పెట్టుబడికి ఏది సరైనది..

Spread the love

ఎఫ్డి, గోల్డ్, షేర్ మార్కెట్ వీటిలో ఏది బెటర్
గతేడాది వేటిలో ఎక్కువ లాభం వచ్చింది

సురక్షితమైన పెట్టుబడిగా పోస్టాఫీస్ పథకాలు, ఎఫ్డి, బంగారం మెరుగైనవి. అయితే వేగంగా రాబడి రావాలంటే, రిస్క్ తీసుకునే వారు అయితే స్టాక్ మార్కెట్లో డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు.

పెట్టుబడి మార్గాలు..
ఎవరైనా పెట్టుబడి పెట్టాలని అనుకుంటే రెండు ప్రశ్నలు మదిలోకి వస్తాయి. ఒకటి భద్రత, మంచి రాబడి. డబ్బు సురక్షితంగా ఉంటేనే మనం పెట్టుబడి పెడతాం. మన ఇన్వెస్ట్ చేసిన డబ్బు సురక్షితంగా లేకపోతే అది ఏమాత్రం సరైనది కాదు. సురక్షితమైన పెట్టుబడిలో పోస్ట్ ఆఫీస్ పథకాలు ఉత్తమ ఎంపిక అని చెప్పవచ్చు. భద్రత పరంగా ఎఫ్డి కూడా మంచిదే. బంగారం, స్టాక్ మార్కెట్‌లో డబ్బు పెట్టుబడి పెట్టడానికి కూడా ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. గత ఏడాదిలో ఎక్కడ ఎక్కువ లాభం వచ్చిందో తెలుసుకుందాం.

షేర్ మార్కెట్
గత ఏడాదిలో స్టాక్ మార్కెట్ రాకెట్ వేగంతో పెరిగింది.
గత ఒక్క ఏడాదిలోనే పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ నుండి అత్యధిక రాబడిని పొందారు.
2020లో సెన్సెక్స్ 38.9 శాతం లాభం చూసింది.
చాలా షేర్లు ఒక్క ఏడాదిలోనే పెట్టుబడిదారుల రెట్టింపు లాభాలను ఇచ్చాయి.
గతేడాదిని పరిశీలిస్తే స్టాక్ మార్కెట్ మిగిలిన పెట్టుబడి ఎంపికల కంటే అత్యంత మెరుగ్గా ఉంది.

ఫిక్స్ డ్ డిపాజిట్
బ్యాంక్ ఫిక్స్ డ్ డిపాజిట్లు చూస్తే గత కొన్నేళ్లుగా వీటి వడ్డీ రేట్లు చాలా తగ్గాయి. ప్రజలు ఇప్పుడు వీటిలో డబ్బు పెట్టుబడి పెట్టడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు. ఎఫ్ డిలపై సుమారు 5.1 శాతం వడ్డీ రేటు వస్తోంది. ఇది షేర్ మార్కెట్, ఇతర వాటితో పోలిస్తే చాలా తక్కువనే చెప్పాలి. కానీ భద్రత విషయంలో ఇంతకు మించిన ఎంపిక మాత్రం లేదు. మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది.

బంగారం
2020లో గోల్డ్ ఆశించినంతగా రాబడి ఇవ్వలేదు. అయితే కరోనా సమయంలో కొంత వేగంగా పెరిగింది. కానీ మళ్లీ తగ్గుముఖం పట్టింది. ఏడాది బంగారంలో రాబడి 4.72 శాతం ఉంది. గతేడాది ఆగస్టులో గోల్డ్ రికార్డు స్థాయికి చేరుని అందరినీ ఊరించింది. ఇప్పుడు మాత్రం ఈ రేటు అప్పటి కంటే రూ .8500 తక్కువగా ఉంది. అంటే బంగారం రేట్లు తగ్గాయి, దీనిలో పెట్టుబడి పెట్టినా నష్టమే ఉందని చెప్పాలి.

పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్
ఇక పోస్టాఫీసు పథకాల విషయానికొస్తే, పిపిఎఫ్‌ లో అత్యధికంగా 7.1 శాతం రాబడి పొందవచ్చు. ఇది బ్యాంక్, ఇతర పథకాల కంటే ఎక్కువ వడ్డీ రేటే అని చెప్పాలి. అంతేకాదు పోస్టాఫీస్ స్కీమ్స్ అత్యంత సురక్షితమైనవి. వీటిలో డబ్బుకు బ్యాంక్ ఎఫ్ డిలాగే భరోసా ఉంటుంది. కానీ రిస్క్ తీసుకునే వారు అయితే షేర్ మార్కెట్ వేగంగా రాబడిని ఇస్తుంది.


Spread the love
error: Content is protected !!