చిన్న వయస్కలోనే బిలియనీర్
అతని నికర విలువ రూ. 33,000 కోట్లు
ప్రతి సంవత్సరం ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాను ప్రచురిస్తుంది. ఈ సంవత్సరం జాబితాను ప్రకటించినప్పుడు, సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ క్లెమెంటే డెల్ వెచియో. ఎందుకంటే కేవలం 19 ఏళ్లకే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బిలియనీర్ల జాబితాలో చేరిపోయాడు. దీని కారణంగా అతను ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన బిలియనీర్ అయ్యాడు. అతని తండ్రి, డెల్ వెచియో ప్రపంచంలోనే అతిపెద్ద కళ్లజోడు కంపెనీ అయిన ఎస్సిలోర్‌లుక్సోటికాకు ఛైర్మన్‌గా ఉన్నారు. అతని నికర విలువ $25.5 బిలియన్లు ఉంది. దీనిలో ఆయన కుమారుడు క్లెమెంటేకు వాటా $4 బిలియన్లు, అంటే అక్షరాలా రూ. 33,000 కోట్లు వచ్చింది.
నికర సంపద $4 బిలియన్లు
క్లెమెంట్ తండ్రి డెల్ వెచియో $25.5 బిలియన్ల నికర విలువను కలిగి ఉన్నాడు. గత సంవత్సరం 87 సంవత్సరాల వయస్సులో మరణించిన తరువాత అతని ఆస్తి ఇప్పుడు అతని భార్య మరియు 6 మంది పిల్లలకు వారసత్వంగా వచ్చింది. దీని కారణంగా క్లెమెంటే 2022లో ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన బిలియనీర్ అయ్యాడు. అతను లక్సెంబర్గ్‌లోని తన తండ్రి కంపెనీ డెల్ఫిన్‌లో 12.5 శాతం వాటాకు కూడా అర్హుడు. ప్రస్తుతం, ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, అతని నికర విలువ 4 బిలియన్ డాలర్లు (రూ. 33,000 కోట్లు) ఉంది.
అంత సంపద ఉన్నా చదువు మానలేదు..
బిలియనీర్ అయినప్పటికీ, క్లెమెంట్ తన చదువును కొనసాగించాడు. సైన్స్ అండ్ టెక్నాలజీపై ఎక్కువ ఆసక్తి ఉన్నందున, తన కెరీర్‌ను అందులోనే చేసుకోవాలనుకుంటున్నాడు.