బ్యాంక్ లోన్ కు ఎంత క్రెడిట్ స్కోరు ఉండాలి?

Spread the love

క్రెడిట్ స్కోర్ అంటే ఏమిటి?
దీంతో ప్రయోజనం ఏమిటి?

రుణం పొందాలంటే క్రెడిట్ స్కోరు ఎంతో కీలకం. ఇప్పుడు క్రెడిట్ స్కోరు ఆధారంగానే బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. ఈ స్కోర్ సరిగ్గా లేదంటే రుణం పొందడం కష్టం. వ్యక్తిగత రుణం(personal loan), గృహ రుణ(home loan) అయినా ఈ క్రెడిట్ స్కోరు బాగుంటేనే తక్కువ వడ్డీ రేటుతో సులభంగా రుణం పొందవచ్చు. సిబిల్ లెక్కించే ఈ క్రెడిట్ స్కోర్ నే సిబిల్ స్కోర్ గా పిలుస్తారు. సిబిల్ స్కోరు 300 నుండి 900 పాయింట్ల వరకు ఉంటుంది. అయితే 750 పాయింట్ల కంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే బెటర్ అని అర్థం. అంటే ఈ స్థాయిలో క్రెడిట్ స్కోర్ ఉంటే బ్యాంక్ లోన్ సులువుగా పొందవచ్చు. అంతేకాదు ఎక్కువ క్రెడిట్ స్కోరు ఉంటే బ్యాంకు, ఇతర రుణ సంస్థలు తక్కువ వడ్డీ రేటుకే లోన్లను ఇస్తాయి. క్రెడిట్ స్కోర్ ఎలా నిర్ణయిస్తారు.. సరైన క్రెడిట్ స్కోర్ పొందడం ఎలా.. వంటి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం.

ఈ క్రెడిట్ స్కోర్ ను అనేక క్రెడిట్ బ్యూరోలు నిర్ణయిస్తాయి. ముఖ్యమైన క్రెడిట్ బ్యూరోల్లో ట్రాన్స్ యూనియన్ సిబిల్, ఎక్స్ పీరియన్, సిఆర్ఐఎఫ్ హైమార్క్, ఈక్విఫాక్స్ వంటివి ఉన్నాయి. ప్రతి నెలా బిల్లులు, అలాగే ఇఎంఐ(రుణ వాయిదాలు) చెల్లించే రికార్డులు, ఇంకా గత కొన్నేళ్ల రికార్డులను పరిగణనలోకి తీసుకుని ఈ క్రెడిట్ స్కోర్ను ఈ సంస్థలు నిర్ణయిస్తాయి. సియుఆర్ (క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో) అనేది చూసే ఉంటాం. సియుఆర్ అంటే క్రెడిట్ కార్డ్ రుణ పరిమితి నెలలో ఎంత ఉపయోగిస్తారో ఇది చెబుతుంది. ఈ సియుఆర్ క్రెడిట్ స్కోర్ను నిర్ధారించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. మీరు క్రెడిట్ కార్డును ఎంత వినియోగిస్తారనే విషయంపై ఈ సియుఆర్ ఆధారపడి ఉంటుంది.

చాలా కాలంగా రుణ వాయిదాలు చెల్లించడం, క్రెడిట్ కార్డును కొనసాగిస్తున్నారా? అయితే క్రెడిట్ స్కోరు విషయంలో ఇది మంచిదే. ఇది రుణాన్ని సరిగ్గా నిర్వహిస్తున్నారనే సంకేతాలు ఇస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే లోన్, క్రెడిట్ కార్డుల కోసం తరచూ అంటే ఎప్పుడూ దరఖాస్తు చేస్తున్నారా? ఇది సరైంది కాదు. ఎక్కువ సార్లు దరఖాస్తు చేస్తే క్రెడిట్ స్కోర్ పై ప్రతికూల ప్రభావం పడుతుంది. అంతేకాదు క్రెడిట్ స్కోరు తగ్గవచ్చు కూడా. రుణ వాయిదాలను అంటే ఇఎంఐలను ఆలస్యం చేయకుండా సకాలంలో చెల్లించాలి. కొంత మొత్తమే చెల్లించడం వంటివి చేయొద్దు. పూర్తిగా ఇఎంఐలను చెల్లించాలి. ఏ మాత్రం ఆలస్యం చేసినా క్రెడిట్ స్కోరు 100 పాయింట్లు పడిపోయేందుకు ఆస్కారం ఉంటుంది.

సాధారణంగా క్రెడిట్ కార్డు పరిమితి ఎక్కువగా ఉంటుంది. కానీ పరిమితిలో 30 శాతానికి మించి వాడకపోవడమే మేలు, ఇది సిబిల్ స్కోరుకు మంచి సంకేతం. ఎందుకంటే పరిమితికి మించి క్రెడిట్ కార్డును వినియోగించే వారు అధికంగా అప్పుులపై ఆధారపడి ఉన్నారని బ్యాంకులు భావిస్తాయి. దీని వల్ల కొత్తగా రుణం ఇచ్చేందుకు బ్యాంకులు ఆలోచిస్తాయి. అంతేకాదు క్రెడిట్ బ్యూరో సంస్థలు కూడా క్రెడిట్ స్కోరును తగ్గించడం జరుగుతుంది. అయితే పరిమితి అవసరం అనుకునే వారు, క్రెడిట్ కార్డు లిమిట్ ను మరింతగా పెంచుకోవడం ఉత్తమం.

మంచి క్రెడిట్ స్కోరు ఉంటే కొత్త లోన్ తక్కువ రేటుకు పొందడంతో పాటుగా ప్రస్తుతం ఉన్న రుణంపై బ్యాంకులను సంప్రదించి వడ్డీ రేట్లను సమీక్షించమని కోరవచ్చు కూడా. మీరు 20 సంవత్సరాల కాలపరిమితితో హోమ్ లోన్ రూ.30 లక్షల లోపు తీసుకోవాలని భావించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ సిబిల్ స్కోరు ఉందంటే వడ్డీ రేటులో వ్యత్యాసం ఏడాదికి 0.5 శాతం ఉండే అవకాశముంది.

సాధారణంగా క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోళ్లు జరిపినప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, చెల్లించేందుకు 45 రోజుల వ్యవధి ఉంటుంది. ఈ గడువు లోపలే బాకీని పూర్తిగా చెల్లించాలి. ఒకవేళ కనీస మొత్తం చెల్లించి, మీ బాకీని తర్వాత నెలకు క్యారీ ఫార్వార్డ్ చేస్తే సిబిల్ స్కోరుకు దెబ్బ పడినట్టే.

క్రెడిట్ స్కోర్‌ను పెంచుకోవడం, రక్షించుకోవడం ఎలా..

 మీ క్రెడిట్ చరిత్ర రిపోర్ట్ కార్డ్, ఇది హోమ్ లోన్ తీసుకోవడానికి మీకు ఎంత అర్హత ఉందో తెలియజేస్తుంది. క్రెడిట్ స్కోర్ లోన్ లేదా క్రెడిట్ కార్డ్ బిల్లులను తిరిగి చెల్లించడంలో మీ ట్రాక్ రికార్డ్ గురించి మీకు తెలియజేస్తుంది. ఒక విధంగా, రుణాన్ని సులభంగా పొందడం వంటి వాటికి ఉపయోగపడుతుంది.

రుణాలకు పెరుగుతున్న డిమాండ్ 

జూలై 2023లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన నివేదిక గత 11 ఏళ్లలో రెసిడెన్షియల్ హౌస్ లోన్‌ల పెరుగుదల గణాంకాలను సూచిస్తుంది. నివేదిక ప్రకారం, మొత్తం రుణాలలో గృహ రుణాల వాటా మార్చి 2022లో 8.6 శాతంగా ఉంది, ఇది మార్చి 2023 నాటికి 14.3 శాతానికి పెరిగింది. హోమ్ లోన్ మొత్తం, కాలపరిమితి ఎక్కువ ఉంది. గృహ రుణాలకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా దరఖాస్తుదారుక్రెడిట్ చరిత్రను తనిఖీ చేయడం చాలా ముఖ్యం. దీనికోసం క్రెడిట్ స్కోర్‌ను మించిన ఉత్తమ సాధనం మరొకటి లేదు.

రుణ చెల్లింపు చరిత్ర ముఖ్యమైనది 

క్రెడిట్ స్కోర్ మీ గత లోన్ రీపేమెంట్ హిస్టరీ ఆధారంగా లెక్కిస్తారు. ఇది స్కోర్‌లో 35 శాతంగా ఉంటుంది. అదేవిధంగా క్రెడిట్ బ్యాలెన్స్, వినియోగం 30 శాతంగా ఉన్నాయి. క్రెడిట్ పొందే వ్యవధి 15 శాతం, కొత్త క్రెడిట్ మరియు క్రెడిట్ మిశ్రమం ఒక్కొక్కటి 10 శాతం. మంచి క్రెడిట్ స్కోర్‌ని కలిగి ఉండటానికి మీరు ఈ  పరిమాణాలు  అన్ని మంచి స్థాయిలో ఉండాలి. గృహ రుణం తీసుకునే ముందు మంచి క్రెడిట్ స్కోర్‌ను నిర్మించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మీ క్రెడిట్ వినియోగ గణాంకాలను పర్యవేక్షించండి, క్రెడిట్ కార్డ్‌లను రద్దు చేయవద్దు. మీ అర్హతను తనిఖీ చేయండి. మీరు మంచి క్రెడిట్ చరిత్రను సృష్టించాలనుకుంటే, ఒకేసారి ఒక రుణాన్ని మాత్రమే తీసుకోండి. సకాలంలో రుణాన్ని తిరిగి చెల్లించండి, క్రెడిట్ కార్డ్ చెల్లింపులను ఆలస్యం చేయవద్దు.

క్రెడిట్ వినియోగం అంటే 

క్రెడిట్ చరిత్రపై దృష్టి సారించడంతో పాటు, క్రెడిట్ వినియోగాన్ని నిర్వహించడం కూడా ఒక కళ. ఇది మీ క్రెడిట్ కార్డ్‌పై అందించే రివాల్వింగ్ క్రెడిట్. క్రెడిట్ వినియోగ నిష్పత్తి 30 శాతం లేదా అంతకంటే తక్కువ ఉండాలి. అంటే, మీ క్రెడిట్ కార్డ్ మొత్తం పరిమితి రూ. 1 లక్ష అయితే, మీ బకాయి బ్యాలెన్స్ ఎప్పుడైనా రూ. 30 వేలు మించకూడదు. ఈ విధంగా, తక్కువ క్రెడిట్ వినియోగ నిష్పత్తి క్రెడిట్ ఏజెన్సీకి మీ ఖర్చులను ఎలా నిర్వహించాలో మరియు మీ క్రెడిట్‌ను పరిమితుల్లో ఉంచుకోవడం ఎలాగో మీకు తెలుసని భరోసా ఇస్తుంది. ఇది మీ క్రెడిట్ స్కోర్‌ను పెంచుతుంది, సులభంగా హోమ్ లోన్ పొందే అవకాశాలను పెంచుతుంది.

డిఫాల్ట్ నివారించండి 

మీరు లోన్ చెల్లింపులలో డిఫాల్ట్ అయితే లేదా క్రెడిట్ కార్డ్ బిల్లులు, EMIలను సకాలంలో చెల్లించలేకపోతే, మీ క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. క్రెడిట్ ఏజెన్సీకి మీపై నమ్మకం తగ్గుతుంది. ఈ పరిస్థితిలో మీరు గృహ రుణం లేదా క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసినప్పుడు సమస్య తలెత్తుతుంది. కాబట్టి, లోన్ పొందడానికి ముందు మీ లోన్ రీపేమెంట్ కెపాసిటీని బేరీజు వేసుకోవడం మంచిది. మీ ప్రస్తుత, భవిష్యత్తు ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని, మీరు సకాలంలో రుణాన్ని తిరిగి చెల్లించగలరా లేదా అని నిర్ణయించుకోండి. అలాగే, మీ క్రెడిట్ పరిమితిని మీ నెలవారీ జీతం కంటే చాలా తక్కువగా ఉంచండి. తద్వారా డిఫాల్ట్ అయ్యే అవకాశం ఉండదు.

ఆర్థిక క్రమశిక్షణ ముఖ్యం

మంచి క్రెడిట్ స్కోర్‌కు ఆర్థిక ప్రణాళిక చాలా ముఖ్యమైనది. దీని కోసం మీ ఖర్చులు, రుణ చెల్లింపు, క్రెడిట్ కార్డ్ బిల్లుల కోసం ప్రతి నెలా బడ్జెట్ చేయండి. దీంతో అవసరానికి మించి ఖర్చు చేయరు. అవసరమైన ఖర్చుల కోసం మీకు డబ్బు మిగిలి ఉంటుంది. మంచి క్రెడిట్ స్కోర్‌ కోసం మీరు అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. దీంతో, అనుకోని ఖర్చుల విషయంలో మీరు క్రెడిట్‌పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.

మంచి క్రెడిట్ స్కోర్‌ ఒక కళ 

కాలక్రమేణా మంచి అలవాట్లు క్రమంగా అభివృద్ధి చెందుతాయి. మంచి క్రెడిట్ స్కోర్ కూడా  ఒక కళే. ఇది అసురక్షిత రుణాలపై డిఫాల్ట్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మీ క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుంది. మీరు మంచి వడ్డీ రేటుతో సులభంగా గృహ రుణాన్ని పొందుతారు.

క్రెడిట్ స్కోరును బ్యాంకులు ఏవిధంగా అంచనా వేస్తాయి..

ర్యాంక్ – స్కోరు

ఎక్స్ లెంట్= 800 నుంచి 900

వెరీ గుడ్= 740 నుంచి 799 

గుడ్= 670 నుంచి 739

ఫేర్= 580 నుంచి 669

పూర్= 300 నుంచి 579

మీ క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉంటే సులభంగా, మంచి వడ్డీ రేటుతో గృహ రుణాన్ని పొందవచ్చు. క్రెడిట్ స్కోర్ పరిధి 300-900 మధ్య ఉంటుంది. 600 కంటే తక్కువ క్రెడిట్ స్కోర్ తక్కువగా పరిగణిస్తారు. 650-699 మధ్య స్కోర్ సంతృప్తికరం,  700-749 మధ్య స్కోర్ మంచిది. 750-900 మధ్య స్కోర్ ఉత్తమం చెప్తారు. మీ క్రెడిట్ స్కోర్ 750 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మీరు సులభంగా, మంచి వడ్డీ రేటుతో గృహ రుణం పొందుతారు.

ఎక్కువ సిబిల్ స్కోరు ఉండాలంటే ఏం చేయాలి?
  • మీ క్రెడిట్ కార్డు ఖర్చులను 30 శాతం పరిమితి లోపే ఉండేలా చూసుకోవాలి.
  • 30 శాతాని కంటే ఎక్కువగా అప్పులు చేస్తే గనుక అది మీ క్రెడిట్ రేటింగ్ ను ప్రమాదంలో పడేస్తుంది.
  • కనీస మొత్తం చెల్లించే బదులు డ్యూ టేడ్ (చెల్లింపు తేదీ) నాడే పూర్తిగా బాకీ క్లియర్ చేయండి.
  • కనీస మొత్తం చెల్లించి (మొత్తం డ్యూలో 5 శాతం), మీ బాకీని తర్వాత నెలకు క్యారీ ఫార్వార్డ్ చేస్తే సిబిల్ స్కోరు ప్రమాదంలో పడే అవకాశముంది.
నా పేరు మీద ఎన్ని లోన్‌లు ఉన్నాయో నేను ఎలా చెక్ చేసుకోవాలి?
  • క్రెడిట్ బ్యూరో(credit bureau’) వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • మీ పాన్ కార్డ్(PAN), ఇతర వివరాలతో లాగిన్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ని నిర్ధారించడానికి OTPని నమోదు చేయండి.
  • మీ క్రెడిట్ నివేదికను డౌన్‌లోడ్ చేయండి, మీ రుణాలను తనిఖీ చేయండి.

మీరు సంవత్సరానికి ఒక క్రెడిట్ నివేదికను ఉచితంగా పొందవచ్చు. కాబట్టి CIBIL వెబ్‌సైట్‌ని సందర్శించి దాన్ని పొందండి. ఇది కొన్ని నెలల వరకు చెల్లుబాటు అవుతుంది. మీరు ఆ నివేదికలోని ప్రతి రుణాన్ని తనిఖీ చేయవచ్చు. మీరు కొంత ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తే అది ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుంది.

భారతదేశంలో క్రెడిట్ నివేదికలను అందించడానికి మొత్తం 4 కంపెనీలు పనిచేస్తున్నాయి:
  1. CIBIL
  2. ఈక్విఫాక్స్ (Equifax)
  3. ఎక్స్‌పీరియన్ (Experian)
  4. హై మార్క్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (High Mark Credit Information Services)

క్రెడిట్ స్కోరును ఉచితంగా ఇచ్చే ఇతర వెబ్ సైట్లు

https://www.bankbazaar.com/credit-score.html

https://indialends.com/credit-application


Spread the love

Leave a Comment

error: Content is protected !!