల్ ద్వారా తెలియజేసి, వీలైతే బ్రాంచ్ మేనేజర్‌ను వ్యక్తిగతంగా కలవాలి. డబ్బు మరొక బ్యాంక్ లేదా వేరే బ్రాంచ్ ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ అయితే, అది అందుకున్న ఖాతాను పరిశీలిస్తారు. అందువల్ల మీరు తప్పనిసరిగా మీ బ్రాంచ్‌కు సమాచారం ఇవ్వడం లేదా వ్యక్తిగతంగానైనా కలవడం చేయాలి. లావాదేవీ నిర్వహించిన తేదీ, సమయం, మీ ఖాతా నంబర్, లబ్దిదారుని ఖాతా సంఖ్య వంటి పూర్తి వివరాలను ఇవ్వాలి. లావాదేవీలకు సంబంధించిన రుజువులు, స్క్రీన్ షాట్ లను అయినా ఇవ్వొచ్చు.
రిసీవర్ బ్రాంచ్‌కు కంప్లైంట్ ఇవ్వాలి
మీరు తప్పుగా పంపితే డబ్బు పొందినవారి బ్యాంకుకు ఫిర్యాదు చేయాలి. ఆ తర్వాత కస్టమర్ అనుమతినివ్వకుండా బ్యాంక్ ఖాతా నుండి డబ్బుని విత్ డ్రా చేయవద్దనే సమాచారం ఇవ్వాలి. బ్యాంకులు, వారి వినియోగదారుల గురించి సమాచారాన్ని పంచుకోవడం ద్వారా వారు కస్టమర్‌కు తెలియజేస్తారు. డబ్బును మీ ఖాతాలోకి తిరిగి బదిలీ చేయమని వారికి సూచిస్తారు.
చట్టపరమైన చర్య
సాధారణంగా అనుకోకుండా తన ఖాతాలోకి వచ్చిన డబ్బును, ఇది మిస్టేక్ వల్ల డబ్బు అందుకున్నానని తెలియజేస్తే చాలా వరకు తిరిగి ఇస్తారు. ఒకవేళ వారు డబ్బును విత్ డ్రా చేసుకోవడం, లేదా ఇవ్వను అని అంటే మాత్రం బ్యాంకులు తగు చర్యలు చేపడుతుంది. లబ్ధిదారుడిపై కేసు నమోదు చేసి, తర్వాతి చర్యలు చేపడతారు. ఆఖరి సమయంలో ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. అందువల్ల బ్యాంకు వినియోగదారులు తమ లావాదేవీలను ఎప్పుడూ జాగ్రత్తగా ఉండి, ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలి. అకౌంట్ నంబర్లను టైప్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు సరిచూసుకుంటే మనకే మంచిది. పంపే వారి ఖాతా, ఇతర వివరాలను కరెక్టుగా తెలుసుకోవాలి.
Cool. I spent a long time looking for relevant content and found that your article gave me new ideas, which is very helpful for my research. I think my thesis can be completed more smoothly. Thank you.