పిపిఎఫ్, ఎఫ్‌డి రెండింటిలో ఏది ఉత్తమం..?

Spread the love

ఏది మంచి రాబడిని ఇస్తుందో తెలుసుకోవడం ఎలా?

సురక్షితమైన పెట్టుబడి కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డి), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్) ఈ రెండూ ఉత్తమం. అయితే ఈ రెండింటిలో ఇంకా ఏది సురక్షితమైనది, ఏది మంచి రాబడిని ఇస్తుందో తెలుసుకోవడం ఎలా? అంటే రాబడి విషయంలో పిపిఎఫ్ ఎంచుకోవాలి. కానీ ఎఫ్డిలో రాబడి అంతగా ఉండదు. ఎఫ్‌డి కంటే ఎక్కువ రాబడి రావాలి, మీ డబ్బు సురక్షితంగా ఉండాలి, ఈ రెండు లక్షణాలు కల్గినదే పిపిఎఫ్‌ అని చెప్పవచ్చు. అందుకే పిపిఎఫ్ లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమమైంది. ప్రస్తుతం పిపిఎఫ్‌లో 7 శాతానికి పైగా వార్షిక వడ్డీ వస్తోంది. కానీ ఇది దీర్ఘకాలం పెట్టుబడిని కొనసాగించాల్సి ఉంటుంది. పిపిఎఫ్‌లో పెట్టుబడితో పన్ను ప్రయోజనాలను పొందడంతో పాటు మంచి రాబడి అందుకోవచ్చనే తెలుసుకోవాలి.

ఈ పథకం గురించి కొన్ని విషయాలు..

  • పిపిఎఫ్‌ను ఖాతాను ప్రారంభించిన తర్వాత 5 ఏళ్ల వరకు డబ్బును ఉపసంహరించుకోలేము, ఐదేళ్లు వ్యవధి పూర్తయితే డబ్బు తీసుకునే వీలు ఉంటుంది.
  • 15 సంవత్సరాల మెచ్యూరిటీ ఉంటుంది, గడువునకు ముందే డబ్బు తీసుకుంటే 1 శాతం ఫండ్ కట్ చేస్తారు.
  • ఈ మెచ్యూరిటీ తర్వాత పొడిగించవచ్చు. ఈ 5-5 ఏళ్ల చొప్పున పొడిగింపునకు వీలు ఉంటుంది. మెచ్యూరిటీ కొద్ది రోజుల్లో ముగుస్తుందనే లోపే ఈ పొడిగింపునకు అప్లై చేయాలి.
  • 25 సంవత్సరాలు ఈ స్కీమ్ లో పెట్టుబడి పెట్డానికి అవకాశముంది. మీరు డబ్బును ఉపసంహరించుకోవాలంటే 15, 20 లేదా 25 ఏళ్ల కాలాల్లో వీలవుతుంది.
  • ఇఇఇ కేటగిరీ కింద పిపిఎఫ్ పథకంలో మొత్తం పెట్టుబడిపై పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంటుంది. ఈ పథకంలో సంపాదించిన వడ్డీ, మొత్తం పెట్టుబడిపై ఎలాంటి పన్ను ఉండదు.
  • దీనిలో వడ్డీ రేటు ప్రతి మూడు నెలలకు చేంజ్ అవుతుంది. పిపిఎఫ్ ఖాతాను కోర్టు, ఇతర విధానాల ద్వారా జప్తు చేయలేరు.
  • పిపిఎఫ్ ఖాతాపై రుణం పొందవచ్చు, ఆ ఖాతా ఉన్న బ్యాంకు వారిని సంప్రదించాలి.
  • ఖాతా ప్రారంభించిన తర్వాత ఒక ఆర్థిక సంవత్సరం ముగియాలి. ఆ తర్వాత ఐదో ఆర్థిక సంవత్సరం ఆఖరు వరకు లోన్ ఫెసిలిటీ ఉంది. గరిష్టంగా 25 శాతం రుణం తీసుకునే వీలుంది.
  • ఈ ఖాతా తెరిచేందుకు కనీసం రూ.500, గరిష్ఠంగా రూ.1.5 లక్షలు ఉంటుంది, పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకు ద్వారా తెరవచ్చు.
  • ఈ ఖాతాను మైనర్ తరపున ఇతర వ్యక్తులు కూడా ప్రారంభించే అవకాశం ఉంది.
  • మీరు తెరిచిన పిపిఎఫ్ ఖాతా నిధులు లేక ఆగిపోతే, దాన్ని మళ్లీ ప్రారంభించే వీలుంది. దీనికి దరఖాస్తును రాతపూర్వకంగా ఇవ్వాలి.


Spread the love

Leave a Comment

error: Content is protected !!